ట్రక్కు డ్రైవర్‌ టాలెంట్‌కు ఫిదా అయిన ఆనంద్‌ మహీంద్రా..! అతనో సెలబ్రిటీ.. తెలిస్తే మీరు అంగీకరిస్తారు..?

సామాన్యుల కష్టాన్ని ప్రోత్సహించడంలో ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ ముందుంటారు అని ఒక సోషల్ మీడియా వినియోగదారు రాశారు. ఇదే వారిని ఇతరులకు భిన్నంగా చేస్తుందన్నారు. టెక్నాలజీ ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకువస్తోందనడానికి ఇదొక ఉదాహరణ అని ఒకరు రాశారు. అతని ప్రవర్తన,

ట్రక్కు డ్రైవర్‌ టాలెంట్‌కు ఫిదా అయిన ఆనంద్‌ మహీంద్రా..! అతనో సెలబ్రిటీ.. తెలిస్తే మీరు అంగీకరిస్తారు..?
Anand Mahindra lauded Rajesh Rawani's ability
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 08, 2024 | 2:27 PM

మీరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారైతే.. మీరు తప్పనిసరిగా రాజేష్ రావణి వీడియోలను చూసే ఉంటారు. రాజేష్ వృత్తిరీత్యా ట్రక్ డ్రైవర్, అయితే అతను ట్రక్కు నడుపుతూ తన ఆహారాన్ని ఎలా వండుకుంటాడో వీడియోలను షేర్‌ చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన వీడియోను షేర్‌ చేస్తూ రాజేష్ రావణిని ప్రశంసించారు. ట్రక్ డ్రైవర్ రాజేష్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 816K ఫాలోవర్లు, యూట్యూబ్‌లో దాదాపు 1.5 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఆనంద్ మహీంద్రా రాజేష్ వీడియోను షేర్‌ చేశారు. అతని టాలెంట్‌ను ప్రశంసించారు. రాజేష్ కొత్త ఇల్లు కొన్నాడంటూ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.

రాజేష్ రావణి ఎవరు?

రాజేష్ రావణి జార్ఖండ్ నివాసి. అతను సుమారు 25 సంవత్సరాలుగా ట్రక్కు నడుపుతున్నాడు. ట్రక్కు నడుపుతూ వీడియోలు చేయడం ప్రారంభించాడు. ట్రక్కును ఎక్కడపడితే అక్కడే ఆపి ఆహారం వండుకుంటూ వీడియో తీసుకునేవాడు. అలా తీసిన వీడియోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్‌ చేయటంతో ప్రజలు వాటిని ఇష్టపడటం ప్రారంభించారు. చాలా వీడియోల్లో రాజేష్ తన కష్టసుఖాలను కూడా నెటిజన్లతో పంచుకునేవాడు..మరికొన్ని సార్లు ప్రజలకు వంటలోని మంచి లక్షణాలను నేర్పించేవాడు. నెటిజన్లు అతని సానుకూలత, సాధారణ ప్రవర్తనకు ఎక్కువ మంది ఫాలోవర్లుగా మారిపోయారు.

ఇవి కూడా చదవండి

రాజేష్‌ వీడియోపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ..ఈరోజు యూట్యూబ్‌లో 1.5 మిలియన్ ఫాలోవర్లతో సెలబ్రిటీ అంటూ ప్రశంసించారు. తన సంపాదనతో కొత్త ఇల్లు కొన్నాడని చెప్పారు.. మీ వయస్సు ఎంతైనా లేదా మీ వృత్తి ఎంత నిరాడంబరమైనదైనా, కొత్త సాంకేతికతను స్వీకరించడానికి మరియు మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఏదీ అడ్డు కాదని అతను నిరూపించాడు అని ఆనంద్‌ మహీంద్రా వ్యాఖ్యనించారు.

సామాన్యుల కష్టాన్ని ప్రోత్సహించడంలో ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ ముందుంటారు అని ఒక సోషల్ మీడియా వినియోగదారు రాశారు. ఇదే వారిని ఇతరులకు భిన్నంగా చేస్తుందన్నారు. టెక్నాలజీ ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకువస్తోందనడానికి ఇదొక ఉదాహరణ అని ఒకరు రాశారు. అతని ప్రవర్తన, సరళత కారణంగా రాజేష్ జిని ఇష్టపడుతున్నాడని, అతను ఇప్పుడు ప్రజలలో ఒక ఐకాన్‌గా మారాడని ఒకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?