Bird Walk Festival: కవ్వాల్ జంగిల్‌లో అందాల పక్షుల పండుగ.. పులుల అడ్డాలో పక్షి ప్రేమికుల సందడి

Bird Walk Festival: కవ్వాల్ జంగిల్‌లో అందాల పక్షుల పండుగ.. పులుల అడ్డాలో పక్షి ప్రేమికుల సందడి

Kavval Forest: కవ్వాల్ అభయారణ్యంలో పక్షుల కిలకిలరావాలతో కొత్త శోభ సంతరించుకోంది. వలస వస్తున్న పులులే కాదు పక్షులు సైతం కవ్వాల్ టైగర్ జోన్ లోకి ప్రకృతి ప్రేమికులకు

Shiva Prajapati

|

Feb 13, 2022 | 1:05 PM

Kavval Forest: కవ్వాల్ అభయారణ్యంలో(Kavval Forest) పక్షుల కిలకిలరావాలతో కొత్త శోభ సంతరించుకుంది. వలస వస్తున్న పులులే కాదు పక్షులు సైతం కవ్వాల్ టైగర్ జోన్(Kavval Tiger Zone) లోకి ప్రకృతి ప్రేమికులకు స్వాగతం పలుకుతున్నాయి. 300 రకాల పక్షులు విభిన్న, రకాల వన్యప్రాణులు, గాండ్రించే బెబ్బులులు, చిరుతలు పక్షి ప్రేమికుల కెమెరాల్లో అందంగా బంది అవుతున్నాయి. కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో తొలిసారిగా సాగుతున్న ‘బర్డ్ వాక్ ఫెస్టివల్‘(Bird Walk Festival) లో ఈ అందాలు పర్యాటకులకు నయనానందాన్ని కలిగిస్తున్నాయి. తెలంగాణ సర్కార్ చేపట్టిన హరితహారంతో అడవులు విస్తృతంగా పెరగడంతో విభిన్న రకాల పక్షులు కవ్వాల్ అభయారణ్యంలోకి వలస వస్తున్నాయంటున్నారు ప్రకృతి ప్రేమికులు

మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో తొలిసారిగా చేపట్టిన బర్డ్ వాక్ ఫెస్టివల్ కు విశేష స్పందన లభిస్తోంది. అందమైన పక్షులను తమ కెమెరాలలో బందించేందుకు పక్షి ప్రేమికులు సుదూరప్రాంతాల నుండి తరలి వచ్చారు. కవ్వాల్ అభయారణ్యం ఇందన్ పల్లి రేంజ్, జన్నారం రేంజ్ లలో బర్డ్ ఫెస్టివల్‌ లో రెండు రోజులుగా ఈ పక్షుల పండుగ ఉత్సాహంగా సాగుతోంది. పక్షుల కిలకిల రావాల నడుమ ప్రకృతి సోయగాలను ఆస్వాదించేందుకు.. పర్యావరణ ప్రేమికులు తెల్లవారుజామునే కవ్వాల్ అభయారణ్యంలోకి పయనమయ్యారు. ఫిబ్రవరి 12 సాయంత్ర ప్రారంభమైన ఈ పక్షి పండుగ.. 14 న తెల్లవారు జాముతో ముగియనుంది.

దేశం నలుమూలల నుంచి..

