Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అసెంబ్లీ లోపల సమావేశాలు.. పోలీసుల ముందే బయట పెట్రోల్ పోసుకున్న బాధితుడు

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పెద్ద ఎత్తున అసెంబ్లీ బయట పోలీసులు మోహరిస్తారు. సుమారు 1000 మంది పోలీసులతో అసెంబ్లీకి వచ్చే నాలుగు దిక్కులపై పోలీసులు అలర్ట్ గా ఉంటారు. అయితే ఎప్పుడు అసెంబ్లీ జరిగిన మధ్యాహ్నం వరకు మాత్రమే అసెంబ్లీ బయట ముట్టడీల హడావిడి ఉంటుంది. పైగా ఈరోజు ఆర్టీసీ రాజ్ భవన్ ముట్టడి కూడా ఉండటంతో సగం పోలీస్ బందోబస్తు అంతా కూడా రాజ్ భవన్ మోహరించింది.

Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Anil kumar poka

Updated on: Aug 05, 2023 | 6:06 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులుగా సాగుతున్నాయి. ఎన్నికల ముందు జరుగుతున్న చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో తమ సమస్యలు పరిష్కారించాలని చాలా సంఘాలు అసెంబ్లీని ముట్టడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయల్లో అసెంబ్లీకి వచ్చే నలదిక్కులను పోలీసులు తమ ఆధినంలోకి తీసుకున్నారు. గడిచిన రెండు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ ముట్టడికి యత్నించిన సుమారు 100 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో అనూహ్యంగా అసెంబ్లీ ముందుకొచ్చిన వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంకు చెందిన భూ నిర్వాసితుల సంఘం మెంబర్ ఆంజనేయులు భూసేకరణ పరిహారం కోసం 5 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. 2017 లో ప్రభుత్వం భూసేకరణ చేస్తూ రైతులకు పరిహారం ఇచ్చింది. అప్పుడు కొంత మందికే పరిహారం ఇచ్చి మిగతా పరిహారం అంతా స్థానిక ప్రజాప్రతినిధులు.. వారి బినామీలు కలిసి మొత్తం కాజేస్తున్నారని ఆంజనేయులు ఆరోపించాడు. అయితే షాబాద్ మండలంలోని సర్వే నెంబర్ 190,195, 163 లో ఉన్న 2 వేల ఎకరాల భూమినీ సాగు చేసుకోవడానికి 1970 లో ఎస్సీ, బీసీ, ఎస్టీలకు ప్రభుత్వం భూమిని కేటాయించింది..

అసెంబ్లీ బయట నిరసనలు, తోపులాట అలజడి సాధారణంగానే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పెద్ద ఎత్తున అసెంబ్లీ బయట పోలీసులు మోహరిస్తారు. సుమారు 1000 మంది పోలీసులతో అసెంబ్లీకి వచ్చే నాలుగు దిక్కులపై పోలీసులు అలర్ట్ గా ఉంటారు. అయితే ఎప్పుడు అసెంబ్లీ జరిగిన మధ్యాహ్నం వరకు మాత్రమే అసెంబ్లీ బయట ముట్టడీల హడావిడి ఉంటుంది. పైగా ఈరోజు ఆర్టీసీ రాజ్ భవన్ ముట్టడి కూడా ఉండటంతో సగం పోలీస్ బందోబస్తు అంతా కూడా రాజ్ భవన్ మోహరించింది. ఇదే అదునుగా చూసుకున్న పలు సంఘాలు శనివారం పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడి చేశాయి. మరోవైపు రంగారెడ్డి జిల్లా ఆల్మాస్గూడలో గ్రీన్ జోన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు.

ఇవి కూడా చదవండి

మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయటంతో పాటు అభివృద్ధి కోసం 500 కోట్ల రూపాయలు కేటాయించాలని మున్నూరు కాపు సంఘం నేతలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. మరోవైపు ఫీజు రీయంబర్స్‌మెంట్‌‎తో పాటు పెండింగ్‎లో ఉన్న స్కాలర్షిప్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ 50 మంది పీడీఎస్‌యూ నేతలు ఒక్కసారిగా అసెంబ్లీ వైపు చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు వారిని అసెంబ్లీ వైపు వెళ్లకుండా నిలువరించి రోడ్డుపైనే అరెస్టు చేశారు. ఈ సందర్భంలో పోలీసులకు పీడీఎస్‌యూ నేతలకు తీవ్ర తోపులాట జరిగింది. ఇక మధ్యాహ్నం తర్వాత అంతా కూల్ గా సాగుతున్న తరుణంలో ఒక్కసారిగా ఆటోలో నుండి దిగిన ఆంజనేయులు అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు వ్యక్తిని కాపాడారు. పెట్రోల్ పోసుకున్న అతని ఒంటిపై వెంటనే నీళ్లు చల్లిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఇంతమంది బందోబస్తు ఉన్నప్పటికీ అనూహ్యంగా ఆటోలో నుండి దిగి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేగింది.

హెల్త్ సూపర్ వైజర్ దారుణ హత్య.. మిరపతోటలో గొడ్డలితో నరికి చంపిన
హెల్త్ సూపర్ వైజర్ దారుణ హత్య.. మిరపతోటలో గొడ్డలితో నరికి చంపిన
పుచ్చకాయలోని తెల్లని భాగం పొరబాటున ఎప్పుడైనా తినేశారా?
పుచ్చకాయలోని తెల్లని భాగం పొరబాటున ఎప్పుడైనా తినేశారా?
ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి క్రైమ్ థ్రిల్లర్..ఊహించని ట్విస్టులు
ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి క్రైమ్ థ్రిల్లర్..ఊహించని ట్విస్టులు
ఓవైపు వివాదాలు.. మరోవైపు దిమ్మతిరిగే కలెక్షన్స్..
ఓవైపు వివాదాలు.. మరోవైపు దిమ్మతిరిగే కలెక్షన్స్..
అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెర
అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెర
టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా?
టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా?
మీరూ రాత్రి భోజనంలో అన్నం తింటున్నారా?
మీరూ రాత్రి భోజనంలో అన్నం తింటున్నారా?
ఈ చిన్న అలవాట్లతో మీ పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుంది..!
ఈ చిన్న అలవాట్లతో మీ పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుంది..!
మరో ఘోర రైలు ప్రమాదం.. మంటల్లో లోకో పైలెట్లు సహా ముగ్గురు మృతి..!
మరో ఘోర రైలు ప్రమాదం.. మంటల్లో లోకో పైలెట్లు సహా ముగ్గురు మృతి..!
మోనాలిసా డైరెక్టర్ అరెస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్..
మోనాలిసా డైరెక్టర్ అరెస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్..