AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana BJP: గెలుపు గుర్రాలకే సీట్లు.. అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధిష్టానం తీవ్ర కసరత్తు.. అమిత్ షా కీలక సూచనలు..

మిగతా 13 స్థానాల్లో ఒక్కో స్థానానికి ముగ్గురు నుంచి ఐదుగురు వరకు ఆశావహులున్నారు. మహబూబ్‌నగర్ స్థానం నుంచి డీకే అరుణ్, జితేందర్ రెడ్డి ఇద్దరూ పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇద్దరిలో ఒకరి పేరును నాయకత్వం ఖరారు చేసే అవకాశం ఉంది. మల్కాజిగిరి, జహీరాబాద్ నియోజకవర్గాలకు ఎక్కువ మంది పోటీపడుతున్నారు.

Telangana BJP: గెలుపు గుర్రాలకే సీట్లు.. అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధిష్టానం తీవ్ర కసరత్తు.. అమిత్ షా కీలక సూచనలు..
Amit Shah
Shaik Madar Saheb
|

Updated on: Feb 25, 2024 | 8:34 AM

Share

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజారీటీ సీట్లను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బీజేపీ జాతీయ నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో తెలంగాణ కోర్ కమిటీ సమావేశం జరిగింది. భేటీలో తెలంగాణ ఇంఛార్జిలు తరుణ్ చుగ్, చంద్రశేఖర్, సునీల్ బన్సల్, బీజేపీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి శివప్రకాశ్, తెలంగాణ నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ నేతలు బండి సంజయ్, డా. కే. లక్ష్మణ్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, ఈటల రాజేందర్ తదితరులు హాజరయ్యారు. 17 లోక్‌సభ స్థానాల్లో నలుగురు సిట్టింగ్ అభ్యర్థులుండగా.. మిగతా 13 స్థానాల్లో ఆశావహులు, వారి బలాబలాలు, సామాజిక సమీకరణాలపై చర్చించింది. సిట్టింగ్ స్థానాల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంపై ఎంపీ సోయం బాపూరావుతో పాటు మరికొందరి పేర్లను కూడా పరిశీలించినట్టు తెలుస్తుంది.

మిగతా 13 స్థానాల్లో ఒక్కో స్థానానికి ముగ్గురు నుంచి ఐదుగురు వరకు ఆశావహులున్నారు. మహబూబ్‌నగర్ స్థానం నుంచి డీకే అరుణ్, జితేందర్ రెడ్డి ఇద్దరూ పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇద్దరిలో ఒకరి పేరును నాయకత్వం ఖరారు చేసే అవకాశం ఉంది. మల్కాజిగిరి, జహీరాబాద్ నియోజకవర్గాలకు ఎక్కువ మంది పోటీపడుతున్నారు. మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు ఈటల రాజేందర్ ఆసక్తి చూపుతుండగా.. జాతీయ నేతల్లో మురళీధర్ రావు పేరు కూడా బలంగా వినిపిస్తుంది. మరోవైపు మల్కాజ్‌గిరి నుంచి ప్రైవేట్‌ విద్యా సంస్థల అధిపతి మల్క కొమురయ్య పేరును కూడా పార్టీ నాయకత్వం పరిశీలిస్తుంది.

ఇక జహీరాబాద్ నియోజకవర్గం నుంచి జైపాల్ రెడ్డి, సురేశ్ రెడ్డితోపాటు సినీ నిర్మాత దిల్ రాజు కుటుంబం నుంచి గురించి చర్చించినట్టు తెలుస్తుంది. ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా 2 పర్యాయాలు ప్రాతినిథ్యం వహించిన బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు చర్చ జరిగింది. బీబీ పాటిల్ తరహాలోనే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీల్లో మరికొందరు బీజేపీలో చేరేందుకు మంతనాలు సాగిస్తున్నారు. వారి పేర్లను కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. ఇక అభ్యర్థుల ఎంపికపై పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు రాజ్యసభ సభ్యులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సభ్యులు డా.లక్ష్మణ్.

రాష్ట్ర కోర్ కమిటీ ఎంపిక చేసిన సుమారు 50 పేర్లతో కూడిన జాబితాను నడ్డాకు అందజేశారు కిషన్ రెడ్డి. ఫిబ్రవరి 29న బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ లేదా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి మెజారిటీ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..