AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhadrachalam: శ్రీరామ నవమి ఉత్సవాలకు అంకురార్పణ.. సర్వాంగ సుందరంగా సీతారాముల కల్యాణ వేదిక

ఇప్పటికే కళ్యాణ మహోత్సవం వీక్షించటానికి టికెట్లను ఆన్లైన్లో ఉంచారు. భద్రాచలంలోని వివిధ ప్రాంతాల్లో నేరుగా విక్రయిస్తున్నట్టు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. ఈనెల 18న జరగనున్న పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ వస్తారని ఈవో తెలిపారు. ఈనెల 9 నుంచి ఈనెల 23 వరకు నిత్య కళ్యాణాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కళ్యాణ మహోత్సవం..

Bhadrachalam: శ్రీరామ నవమి ఉత్సవాలకు అంకురార్పణ.. సర్వాంగ సుందరంగా సీతారాముల కల్యాణ వేదిక
Sri Rama Navami Celebrations
N Narayana Rao
| Edited By: Jyothi Gadda|

Updated on: Apr 10, 2024 | 12:37 PM

Share

శ్రీరామ నవమి ఉత్సవాలకు భద్రాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబు అవుతోంది..ఉగాది పర్వదినం నుంచి శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఉత్సవ మూర్తులకు ఉత్సవాంగ స్నపనం తో బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు వేద పండితులు, ఆలయ నిర్వాహకులు. శ్రీరామ నవమి వేడుకలకు అంకురార్పణతో భద్రాద్రికి కల్యాణ శోభ సంతరించుకుంటోంది. ఈ నెల 17 న సీతారాముల కళ్యాణం,18 న శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది..దీనికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీరామ నవమి ఉత్సవాలు కు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు…అంగరంగ వైభవంగా జరుగు శ్రీరామనవమికి స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉగాది పర్వదినం సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించిన అర్చకులు అనంతరం స్వామివారికి నూతన వస్త్రాలతో అలంకరించారు. ఉగాది పర్వదినం సందర్భంగా పవిత్ర పావన గోదావరి నది నుండి తెచ్చిన జలంతో ఉగాది పచ్చడి తయారు చేసి ఆలయానికి వచ్చే భక్తులకు ఉగాది ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అనంతరం ఉత్సవారంభం కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు…స్వామి వారికి స్నపన తిరుమంజనం మృత్ సంఘ గ్రహణం వేడుకలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి కల్పవృక్ష వాహనంపై ఊరేగింపు నిర్వహించారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల అంకు రార్పణ కి శ్రీశ్రీశ్రీ దేవనాద రామానుజ స్వామి హాజరయ్యారు.

భద్రాచలంలో ఈ నెల 17న జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.. భక్తులు సీతారాముల కళ్యాణం వీక్షించడానికి 16 సెక్టార్లు ఏర్పాటు చేసారు. రెండున్నర లక్షల లడ్డూలు తయారు చేస్తామని, ఐదు లక్షల ముత్యాల తలంబ్రాలు ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నట్లు ఈవో తెలిపారు. కళ్యాణాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తులందరికీ చల్లని తాగునీరు, సేద తీరడానికి చలువ పందిళ్లు, ఉచిత భోజనం సిద్ధం చేస్తున్నారు. ఏప్రిల్‌ 9 నుంచి 23 వరకు శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన ఎదుర్కోలు మహోత్సవం సీతారాముల కళ్యాణ మహోత్సవం పట్టాభిషేకం వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే కళ్యాణ మహోత్సవం వీక్షించటానికి టికెట్లను ఆన్లైన్లో ఉంచారు. భద్రాచలంలోని వివిధ ప్రాంతాల్లో నేరుగా విక్రయిస్తున్నట్టు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. ఈనెల 18న జరగనున్న పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ వస్తారని ఈవో తెలిపారు. ఈనెల 9 నుంచి ఈనెల 23 వరకు నిత్య కళ్యాణాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కళ్యాణ మహోత్సవం వీక్షించే భక్తుల కోసం వివిఐపి పదివేల రూపాయల టికెట్లు విఐపి 5వేల రూపాయల టికెట్లు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. 10000 ,5000 టికెట్లు సంబంధిత అధికారుల వద్ద అందుబాటులో ఉంటాయని అన్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..