Munugodu: టీఆర్‌ఎస్‌ను చిత్తుగా ఓడించాలి.. బీజేపీ గెలుపు ఖాయం.. బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

తెలంగాణలో మునుగోడు బై ఎలక్షన్.. పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి అన్ని పార్టీల నేతలు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో అధికార, విపక్షాల...

Munugodu: టీఆర్‌ఎస్‌ను చిత్తుగా ఓడించాలి.. బీజేపీ గెలుపు ఖాయం.. బండి సంజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Bandi Sanjay
Follow us

|

Updated on: Oct 24, 2022 | 7:15 PM

తెలంగాణలో మునుగోడు బై ఎలక్షన్.. పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి అన్ని పార్టీల నేతలు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నువ్వెంతంటే నువ్వెంత అంటూ ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల నడుమ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మునుగోడులో దొడ్ది దారిన గెలవాలని టీఆర్‌ఎస్‌ పార్టీ కుట్రలు చేస్తోందన్న బండి సంజ్.. డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోందని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ వైఖరిని మునుగోడు ప్రజలు గమినిస్తున్నారని హెచ్చరించారు. మునుగోడులో ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్‌ను మార్చే ఎన్నిక అని బండి సంజయ్ అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదన్న సంజయ్.. టీఆర్‌ఎస్‌ను చిత్తుగా ఓడించాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ సర్వే చూసినా బీజేపీ గెలుపు ఖాయమని నివేదికలు చెబుతున్నాయని బండి సంజయ్ అన్నారు. కానీ సోషల్ మీడియా మాత్రం టీఆర్ఎస్ ఫేక్ వార్తలు ప్రచారం చేయిస్తోందని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలని బండి సంజయ్ స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ నిధులతోనే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. ఇక కమ్యూనిస్టు ఎర్రగులాబీలు. రూ.100 కోట్లతో కేసీఆర్ విమానం ఎట్లా కొంటున్నారు. విదేశాల్లో పెట్టుబడులు ఎలా పెడుతున్నారు. మునుగోడులో పోటీ చేస్తున్న అభ్యర్థులను బేరీజు వేసుకోండి. మునుగోడులో ఆపదలో ఆదుకుంటూ ప్రజలకు మంచి చేస్తున్న వారు గెలవాలా? గడీల పాలనలో పని చేసే వారు గెలవాలా?. ఆలోచించి ఓటు వేయాలి. గులాబీ మంత్రులు, నేతలు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో గెలవడం కోసం మంత్రులు, ఎమ్మెల్యేల, పోలీసు వాహనాల్లో టీఆర్ఎస్ డబ్బులు తరలిస్తున్నారు. కేసీఆర్ కు నిధులు ఇస్తున్న కంపెనీలను వదిలిపెట్టేది లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమార్కులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.

– బండి సంజయ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు

ఇవి కూడా చదవండి

కాగా.. చౌటుప్పల్‌ మండలం జై కేసారం లో జరిగిన ఎన్నికల ప్రచారంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య వివాదం నెలకొంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

Latest Articles
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
తప్ప తాగి ట్రిపుల్ రైడింగ్.. ఆపిన పోలీసుపై వీరంగం.. వీడియో వైరల్
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!