ఉత్కంఠ పోరులో వైసీపీకే దుగ్గిరాల ఎంపీపీ పీఠం.. వ్యూహాత్మకంగా గెలిచిన రూపవాణి..

ఉత్కంఠ పోరులో దుగ్గిరాల ఎంపీపీ పీఠం వైసీపీకే దక్కింది. ఆ పార్టీ బీసీ మహిళా ఎంపీటీసీ సంతోషి రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీ మహిళా కోటాలో ఆమె ఒక్కరే బీఫామ్‌ ఇవ్వడం, టీడీపీకి బీసీ మహిళా ఎంపీటీసీ లేకపోవడంతో..

ఉత్కంఠ పోరులో వైసీపీకే దుగ్గిరాల ఎంపీపీ పీఠం.. వ్యూహాత్మకంగా గెలిచిన రూపవాణి..
Duggirala Mpp
Follow us

|

Updated on: May 05, 2022 | 5:04 PM

ఉత్కంఠ పోరులో దుగ్గిరాల ఎంపీపీ(Duggirala MPP) పీఠం వైసీపీకే దక్కింది. ఆ పార్టీ బీసీ మహిళా ఎంపీటీసీ సంతోషి రూపవాణి( Santoshi Rupavani ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీ మహిళా కోటాలో ఆమె ఒక్కరే బీఫామ్‌ ఇవ్వడం, టీడీపీకి బీసీ మహిళా ఎంపీటీసీ లేకపోవడంతో వైసీపీ గెలుపు ఈజీ అయింది. అయితే ఈ ఎన్నికలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. వైసీపీకి మరో బీసీ మహిళా ఎంపీటీసీ పద్మావతి ఉన్నా ఆమె రాకుండా జాగ్రత్త పడ్డారు. నిన్నటి నుంచి పద్మావతి ఎక్కడ ఉన్నారన్న ఆచూకీ ఇంత వరకు తెలియలేదు.

గతేడాది జరిగిన దుగ్గిరాల ఎంపీపీ పరిధిలోని ఎంపీటీసీ ఎన్నికల్లో మొత్తం 18 సీట్లకుగానూ తెలుగు దేశం పార్టీకి 9, అధికార పార్టీ వైసీపీకి 8, జనసేనకు 1 సీటు లభించాయి. అయితే ఇది ముఖ్యమంత్రి కార్యాలయం మంగళగిరి నియోజకవర్గం పరిధిలో దుగ్గిరాల కూడా ఉండటంతో ఇక్కడ వైసీపీ ఓడితే విపక్ష టీడీపీ అది జగన్ ఓటమిగా ప్రచారం చేసే అవకాశం ఉండటంతో అధికార పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదిపింది. ఇదిలావుంటే.. టీడీపీ నుంచి వైసీపీ నుంచి గెలిచి ఎంపీపీ స్ధానానికి పోటీ పడుతున్న పద్మావతి అనే మరో ఎంపీటీసీని కనిపించకుండా పోవడం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఇవి కూడా చదవండి

నిన్న ఎమ్మెల్యే ఆర్కేతో పాటు క్యాంప్‌కు వెళ్లిన పద్మావతి ఇవాళ ఎన్నికకు గైర్హాజరయ్యారు. కేవలం ఐదుగురు సభ్యుల మద్దతు మాత్రమే ఉన్న వైసీపీ ఎంపీటీసీ సంతోషి రూపవాణి మినహా మరో అభ్యర్ధి మూడు పార్టీల్లోనూ దొరకలేదు. దీంతో ఏకైక బీసీ మహిళ అయిన రూపవాణి ఎన్నిక ఏకగ్రీవంగా మారింది. రెండు వైస్ ఎంపీపీ సీట్లను టీడీపీ, జనసేన చెరొకటి దక్కించుకున్నాయి. అయితే ఈ ఎన్నికల్ని మాత్రం వైసీపీ సభ్యులు బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు.