Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Most Poisonous Snakes: బాబోయ్‌ ఈ పాము.. చీమ కంటే చిన్నగా కాటేస్తుంది..! గంటన్నరలోనే మరణం ఖాయం..!!

సాధారణ క్రైట్ పాము నలుపు, గోధుమ రంగులో ఉంటుంది. శరీర చర్మం మెరుస్తూ ఉంటుంది. నోటి నుండి కొంచెం దూరంలో తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. శరీరంపై తోక వరకు కొంత దూరంలో రెండు తెల్లని గీతలు ఉంటాయి.. ఈ పాములు ఎలుకలు, కప్పలను తినడానికి ఇష్టపడతాయి. అందుకే ఈ పాములు పొలాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తాయి.

Most Poisonous Snakes: బాబోయ్‌ ఈ పాము.. చీమ కంటే చిన్నగా కాటేస్తుంది..! గంటన్నరలోనే మరణం ఖాయం..!!
Common Krait
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 10, 2024 | 12:03 PM

Most Poisonous Snakes: భారతదేశంలో కనిపించే 4 విషపూరిత పాములలో ఇండియన్‌ క్రైట్‌ ఒకటి. నిపుణుల అభిప్రాయం ప్రకారం..ఇండియన్ క్రైట్ అత్యంత విషపూరితమైన పాములలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ పాము కాటుకు గురైన గంటన్నర వ్యవధిలనే బాధిత వ్యక్తి చనిపోతాడు. సాధారణ క్రైట్ అనేది నాగుపాము కంటే ఐదు రెట్లు ఎక్కువ విషపూరితమైన పాము జాతి. దీనిని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. త్రాచుపాము కాటు సాధారణంగా చీమ కుట్టినట్లు కనిపిస్తుంది. ఎటువంటి నొప్పి ఉండదు. అందుకే పాము కాటుకు గురైందని కూడా చాలా మందికి తెలియదు.

అంతేకాదు..ఈ పాము ఒక్క కాటుతో ఒకేసారి 60 – 70 మందిని చంపేస్తుంది. ఇది ముఖం, తలపై ఎక్కువగా దాడి చేస్తుంది. ఈ పాము కాటు వల్ల ఎటువంటి నొప్పి ఉండదు. కనీసం చీమ కుట్టినట్టుగా కూడా అనిపించదని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ అత్యంత విషపూరితమైన పాముకు ప్రజలు ఎక్కువగా భయపడుతుంటారు. భారతదేశం కాకుండా, బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక మరియు పాకిస్తాన్ వంటి దేశాలలో సాధారణ క్రేట్ పాములు కనిపిస్తాయి. దేశంలో ఉన్న నాలుగు అత్యంత విషపూరిత పాముల్లో ఈ పాము ఒకటి.

సాధారణ క్రేట్ పాములు ఎక్కువగా చల్లని రోజులలో కనిపిస్తాయి. ఈ పాము ఎక్కువగా రాత్రిపూట మాత్రమే చురుకుగా ఉంటుంది. ఈ పాము కాటు గురైన వ్యక్తి శరీరంపై దంతాల గుర్తులు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇది లక్షణాల ఆధారంగా మాత్రమే నిర్ధారణ చేయబడుతుంది. కానీ లక్షణాలు కనిపించే సమయానికి, చాలా ఆలస్యం అవుతుంది. దీని కాటు వల్ల పక్షవాతం వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఈ పాము కాటు చాలా సందర్భాలలో నేలపై నిద్రిస్తున్న వ్యక్తులలో సంభవిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, శరీర ఉష్ణోగ్రతను గ్రహించి, ఈ పాములు శరీరానికి దగ్గరగా వచ్చి పూర్తిగా శరీరానికి అంటుకుంటాయి. పక్కకు తిరిగితే పాము కాటేస్తుంది. చాలా సందర్భాలలో ఈ పాములు వ్యక్తిని ఛాతీ, పొత్తికడుపు, చంకలపై కాటువేస్తాయి. ఈ పాములు వెచ్చగా తగలటంతో బట్టలు, పరుపులను వెతుకుంటూ కొరుకుతూ ఉంటాయి.

ఇవి కూడా చదవండి

సాధారణంగా క్రైట్ పాము కాటుకు గురైన వ్యక్తి ఒకటిన్నర గంటలు మాత్రమే జీవించగలడు. ఈ లోపు సమీపంలోని ఏదైనా ఆసుపత్రికి చేరుకుని సరైన వైద్యం అందిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు. అయితే ఈ గంటన్నర వ్యవధిలో ప్రశాంతంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తి భయపడకూడదు. ఎక్కువగా కదలకూడదు. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది. ఫలితంగా, విషం రక్తంలో వేగంగా వ్యాపించడం ప్రారంభమవుతుంది.

సాధారణ క్రైట్ పాము నలుపు, గోధుమ రంగులో ఉంటుంది. శరీర చర్మం మెరుస్తూ ఉంటుంది. నోటి నుండి కొంచెం దూరంలో తెల్లటి మచ్చలు కనిపిస్తాయి. శరీరంపై తోక వరకు కొంత దూరంలో రెండు తెల్లని గీతలు ఉంటాయి.. ఈ పాములు ఎలుకలు, కప్పలను తినడానికి ఇష్టపడతాయి. అందుకే ఈ పాములు పొలాల్లో కూడా కనిపిస్తాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..