Hyderabad: కానిస్టేబుల్ బైక్ కొట్టేశారు.. దాన్ని దేనికి వాడుతున్నారో తెలిస్తే మీ మతిపోద్ది
నల్గొండ జిల్లాకు చెందిన రజనీకాంత్ ఐటిఐ చదువుతున్నాడు. అతడికి మాదాపూర్ మస్తాన్ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ మహమ్మద్ సమీర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. ఈ ఇద్దరు స్నేహితులుగా మారారు. అప్పటికే సమీర్‌పై రెండు చోరీ కేసులు కూడా ఉన్నాయి. ఇద్దరూ కలిసి గంజాయి సరఫరా ప్రారంభించారు. రజినీకాంత్ గ్రామానికే చెందిన బీటెక్ విద్యార్థి సాత్విక్ రెడ్డి... సూర్యాపేట జిల్లాకు చెందిన డిగ్రీ విద్యార్థి వంశీ... ఖమ్మం ప్రాంతానికి చెందిన మల్టీ మీడియా విద్యార్థి హేమంత్.. వారితో జట్టు కట్టారు.
హైదరాబాద్, ఆగస్టు 5: నగరంలో గంజాయి రవాణా విపరీతంగా పెరుగుతుంది. రోజుకి ఒక్క కేసు అయిన సరే నమోదు అవుతున్న పరిస్థితి. ఇప్పటికే కిలోల కొద్దీ గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.. అయినా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. ఈ దిక్కుమాలిన పనిలోనూ క్రియేటివిటీ. ఒక్కొ స్మగ్లర్.. పోలీసులకు చిక్కకుండ ఉండేందుకు ఒక్కే ఎత్తు వేస్తూ ఉంటారు. రోజురోజుకు అప్‌డేట్ అవుతూ పోలీసులనే విస్మయానికి గురి చేస్తున్నారు కొందరు పెడ్లర్లు. గంజాయిని ఉక్కుపాదంతో అణిచివేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఎంత భవిష్యత్ కలిగిన యువతను నిర్వీర్యం చేస్తున్న గంజాయిని కూకటి వేళ్లతో పెకిలించివేయాలని సీఎం కేసీఆర్ గతంలోనే ఆదేశించారు. ఈ క్రమంలోనే పోలీసులు కూడా నిత్యం సోదాలు, చెకింగ్స్ చేస్తూ గంజాయిని రూపుమాపేందుకు విసృతంగా పనిచేస్తున్నారు. తాజాగా గంజాయి రవాణా చేస్తున్న నలుగురు విద్యార్థులుతో సహా ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేశారు రాచకొండ పోలీసులు.
కానిస్టేబుల్ బైకు కొట్టేసి…
గంజాయి కొనుగోలు చేసి నగరానికి తరలించేందుకు ఏకంగా ఓ ఏ ఆర్ కానిస్టేబుల్ బైక్ కొట్టేశారు ఈ ఇస్మార్ట్ కేటుగాళ్లు. అనంతరం దానిపై దర్జాగా ఒరిస్సా వెళ్లి సరుకు తీసుకొచ్చి విక్రయిస్తున్న నలుగురు విద్యార్థులతో పాటు ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన రజనీకాంత్ ఐటిఐ చదువుతున్నాడు. అతడికి మాదాపూర్ మస్తాన్ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ మహమ్మద్ సమీర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. ఈ ఇద్దరు స్నేహితులుగా మారారు. అప్పటికే సమీర్‌పై రెండు చోరీ కేసులు కూడా ఉన్నాయి. ఇద్దరూ కలిసి గంజాయి సరఫరా ప్రారంభించారు. రజినీకాంత్ గ్రామానికే చెందిన బీటెక్ విద్యార్థి సాత్విక్ రెడ్డి… సూర్యాపేట జిల్లాకు చెందిన డిగ్రీ విద్యార్థి వంశీ… ఖమ్మం ప్రాంతానికి చెందిన మల్టీ మీడియా విద్యార్థి హేమంత్.. వారితో జట్టు కట్టారు. గంజాయి కొలుగోలుకు అవసరమైన డబ్బు ఇచ్చి అమ్మేందుకు కూడా సహకరించేవారు. ఈ విధంగా లాభాలను వాటాలు వేసి పంచుకునేవారు. తాజాగా ఒరిస్సా మల్కనగిరి జిల్లా చిత్రకొండలో గంజాయి కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా రజనీకాంత్, సమీర్‌లను ఎస్ఓటి, అబ్దుల్లాపూర్ మెట్టు పోలీసులు పట్టుకున్నారు. వీరు ఇచ్చిన సమాచారంతో మిగతా ముగ్గురుని అరెస్టు చేశారు. ఈ విధంగా వారి నుంచి ఐదు కిలోల గంజాయి, వాహనం నాలుగు మొబైల్ ఫోల్సిన స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి చాలా పెద్ద వ్యసనం. దీని బారినపడి ఎంతోమంది జీవితాలను నాశనం చేసుకున్నారు. కలలు నెరవేర్చుకోవాల్సిన వయస్సులో కలల్లో బతికేస్తున్నారు. వారిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు గంజాయి గురించి సమాచారం తెలిసినా, గంజాయి సేవిస్తూ ఎవరైనా కనిపించినా.. 100 సమాచారం ఇవ్వండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..