రాత్రి భోజనం తర్వాత నెమ్మదిగా లేదా వేగంగా నడవడం ఏది మంచిదో తెలుసుకోండి..

రాత్రి సమయంలో ప్రజలు మీ చుట్టుపక్కల లేదా మీ పరిసరాల్లో నడవడం తరచుగా చూస్తూ ఉంటారు. చాలా మంది రాత్రి భోజనం చేసిన తర్వాత తరచుగా కొంత సమయం పాటు వాకింగ్ చేస్తారని.. ఆ తర్వాత మాత్రమే నిద్రపోతారని చెబుతారు. అయితే ఆహారం తిన్న తర్వాత నేరుగా పడుకునే వారు కొందరున్నారు. ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. అంతేకాదు ఉదయం నిద్ర లేచిన తర్వాత జీర్ణ సమస్యలు రావచ్చు. ఈ సమస్యను నివారించడానికి ఎవరైనా సరే ఆహారం తిన్న తర్వాత తప్పనిసరిగా నడవాలి.

రాత్రి భోజనం తర్వాత నెమ్మదిగా లేదా వేగంగా నడవడం ఏది మంచిదో తెలుసుకోండి..
Health Tips
Follow us
Surya Kala

|

Updated on: Apr 10, 2024 | 12:21 PM

వ్యాయామం, నడక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మారుతున్న కాలంలో శారీరక శ్రమ తప్పని సరి. ఈ నేపద్యంలో తమను తాము ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చాలా మంది రన్నింగ్ , బ్రిస్క్ వాకింగ్ కూడా చేస్తుంటారు. అయితే కొంతమంది రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమిస్తారు. అయితే రాత్రి తిన్న వెంటనే నిద్రపోకుండా కొంత సమయం నడవాలని కొందరు చెబుతారు. అయితే రాత్రి భోజనం తర్వాత వేగంగా లేదా నెమ్మదిగా ఎలా నడవాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ నేపధ్యంలో ఈ ప్రశ్నకు సమాధానం ఈ రోజు తెలుసుకుందాం..

రాత్రి సమయంలో ప్రజలు మీ చుట్టుపక్కల లేదా మీ పరిసరాల్లో నడవడం తరచుగా చూస్తూ ఉంటారు. చాలా మంది రాత్రి భోజనం చేసిన తర్వాత తరచుగా కొంత సమయం పాటు వాకింగ్ చేస్తారని.. ఆ తర్వాత మాత్రమే నిద్రపోతారని చెబుతారు. అయితే ఆహారం తిన్న తర్వాత నేరుగా పడుకునే వారు కొందరున్నారు. ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. అంతేకాదు ఉదయం నిద్ర లేచిన తర్వాత జీర్ణ సమస్యలు రావచ్చు. ఈ సమస్యను నివారించడానికి ఎవరైనా సరే ఆహారం తిన్న తర్వాత తప్పనిసరిగా నడవాలి. అయితే ఎంతసేపు, ఎంత వేగంతో నడవాలి లేదా జాగ్ చేయాలంటే..

రాత్రి వేగంగా నడవ వద్దు

రాత్రి 7 గంటలకే డిన్నర్‌ చేయాలని పలువురు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రాత్రి భోజనం చేసిన వెంటనే వాకింగ్‌కి వెళ్లవద్దు. అంతేకాదు తిన్న తర్వాత కనీసం గంటసేపు వాకింగ్‌కు వెళ్లండి. అదే సమయంలో రాత్రి సమయంలో వేగంగా నడవ వద్దు. అదే సమయంలో వీలైనంత నెమ్మదిగా నడవండి. రాత్రి భోజనం తర్వాత ఆరగంట నుంచి గంట వరకూ నెమ్మదిగా నడవండి. తిన్న తర్వాత చాలా వేగంగా నడవడం వల్ల కడుపులో నొప్పి వస్తుంది.

ఇవి కూడా చదవండి

రాత్రి భోజనం తర్వాత నడవడం వల్ల ఏ ప్రయోజనాలు లభిస్తాయంటే

ఆహారం జీర్ణం కావడానికి: రాత్రి భోజనం చేసిన తర్వాత అరగంట పాటు నడవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అజీర్ణం, కడుపునొప్పి, గ్యాస్ వంటి సమస్యలు కూడా రావు.

మెటబాలిజం బూస్ట్: రాత్రి భోజనం తర్వాత నడవడం వల్ల మీ జీవక్రియ పెరుగుతుంది. అంతేకాదు బరువును అదుపులో ఉంచుతుంది.

బలమైన రోగనిరోధక శక్తి: రాత్రి భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేసే అలవాటు వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు అనేక రకాల సీజనల్ వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ నడవాలి.

ప్రశాంతమైన నిద్ర: రోజూ రాత్రి తిన్న తర్వాత నడక వల్ల శరీరంలో ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది, దీని వలన మీకు మంచి నిద్ర వస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..