Birla Planetorium: హైదరాబాద్‌లో బిర్లా ప్లానిటోరియం.. సరికొత్త విజువల్ వండర్ షో
విశ్వాన్ని అర్ధం చేసుకోవడంలో హై ఎనర్జీ ఫిజిక్స్ ఎంతో కీలకమైనది. ఈ విశ్వంలో రేడియేషన్ల ప్రభావంతో వెలువడే వేడి, వయోలెంట్ యునివర్స్ ప్రక్రియలు అద్భుతం. ఇన్నాళ్లు గెలాక్సీ, ఖగోళ వస్తువుల గురించి అవగాహన కల్పించిన జీపీ..
న్యూఢిల్లీ, జులై 18: విశ్వాన్ని అర్ధం చేసుకోవడంలో హై ఎనర్జీ ఫిజిక్స్ ఎంతో కీలకమైనది. ఈ విశ్వంలో రేడియేషన్ల ప్రభావంతో వెలువడే వేడి, వయోలెంట్ యునివర్స్ ప్రక్రియలు అద్భుతం. ఇన్నాళ్లు గెలాక్సీ, ఖగోళ వస్తువుల గురించి అవగాహన కల్పించిన జీపీ బిర్లా ప్లానిటోరియం ఇకపై విజ్ఞాన శాస్త్రాని విస్తృత పరిచేలా గెలాక్సీ సముహాల్లోని అత్యంత ఉష్ణం కలిగిన ఖగోళ దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చూపెడుతోంది.
విశ్వంలో ఉండే అతి భారీ వస్తువులతో పాటు గెలాక్సీ కేంద్రాల్లోని సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ చూట్టు ఉండే వేగవంతమైన వేడి వస్తువులను సైతం అధ్యయనం చేసేలా సరికొత్త ప్లానిటోరియం షో ఉంది. హై ఎనర్జీ రేడియేషన్ అనేది మన గెలాక్సీ, న్యూట్రాన్ స్టార్స్, సూపర్ నోవా అవశేషాలు, సూర్యుడు వంటి ముఖ్యమైన నక్షత్రాల గురించి కీలక సమాచారాన్ని అందిస్తుంది. అలాంటి సైన్స్ ను విద్యార్థులకు, అంతరిక్ష అద్భుతాలను తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారికి బిర్లా ప్లానిటోరియం సరికొత్త విజువల్ వండర్ షోను అందుబాటులోకి తెచ్చింది.
ది హాట్ అండ్ ఎనర్జిటిక్ యూనివర్స్
అనంత విశ్వంలో అద్భుతమైన గ్రహాలు, నక్షత్రాల గురించి విశ్వం పుట్టుకను తెలిపేలా ‘ది బయోగ్రఫీ ఆఫ్ ది యూనివర్స్’ ఇప్పటివరకు షో వేసేవారు. ఇక నుంచి ది హాట్ అండ్ ఎనర్జిటిక్ యూనివర్స్ పేరుతో విశ్వంతో పాటు రేడియేషన్ల కారణంగా భూమిపై మనకు తెలియని వేడి, యూనివర్స్ లో సంభవించే ప్రక్రియలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. విశ్వాన్ని అధ్యయనం చేసేవారికి ఎంతో ఉపయోగపడే ఈ షో.. అత్యధిక శక్తిగల ఖగోళ దృశ్యాలు, ఆధునిక ఖగోళశాస్త్రంలో విజయాలు, అబ్జర్వేటరీలు, విద్యుదయాస్కాంత వికిరణం ప్రాథమిక సూత్రాలు, హై ఎనర్జీ అస్ట్రోఫిజిక్స్ వంటి అంశాలపై ప్రేక్షకులు లీనమయి చూసే దృశ్యాలతో షో ఉంటుంది. ముఖ్యంగా ఆకాశంలో జరిగే అద్భుతాలు బ్లాక్ హోల్, కొత్త నక్షత్రాల నిర్మాణం, హై ఎనర్జీ రేడియేషన్ సహా ఎన్నో కీలక అంశాలు కళ్లముందు మెదులుతాయి.
ఆద్యంతం అనుభూతి
బిర్లా ప్లానిటోరియంలో ఖగోళాన్ని కళ్లముందు ఉంచే ఈ షో.. ఓ డోమ్ ఆకారంలో ఉండే థియోటర్ లో ప్రదర్శిస్తారు. ఉదయం 11.30కి ఇంగ్లీష్ లో , సాయంత్రం 4 గంటలకి హిందీలో, సాయంత్రం 6 గంటలకి తెలుగులో షో ఉంటుంది. రాత్రి 8.15 నిమిషాలకు ప్రేక్షకుల కోరిక మేరకు ఏదైన ఒక భాషలో షో ప్రదర్శిస్తారు. డోమ్ లాంటి థియోటర్ లోకి అడుగుపెట్టాక.. ఆకాశం వైపు చూస్తున్నట్లు కూర్చునేలా సిట్టింగ్ ఏర్పాటు చేశారు. షో మొదలైతే ఆకాశానికి అడ్డుగా ఉన్న డోమ్ తలుపులు తెరుచుకొని మన ఆకాశంలోకి వెళ్లినట్లు అనుభూతి కలుగుతోంది. ఖగోళం అంతా కళ్లముందుకు దిగి వచ్చి అద్భుతాలు తాండవం చేసినట్లు అనిపిస్తుంది. అంతటి కమనీయ ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేయాడానికి ఇంతకు మించిన సదావకాశం ఉండదు. నార్మల్ గా కూడా విశ్వం గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాడని ఎవరైనా వెళ్లి బిర్లా టెంపుల్ సమీపంలో ఉన్న ప్లానిటోరియంలో ఈ గెలాక్సీ షో చూడొచ్చు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.