AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JP Nadda: ఇలాంటి అవకాశం మరోసారి రాదు.. కష్టపడి పనిచేయాలన్న జేపీ నడ్డా..

గ్రౌండ్‌ లెవల్లో పార్టీని బలోపేతం చేయాలని తెలంగాణ బీజేపీ పదాదికారులకు సూచించారు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పనిచేస్తేనే ప్రతిఫలం ఉంటుందని అన్నారు. తెలంగాణలో అధికారమే దిశగా పనిచేయాలని నేతలకు సూచించారు..

JP Nadda: ఇలాంటి అవకాశం మరోసారి రాదు.. కష్టపడి పనిచేయాలన్న జేపీ నడ్డా..
JP Nadda
Sanjay Kasula
|

Updated on: May 05, 2022 | 9:46 PM

Share

గ్రౌండ్‌ లెవల్లో పార్టీని బలోపేతం చేయాలని తెలంగాణ బీజేపీ పదాదికారులకు సూచించారు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) పనిచేస్తేనే ప్రతిఫలం ఉంటుందని అన్నారు. తెలంగాణలో అధికారమే దిశగా పనిచేయాలని నేతలకు సూచించారు. ఓటర్లను పెంచుకున్నప్పుడు అధికారంలోకి వస్తామని…ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాలని అన్నారాయన. కాసేపట్లో మహబూబ్‌నగర్‌లో జరిగే బహిరంగసభలో జేపీ నడ్డా ప్రసంగించనున్నారు. తెలంగాణలో బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. కేసీఆర్ సర్కార్ అవినీతిపై నాయకులంతా నిలదీయాలని సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మహబూబ్​నగర్​లో నిర్వహించిన బీజేపీ రాష్ట్రస్థాయి  పదాధికారుల సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. దళిత బస్తీలకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలని వివరించారు.

అయితే.. నెలరోజుల ప్రణాళిక అవసరముందన్నారు. యువమోర్చా, యువజన సంఘాలు, స్పోర్ట్స్ పర్సన్స్​తో మాట్లాడాలని పేర్కొన్నారు. మహిళా మోర్చా స్వయం సహాయక బృందాలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు. నేను పార్టీ కోసం పనిచేస్తున్నాని కాకుండా.. పార్టీ నాకు పనిచేసే అవకాశం ఇచ్చిందని ఫీల్‌ కావాలని నేతలకు హితబోధ చేశారు.

ముందస్తు ప్రణాళిక లేకుండా జిల్లా పర్యటనలు చేయకండని నడ్డా సూచించారు. ఏం మాట్లాడాలో ముందే సన్నద్ధం కావాలని.. కేసీఆర్‌ సర్కార్‌ అవినీతి, కేంద్ర ప్రభుత్వ పథకాలపై మాట్లాడాలంటే నెల రోజుల ముందే నిర్ణయించుకోవాలని తెలిపారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణలో కొత్త వారు పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని.. అలాంటి వారిని ఆహ్వానించాలన్నారు. పార్టీలో ప్రాధాన్యతపై ఇంకొకరితో పోల్చుకోవద్దని.. ఇలాంటి అవకాశం మరోసారి రాదరు. కష్టపడి పనిచేసి పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని పార్టీ అధ్యక్షుడిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నానని వెల్లడించారు. అందరితో మీ కన్నా బలమైన నేతలను పార్టీలోకి తీసుకొచ్చేలా పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఇవి కూడా చదవండి: PK Mission: కొత్త పార్టీ పెట్టడం లేదు.. పాదయాత్ర చేస్తాను.. ఆయన పాలనపై పీకే కీలక వ్యాఖ్యలు..

Terrorist Attack Plan: పాక్‌ నుంచి డ్రోన్‌ల సహాయంతో పేలుడు పదార్దాలు.. ఆదిలాబాద్‌లో భారీ ఉగ్ర కుట్రకు పాకిస్తాన్‌లో ప్లాన్‌..

ఉత్కంఠ పోరులో వైసీపీకే దుగ్గిరాల ఎంపీపీ పీఠం.. వ్యూహాత్మకంగా గెలిచిన రూపవాణి..

ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు