Telangana: చంద్రబాబుకు, సీఎం జగన్‌కు శాసనసభలో థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్
తెలంగాణలో డెవపల్‌మెంట్ ను పక్కరాష్ట్రాల సీఎం, ప్రతిపక్ష నేతలు గుర్తించి కొనియాడినా ఇక్కడి విపక్షాలకు కనిపించడం లేదన్నారు కేటీఆర్. అసెంబ్లీలో పల్లె, పట్టణ ప్రగతిపై చర్చ సందర్భంగా ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఆయన చంద్రబాబు గురించి ఏం ప్రస్తావించారు..? సీఎం గురించి ఏమని వ్యాఖ్యానించారు.. తాను చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోతే వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని ఓడించండి అని మంత్రి కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆ డీటేల్స్ ఇప్పుడు చూద్దాం...
పల్లె, పట్టణ ప్రగతిపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. “పక్క రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఒక మాటన్నారు. నేను టీవీల్లో చూసినా. ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే, తెలంగాణలో 100 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి. ఇవాళ తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రాలో 50 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి వచ్చింది అని చంద్రబాబునాయుడు గారు చెప్పారు. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వానికి రైతులపై ప్రేమ ఉంది. అందుకే మోటార్లకు మీటర్లు పెట్టమని మెడమీద కత్తి పెట్టినా ఒప్పుకోవడం అని బాబు గారు వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రంలో మంచి జరిగిందని చెప్పినందుకు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు గారిని నేను అభినందిస్తున్న. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. తెలంగాణలో ఉన్న సుస్థిరత, శాంతి భద్రతలను మెచ్చుకుంటూ దిశ సంఘటన అనంతరం ప్రభుత్వం స్పందించిన తీరుకు ఆయన ముగ్ధుడై నిండు శాసనసభలో ఏపీ ముఖ్యమంత్రి ఐ సెల్యూట్ కేసీఆర్ అన్నారు. ఇందుకు జగన్ గారికి కూడా థ్యాంక్స్ చెబుతున్నా. అక్కడ జగన్ గారికి, చంద్రబాబు గారికి అర్థం అవుతుంది. మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నేతలకు మాత్రం అర్థం కావడం లేదు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.