కవ్వాల్ టైగర్ జోన్ లో తొలిసారి సాగుతున్న బర్డ్ వాక్ ఫెస్టివెల్ కు అపూర్వ స్పందన లభిస్తోంది. బర్డ్‌వాక్ లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి పక్షి ప్రేమికులతో కవ్వాల్ టైగర్ జోన్ కలకలాడుతోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు, పక్షులను ఆసక్తిగా తిలకిస్తున్నారు పక్షి ప్రేమికులు. తొలిసారి సాగుతున్న కవ్వాల్ బర్డ్‌ వాక్ లో 58 మందికి అవకాశం కల్పించారు అటవిశాఖ అదికారులు. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళ నాడు, తెలంగాణ నుంచి బర్డ్‌వాక్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు పక్షి ప్రేమికులు తరలివచ్చారు. టైగర్‌జోన్‌లోని ఇందన్‌పల్లి రేంజ్‌లోని మైసమ్మకుంట, కల్పకుంట, గన్‌శెట్టి కుంటతో పాటు జన్నారం రేంజ్‌లోని గోండుగూడ, నీలుగాయికుంట, బైసన్‌కుంటలలో పర్యాటకులను రెండు భాగాలుగా విభజించి ఇందన్‌పల్లి రేంజ్‌, జన్నారం రేంజ్‌లలో పక్షులను వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు.

300 రకాల పక్షులు..

బర్డ్ వాక్ ఫెస్ట్ లో అందమైన పక్షులను పక్షి ప్రేమికులు తమ కెమెరాల్లో బందిస్తున్నారు. 300 రకాలకు పైగా పక్షులు తమకు తారసపడ్డాయని.. అందులో బార్ హెడెడ్ గూస్- చలినుండి కాపాడుకునేందుకు హిమాలయ పర్వాత ప్రాంతాల నుండి వలస వస్తున్న పక్షులు కనువిందు చేశాయని తెలిపారు. బాతు జాతిలోకెల్లా ఎత్తులో ఎగరడం ఈ పక్షుల ప్రత్యేకత. గ్రీన్ బీ ఈటర్ సీతాకోక చిలుకలు, వూలీ నెక్డ్ స్టార్క్- ఎండిపోయిన చెట్ల మధ్య గూడు కట్టుకునే పక్షులు, బిల్డ్ డక్- శీతాకాలంలో వలసపోయే పక్షులు కవ్వాల్‌ అభయారణ్యంలో దర్శనమిచ్చాయని తెలిపారు పక్షిప్రేమికులు.

సఫారీలలో ప్రయాణం..

కవ్వాల టైగర్‌జోన్‌లో సఫారీల ద్వారా ఇందన్‌పల్లి, జన్నారం రేంజ్‌లకు పక్షి ప్రేమికులను ఎఫ్‌డీవో మాధవరావు ఆధ్వర్యంలో ఎఫ్‌ఆర్‌వో హఫీజోద్దీన్‌, అధికారులు తీసుకువెళ్లారు. దట్టమైన అటవీ ప్రాంతం గుండా కెమెరాలెన్స్‌ల ద్వారా ఫొటోలు తీస్తూ పక్షులను వీక్షించారు. ఇందన్‌పల్లి రేంజ్‌లోని మైసమ్మ కుంటలో గల మంచె వద్దకు చేరుకుని పక్షులు, వన్యప్రాణులను తిలకించారు. అనంతరం గన్‌శెట్టి కుంట నుంచి కల్పకుంటకు వెళ్లి అక్కడ పక్షుల కోసం ఏర్పాటు చేసిన గూళ్లను, పక్షులను పరిశీలించారు.  జన్నారం రేంజ్‌లోని బైసన్‌కుంట, నీలుగాయికుంటల వద్ద పక్షులను వీక్షించేందుకు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో కెమెరాల ద్వారా వీక్షించారు.  గన్‌శెట్టికుంట, బైసన్‌కుంట అటవీ ప్రాంతంలో రాత్రిపూట బస చేశారు పక్షి ప్రేమికులు.

Also read:

బాక్సాఫీస్ దగ్గర భీకరపోరు తప్పదా.. ఒకే రోజు రెండు బడా సినిమాల రిలీజ్..

Viral Photo: చెట్టును హత్తుకున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? ఇలా చేస్తే ఎన్నో లాభాలంటా..

Kiss Day 2022: వేల ఎత్తులో గాలిలో ముద్దులు.. ప్రేమజంట సాహసం.. వైరల్‌ అవుతున్న వీడియో..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu