AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana BJP: ‘తెలంగాణ’పై బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం.. ఇక కీలక భేటీలన్నీ ఢిల్లీలోనే..!

Telangana BJP: ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ముఖ్యమైన మీటింగ్ అయిన ఇక నుంచి ఢిల్లీనే వేదిక అని తెలుస్తోంది. అంతేకాదు ఇంటర్నల్ ఇష్యూస్ ఏమున్నా గానీ పార్టీ మీటింగ్ లో మాట్లాడాలని.. పార్టీ నిర్ణయం దాటి ఎవరు అనవసరపు కామెంట్స్ చేయొద్దని చాలా సీరియస్‌గా చెప్పినట్టు తెలుస్తుంది. ఎన్నికల వేళ రాష్ట్రలో ఎలాంటి స్ట్రాటజీ ప్లే చేయాలాన్న ఇట్టే ప్రభుత్వానికి తెలిసిపోతుందనే ఉద్దేశంతోనే ఢిల్లీలో ఆపరేషన్ జరపాలనే నిర్ణయం జరిగినట్టుగా చెప్తున్నాయి కాషాయ పార్టీ వర్గాలు..

Telangana BJP: ‘తెలంగాణ’పై బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం.. ఇక కీలక భేటీలన్నీ ఢిల్లీలోనే..!
Telangana BJP
Ashok Bheemanapalli
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Aug 06, 2023 | 4:34 PM

Share

హైదరాబాద్, ఆగస్టు 6: తెలంగాణలో ఎలాగైనా ఈసారి పాగా వేయాలనుకుంటున్న బీజేపీ ఆ దిశగా వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగా రోజుకో సరికొత్త నిర్ణయం తీసుకుంటూ భారతీయ జనతా పార్టీ.. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. మరికొన్ని నెలల్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయాత్తవుతున్న కాషాయ పార్టీ.. తెలంగాణ నాయకత్వ మార్పు నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే మిషన్ 75 పేరుతో ఆపరేషన్ స్టార్ట్ చేసిన బీజేపీ ఒక్కొక్క నాయకుడు ఏ ఏ పని చేయాలి? ఎలా ప్రజల్లోకి వెళ్లాలి..? పార్టీ విస్తరణ.. బలమైన నాయకత్వం.. ఎన్నికల్లో పోటీ.. ఇలా అన్ని అంశాలపై బ్లూ ప్రింట్లు ఇస్తూ మరి అధిష్టానం రోజూ మానిటరింగ్ చేస్తోంది. అయితే, ఈ తతంగమంతా మొత్తం కూడా ఢిల్లీలోనే జరుగుతుంది. దీనికి సంబంధించి ఢిల్లీలో ఒక వార్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు అగ్రనేతలు..

గతవారం కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇంట్లో అమిత్ షా ప్రత్యేక బేటీ జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర, జాతీయ నాయకులు పాల్గొన్నారు. ఈ మీటింగ్‌లో అమిత్ షా తెలంగాణ నాయకులకు పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎలా ముందుకు పోవాలి అనేదానిపై నేతలకు దిశ నిర్దేశం చేసినట్టుగా సమాచారం.. అందులో భాగంగా ఇక నుంచి కీలక భేటీలన్నీ ఢిల్లీలోనే జరపాలని అమిత్ షా నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ముఖ్యమైన మీటింగ్ అయిన ఇక నుంచి ఢిల్లీనే వేదిక అని తెలుస్తోంది. అంతేకాదు ఇంటర్నల్ ఇష్యూస్ ఏమున్నా గానీ పార్టీ మీటింగ్ లో మాట్లాడాలని.. పార్టీ నిర్ణయం దాటి ఎవరు అనవసరపు కామెంట్స్ చేయొద్దని చాలా సీరియస్‌గా చెప్పినట్టు తెలుస్తుంది. ఎన్నికల వేళ రాష్ట్రలో ఎలాంటి స్ట్రాటజీ ప్లే చేయాలాన్న ఇట్టే ప్రభుత్వానికి తెలిసిపోతుందనే ఉద్దేశంతోనే ఢిల్లీలో ఆపరేషన్ జరపాలనే నిర్ణయం జరిగినట్టుగా చెప్తున్నాయి కాషాయ పార్టీ వర్గాలు.. అలా కాకపోయినప్పటికీ.. స్ట్రాటజీ అమలు చేసే విషయంలో నాయకులకు కీలక సూచనలు చేయడానికి ఢిల్లీ అయితే బాగుంటుందని అగ్రనేతల అభిప్రాయమని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇక పార్టీలో జాయినింగ్‌కి సంబంధించిన అంశం కూడా చాలా సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తున్నారు బీజేపీ పెద్దలు.. ఎవరితో చర్చలు జరుపుతున్నారు.. ఎవరు పార్టీలో జాయిన్ అవుతున్నారు..? అనే అంశాన్ని ఒక సీక్రెట్ ఆపరేషన్ లాగా కొనసాగిస్తున్నారని టాక్‌.. ఢిల్లీలో పార్టీలో జాయిన్ అయ్యే వరకు కూడా వారి పేర్లను ఎక్కడా కూడా బయట బహిర్గతం చేయడం లేదు. కేవలం పెద్ద ఎత్తున జాయినింగ్స్ ఉంటాయి అన్న దానిపై మాత్రమే లీకులు ఇస్తున్నారని.. కానీ, చేరడం మాత్రం పక్కా అంటూ బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

మొత్తనికి రాష్టంలో గ్రాఫ్ తగ్గిందనుకున్న బీజేపీ కొత్త కొత్త వ్యూహలతో సరికొత్త ప్రాణాళికతో మళ్లీ బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని.. ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలనే ప్రయత్నం చేస్తున్నట్లు.. దీనిలో భాగంగా బీజేపీ అధిష్టానం రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే, కమలం పార్టీ ఇందులో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి మరి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..