Sanitizer: బాబోయ్‌ కరోనా.. ఇలా కూడా వదలటం లేదు..! శానిటైజర్‌పై షాకింగ్‌ అధ్యయనం..?

అంతేకాదు.. మీ హార్మోన్లను కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. సంతానోత్పత్తిపై కూడా ప్రభావం చూపుతుంది. యాంటీబయాటిక్ నిరోధకతను కలిగిస్తుంది. కొన్ని సార్లు అంధత్వానికి కారణం కావచ్చునని చెప్పారు. హ్యాండ్ శానిటైజర్‌లో ఉండే అధిక స్థాయిలో ఆల్కహాల్ మీ కంటి బయటి పొరపై రసాయన చర్యలకు కారణమవుతుందని చెబుతున్నారు.

Sanitizer: బాబోయ్‌ కరోనా.. ఇలా కూడా వదలటం లేదు..! శానిటైజర్‌పై షాకింగ్‌  అధ్యయనం..?
Hand Sanitizers
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 08, 2024 | 12:41 PM

కోవిడ్-19..మహమ్మారికి ముందు ప్రజలు శానిటైజర్లు, సబ్బులు, హ్యాండ్ వైప్స్‌ను చాలా తక్కువగా వాడేవారు. కానీ, కరోనా వైరస్ ప్రపంచంలో సృష్టించిన గందరగోళానికి ప్రతి ఒక్కరూ శానిటైజర్లు, సబ్బులు, హ్యాండ్‌ వాష్‌లను పరిమితి లేకుండా ఉపయోగిస్తున్నారు. అది ఇప్పటికి కూడా కొనసాగుతోంది. అయితే దీని దుష్పరిణామాల గురించి ప్రజలు పట్టించుకోవడం లేదు. 2019 తర్వాత శానిటైజర్ల విక్రయాలు విపరీతంగా పెరిగాయి. నేటికీ వీటికి గిరాకీ ఎక్కువ. కానీ దీని దుష్ఫలితాలు కనిపించడం లేదు. దీనికి సంబంధించి ఓ పరిశోధనలో విస్మయకర నిజాలు బయటపడ్డాయి. శానిటైజర్లను ఎక్కువగా వాడటం మెదడు ఆరోగ్యానికి హానికరమని పరిశోధనలో వెల్లడైంది.

ఇటీవలి పరిశోధనల ప్రకారం.. మెదడు కణాలపై చేసిన అధ్యయనాల్లో క్రిమిసంహారకానికి ఉపయోగించే రసాయనాలు మన మెదడు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని వెల్లడించింది. ఫర్నిచర్, బట్టలు, వస్తువులపై ఉపయోగించే రసాయనాలు మెదడు సహాయక కణాలను దెబ్బతీస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అవయవాల పెరుగుదలకు కూడా ఆటంకం కలిగిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఓహియోలోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీలో మెదడు కణాలపై పరిశోధన జరిగింది. మాలిక్యులర్ బయాలజిస్ట్ ఎరిన్ కోన్, ఆమె బృందం వారి పరిశోధనలో టాక్సిన్స్ ఉన్న 1823 పదార్థాలను కనుగొన్నారు. ఇందులో, ఒలిగోడెండ్రోసైట్ కణాల పరివర్తనను నిలిపివేసే రెండు రకాల హానికరమైన రసాయనాలు గుర్తించబడ్డాయి. ఇది మానవ శరీరంలోని నరాలకు మద్దతు ఇచ్చే కణాలకు అపారమైన నష్టం కలిగిస్తుంది.

నరాల రక్షణ కవచాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది శరీరంలోని వివిధ అవయవాలకు మెదడు సంకేతాలను ప్రసారం చేయడంలో జోక్యం చేసుకుంటుంది. మొత్తంమీద, శానిటైజర్లు, హ్యాండ్ వాష్‌లు, ఇతర ఉత్పత్తులలో ఉపయోగించే రసాయనాలు మన నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఇది మెదడు, అవయవాల పనితీరుకు ఆటంకం కలిగిస్తుందని అధ్యయనంలో వివరించబడింది.

ఇవి కూడా చదవండి

హ్యాండ్ శానిటైజర్‌లో అధిక మొత్తంలో ఆల్కహాల్ ఉందని వైద్యులు చెబుతున్నారు. మీ శానిటైజర్‌లో వివిధ రకాల దుష్ప్రభావాలకు కారణమయ్యే ఇతర క్రిమినాశక పదార్థాలతో తయారు చేస్తున్నట్టుగా చెప్పారు. హ్యాండ్ శానిటైజర్ మీ చర్మంపై దురద, తామర పాచెస్‌ను ఏర్పరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు.. మీ హార్మోన్లను కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. సంతానోత్పత్తిపై కూడా ప్రభావం చూపుతుంది. యాంటీబయాటిక్ నిరోధకతను కలిగిస్తుంది. కొన్ని సార్లు అంధత్వానికి కారణం కావచ్చునని చెప్పారు. హ్యాండ్ శానిటైజర్‌లో ఉండే అధిక స్థాయిలో ఆల్కహాల్ మీ కంటి బయటి పొరపై రసాయన చర్యలకు కారణమవుతుందని చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో