వారేవ్వా.. ఏం ఆఫర్ బ్రో.. ఉచితంగా మేకల పంపిణీ..! ఒక్కొక్కరికి 50 వరకు ఇస్తారట..!! ఎక్కడో తెలుసా..?
ఈ ప్రాజెక్ట్ లక్ష్యం మేకలను అవసరమైన వారికి పంపిణీ చేయటం. మేకల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో వ్యక్తి 50 మేకల వరకు కొనుగోలు చేయవచ్చు. కావాలనుకునే వారు ఏప్రిల్ 10లోపు రూ.1400 స్టాంప్‌తో కూడిన దరఖాస్తును సమర్పించాలి. దరఖాస్తును ధృవీకరించిన తర్వాత, అర్హులైన అభ్యర్థులు ద్వీపం నుండి మేకలను తీసుకెళ్లడానికి 15 రోజుల సమయం ఉంటుంది.
ఆసియాలో జనాభా విజృంభణ అనేది ప్రభుత్వాలు నియంత్రించలేని సమస్యగా మారింది. ప్రపంచంలోని ఒక చిన్న ద్వీపం కూడా అక్కడ విచ్చలవిడిగా పెరిగిపోతున్న జనాభాను నియంత్రించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకోసం ఇతర దేశాలు, ప్రాంతాల వారికి కూడా ఆఫర్లు ప్రకటిస్తోంది. అవును నిజమే.. ఇటాలియన్ లోని అలికుడి అనే చిన్న ద్వీపం ఒకటి ఉంది. ఇక్కడ జనాబా 100 మంది మాత్రమే. మరైతే, ఎందుకు జనాభా నియంత్రణలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది అనే సందేహం కలుగొచ్చు. ఇక్కడి ప్రభుత్వం నియంత్రించాలనుకుంటున్నది మనుషుల జనాభా కాదు.. మేకల జనాభా. విచిత్రంగా ఉంది కదూ..! కానీ, ఇక్కడ మేకల జనాభా విపరీతంగా పెరిగిపోయింది. కేవలం 100 మంది మనుషుల జనాభా కలిగిన ఈ ద్వీపంలో 600 మేకలు స్వేచ్ఛగా తిరుగుతాయట. పూర్తి వివరాల్లోకి వెళితే…
సిసిలీ, ఇటలీ ప్రధాన భూభాగంలో ఉన్న అయోలియన్ దీవుల సమూహంలోని ఏడు నివాస ద్వీపాలలో అలికుడి ఒకటి. ఇది వాటిలో అత్యంత ఒంటరిగా, తక్కువ జనాభా ఉన్న ప్రాంతంగా నిలుస్తుంది. దాని ప్రశాంతత అప్పుడప్పుడు చెదురుమదురుగా వచ్చే ఫెర్రీ రాకపోకలు, గాడిదల శబ్దం తప్ప ఇక్కడ మరెలాంటి ధ్వని కాలుష్యం, అంతరాయం ఉండదు. ఈ ద్వీపంలో గాడిదలు ప్రధాన రవాణా సాధనంగా పనిచేస్తాయి. అలాంటి ఈ దీవిని ఇప్పుడు మేకలు ఆక్రమించుకుంటున్నాయి. సమస్య పరిష్కారానికి మేకలను ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలా… అవసరమైన వారికి ఉచితంగా మేకలను ఇస్తుంది అలికుడి ప్రభుత్వం. దీవిలో మేకల సంఖ్య విపరీతంగా పెరగడంతో ప్రభుత్వం ఇలాంటి చర్యకు ముందుకు వచ్చింది.
అలికుడికి చెందిన ఓ రైతు తొలిసారిగా మేకలను ఈ దీవికి తీసుకొచ్చాడు. మొదట్లో కొండలు, కొండ చరియల పైభాగంలో ఉండే వీరి కేంద్రం కాలక్రమేణా మేకల సంఖ్య పెరగడంతో జనావాసాలకు చేరుకుని తోటలు, ఇతర ప్రాంతాలను ధ్వంసం చేయడం ప్రారంభించాయి. ఈ ధోరణి ప్రజల జీవితాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తుంది. దాంతో మేయర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. “అడాప్ట్ ఎ మేక” అనే ప్రాజెక్ట్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం మేకలను అవసరమైన వారికి పంపిణీ చేయటం. తద్వారా ద్వీపంలో మేకల సంఖ్యను తగ్గించడం. మేకల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో వ్యక్తి 50 మేకల వరకు కొనుగోలు చేయవచ్చు. కావాలనుకునే వారు ఏప్రిల్ 10లోపు రూ.1400 స్టాంప్‌తో కూడిన దరఖాస్తును సమర్పించాలి. దరఖాస్తును ధృవీకరించిన తర్వాత, అర్హులైన అభ్యర్థులు ద్వీపం నుండి మేకలను తీసుకెళ్లడానికి 15 రోజుల సమయం ఉంటుంది. మేకల సంఖ్య 100కి చేరే వరకు ప్రాజెక్టు కొనసాగుతుందని మేయర్ రికార్డో ప్రకటించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.