BJP Mission Telangana: మిషన్ కాకతీయకు దీటుగా మిషన్ తెలంగాణ.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా కమలం పావులు
Telangana BJP: పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తూ తెలంగాణ ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా కమలం పావులు కదుపుతోంది. అక్టోబర్ ఒకటిన మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన సభలో తెలంగాణకు ప్రధాని ప్రకటించిన వరాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు, ములుగులో సమ్మక్క, సారక్క గిరిజన వర్సిటీ ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వాటా..

హైదరాబాద్, అక్టోబర్ 04: మిషన్ కాకతీయకు దీటుగా మిషన్ తెలంగాణను బీజేపీ తీవ్రతరం చేసినట్టు కనిపిస్తోంది. పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తూ తెలంగాణ ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగా కమలం పావులు కదుపుతోంది. అక్టోబర్ ఒకటిన మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన సభలో తెలంగాణకు ప్రధాని ప్రకటించిన వరాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు, ములుగులో సమ్మక్క, సారక్క గిరిజన వర్సిటీ ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వాటా పంపిణీ బాధ్యతలు ప్రస్తుతమున్న కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్‌కే అప్పగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
సమస్యను పరిష్కరించుకొని రెండు రాష్ట్రాలు ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వాటాలో స్పష్టత వస్తే తెలంగాణలోని 50 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. మరో వైపు కృష్ణా జలాల వాటా వివాదాన్ని పరిష్కరించేందుకు ఇన్నాళ్లకైనా కేంద్రం స్పందించిందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇది కేసీఆర్ సాధించిన విజయమని తెలిపారు.
మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ టార్గెట్ తెలంగాణగా బీజేపీ దూకుడు పెంచిందనే విషయం ఈ నాలుగు రోజుల్లో మరింత తేటతెల్లమైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




