ఈ వధువు వెరీ వెరీ స్పెషల్.. యక్షగాన వేషధారణలో కల్యాణ మండపానికి చేరుకున్న పెళ్లి కూతురు
పెద్దలు వధువుని పెళ్లి పందిరిలోకి తీసుకుని వస్తుంటే.. చేతిలో తాంబూలం , కొబ్బరి బొండం పట్టుకుని సిగ్గులు మొగ్గగా మారి తల కిందకు దించి సిగ్గుపడుతూ ఉండేది. లక్ష్మీదేవి వధువు రూపంలో కళ్యాణ మండపంలో అడుగు పెడుతుందా అన్న చందంగా ఉండేది కొంత కాలం క్రితం వరకూ.. అయితే మారిన కాలంతో పాటు వధువు కళ్యాణ మండపంలోకి వచ్చే తీరులో కూడా మార్పు వచ్చింది. వధూవరులు కల్యాణ మండపానికి వచ్చే ట్రెండ్ కూడా కాలానుగుణంగా మారిపోయింది.
కొంతకాలం క్రితం వరకూ హిందూ వివాహ వేడుకల్లో వధువు కళ్యాణ మండపంలోకి అడుగు పెట్టె సమయం ఒక అపురూప ఘట్టం. పెద్దలు వధువుని పెళ్లి పందిరిలోకి తీసుకుని వస్తుంటే.. చేతిలో తాంబూలం , కొబ్బరి బొండం పట్టుకుని సిగ్గులు మొగ్గగా మారి తల కిందకు దించి సిగ్గుపడుతూ ఉండేది. లక్ష్మీదేవి వధువు రూపంలో కళ్యాణ మండపంలో అడుగు పెడుతుందా అన్న చందంగా ఉండేది కొంత కాలం క్రితం వరకూ.. అయితే మారిన కాలంతో పాటు వధువు కళ్యాణ మండపంలోకి వచ్చే తీరులో కూడా మార్పు వచ్చింది. వధూవరులు కల్యాణ మండపానికి వచ్చే ట్రెండ్ కూడా కాలానుగుణంగా మారిపోయింది. వధూవరులు డ్యాన్స్ చేస్తూ మండపంలోకి ప్రవేశిస్తున్న ట్రెండ్ పెరిగింది. ఇందుకు సంబంధించిన ప్రత్యేకమైన వివాహాల వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పుడు ఒక వీడియోలో నవ వధువు కళ్యాణ మండపానికి యక్షగాన వేషధారణతో వచ్చింది. ఈ వీడియో వైరల్‌గా మారింది.
కర్ణటకలోని ఉడిపిలోని ఎర్మాల్‌లో జరిగిన వివాహ వేడుకలో వధువు సాంప్రదాయ యక్షగానం చెబుతున్న వేషధారణతో కల్యాణ మండపంలోకి ప్రవేశించింది, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన వీడియోను sakathkaravali అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో, “వధువు ఈ స్పెషల్ ఎంట్రీని పెళ్లి ఇంట్లో చూడండి” అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు.
ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
ఇవి కూడా చదవండిView this post on Instagram
వైరల్ వీడియోలో నవ వధువు, ఆమె కుటుంబం యక్షగాన వేషధారణలతో కల్యాణ మండపంలోకి ప్రవేశించిన అందమైన దృశ్యాన్ని చూడవచ్చు. మూడు రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకి 13 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి, ఈ అందమైన వీడియో ఇప్పుడు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..