Walnuts : సమ్మర్‌లో వాల్‌నట్స్ తింటే ఏమవుతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

వాల్‌నట్స్‌లో మంచి మొత్తంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన శరీరానికి, ఆరోగ్యకరమైన మెదడుకు మంచిది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, వేసవి కాలం వేడిగా ఉంటుంది, వాల్‌నట్స్‌ కూడా వేడిని ఉత్పత్తి చేస్తాయి, కానీ, వేసవిలో వాల్‌నట్స్‌ తినేందుకు ఉపాయం ఉంది..

Walnuts : సమ్మర్‌లో వాల్‌నట్స్ తింటే ఏమవుతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Walnuts Uses
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 08, 2024 | 1:19 PM

ప్రస్తుతం ప్రజలంతా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. మంచి ఆరోగ్యకరమైన, బలవర్థకమైన ఆహారంతో పాటు డ్రైఫ్రూట్స్‌ని ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే, ఎండాకాలంలో డ్రై ఫ్రూట్స్ తినాలా వద్దా..అనే సందేహంలో పడుతున్నారు చాలా మంది. శీతాకాలం వలె వేసవిలో కూడా డ్రైఫ్రూట్స్‌ ప్రయోజనాలు కలిగిస్తాయా లేదా అనే ప్రశ్నలు చాలా మందిలో ఉత్పన్నమవుతున్నాయి. అయితే, ముఖ్యంగా డ్రైఫ్రూట్స్‌లో వాల్‌నట్స్‌ చాలా పోషకాలు కలిగి ఉన్నాయి. అలాంటి వాల్‌నట్స్‌ ఏ సీజన్‌లోనైనా తినవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు. శీతాకాలంలో మీరు దీన్ని ఏ రూపంలోనైనా తినవచ్చు, కానీ వేసవిలో తినే విధానాన్ని మార్చుకోవాలని చెబుతున్నారు.

వాల్‌నట్స్‌లో మంచి మొత్తంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన శరీరానికి, ఆరోగ్యకరమైన మెదడుకు మంచిది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, వేసవి కాలం వేడిగా ఉంటుంది, వాల్‌నట్స్‌ కూడా వేడిని ఉత్పత్తి చేస్తాయి, కానీ, వేసవిలో వాల్‌నట్స్‌ తినేందుకు ఉపాయం ఉంది..అందుకోసం వాల్‌నట్స్‌ తినే ముందు రాత్రంతా నానబెట్టడం. ఇది వాల్‌నట్‌లలోని వేడిని శాంతింపజేస్తుంది.

చాలా మంది వాల్ నట్స్ ను నేరుగా తింటారు. వాల్‌నట్‌లను పాలలో మరిగించి తింటే పోషకాలు ఎక్కువ. వాల్‌నట్‌లను పాలలో వేసి మరిగించి గోరువెచ్చని పాలతో రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మరింత మేలు జరుగుతుంది. దీంతో మంచి నిద్రకు దోహదం చేస్తుంది. వాల్‌నట్ వంటి గింజలు మెలటోనిన్‌కు మంచి మూలంగా పరిగణించబడతాయి. ఈ గింజల్లో ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి మీకు మంచి నిద్రను అందిస్తాయి.

ఇవి కూడా చదవండి

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు అనేక విధాలుగా మీ ఆహారంలో వాల్‌నట్‌లను చేర్చుకోవచ్చు. ఇది షేక్ లేదా స్మూతీతో మరింత బాగుంటుంది. వేసవిలో వాల్‌నట్‌లను తినడానికి ఇది చాలా రుచికరమైన,యు ఆరోగ్యకరమైన మార్గం. అలాగే, వేసవిలో వేయించిన వాల్ నట్స్ తినడం చాలా మంచిది. ఇలా తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని తినడం వల్ల శరీరంలోని వేడిని సమతుల్యం చేసుకోవచ్చు. మీకు కావాలంటే, మీరు పెరుగులో వాల్‌నట్‌లను నానబెట్టుకుని తింటే కూడా మంచిది.

మీరు కావాలంటే 2 వాల్‌నట్ ముక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టుకుని, ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తినండి. నానబెట్టిన వాల్‌నట్స్‌ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది. మీరు అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నట్టయితే, మీరు క్రమం తప్పకుండా వాల్‌నట్‌లను తీసుకుంటే అది బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్