Watch Video: అసలు వీళ్లు మనుషులేనా.. బాలుడిపై కుక్కలు దాడి చేస్తుండగా ఏం చేశారో తెలుసా, కన్నీళ్లు పెట్టించే వీడియో

దేశంలో రోజురోజుకూ వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఎండల వేడిమి ప్రభావమో.. సరైన ఫుడ్ లేకనో కానీ పిచ్చిగా ప్రవర్తిస్తూ మనుషులపై దాడులకు తెగబడుతున్నాయి. దేశంలో ఏదో ఒక చోట కుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆయా ఘటనలకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాలను చూస్తూనే ఉన్నాం.

Watch Video: అసలు వీళ్లు మనుషులేనా.. బాలుడిపై కుక్కలు దాడి చేస్తుండగా ఏం చేశారో తెలుసా, కన్నీళ్లు పెట్టించే వీడియో
Dogs Bite
Follow us
Balu Jajala

|

Updated on: Apr 10, 2024 | 12:21 PM

దేశంలో రోజురోజుకూ వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఎండల వేడిమి ప్రభావమో.. సరైన ఫుడ్ లేకనో కానీ పిచ్చిగా ప్రవర్తిస్తూ మనుషులపై దాడులకు తెగబడుతున్నాయి. దేశంలో ఏదో ఒక చోట కుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆయా ఘటనలకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఘటనలను చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఓ బాలుడిపై కుక్కలు దాడి చేసిన ఘటన వైరల్ అవుతోంది. వీడియోలో వీధి కుక్కలు 15 ఏళ్ల బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. చుట్టుపక్కల జనాలు ఉన్నా ఎవరు ముందుకు రాకుండా బాలుడ్ని రక్షించలేకపోయారు.

అసలు సాయం చేయాలనే ఆలోచన లేకుండా విగ్రహల మాదిరిగా ఉండిపోయారు. ఆ బాలుడ్ని రక్షించకుండా ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డవ్వడంతో కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హృదయ విదారకమైన ఈ ఘటన ఘజియాబాద్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ట్విట్టర్ షేర్ చేయడంతో ఎంతోమంది చూశారు. వీడియో చూసిన తర్వాత..  నారింజ రంగు చొక్కా వ్యక్తి పిల్లవాడికి సహాయం చేసి ఉండాలి. కుక్క భయపడేలా కనీసం కర్ర అయినా, రాయితోనైనా భయపెట్టాల్సి ఉంది అంటూ కామెంట్లు చేశారు నెటిజన్స్.

కుక్కలు విశ్వాస జంతువులే అయినప్పటికీ కొన్ని సమయాల్లో ప్రమాదకరంగా ప్రవర్తిస్తుంటాయి. ముఖ్యంగా వీధికుక్కలకు సరైన ఫుడ్ లేకపోతుండటం, ఎండల వేడిమితో రక్షణ లేకపోవడంతో విచ్చిలవిడిగా తిరుగుతూ దాడులకు తెగబడుతున్నాయి. అయితే కుక్కల దాడులకు చెక్ పెట్టేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నా ఫలితాలు ఇవ్వడం లేదు.

మరిన్నిట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.