AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. ఈ 7 అలవాట్లు ఉంటే కిడ్నీల్లో రాళ్లు చేరినట్లే.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి

కిడ్నీలు.. మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో ఇవి ఒకటి.. శరీరంలోని రెండు కిడ్నీలు రక్తాన్ని శుభ్రపరుస్తాయి. కిడ్నీ ఆరోగ్యంగా ఉండటంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.. శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. కానీ కొన్నిసార్లు కొన్ని అలవాట్ల వల్ల కిడ్నీలో ఈ వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడంతో అవి క్రమేణా గట్టిపడి రాళ్లు రూపాంతరం చెందుతాయి.

వామ్మో.. ఈ 7 అలవాట్లు ఉంటే కిడ్నీల్లో రాళ్లు చేరినట్లే.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి
Kidney Stones
Shaik Madar Saheb
|

Updated on: Apr 08, 2024 | 1:16 PM

Share

కిడ్నీలు.. మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో ఇవి ఒకటి.. శరీరంలోని రెండు కిడ్నీలు రక్తాన్ని శుభ్రపరుస్తాయి. కిడ్నీ ఆరోగ్యంగా ఉండటంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.. శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. కానీ కొన్నిసార్లు కొన్ని అలవాట్ల వల్ల కిడ్నీలో ఈ వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడంతో అవి క్రమేణా గట్టిపడి రాళ్లు రూపాంతరం చెందుతాయి. కిడ్నీలో రాళ్లు ఉంటే.. చాలా బాధాకరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, దీనిని నివారించడానికి ఏ అలవాట్లను మెరుగు పరుచుకుంటే మంచిదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.. నెఫ్రాలజీస్టుల ప్రకారం.. కొన్ని అలవాట్లు కిడ్నీలో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి. అవేంటో తెలుసుకోండి..

తక్కువ నీరు తాగడం..

శరీరంలో నీరు లేకపోవడం వల్ల, మూత్రం మందంగా మారుతుంది. ఇది రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి తక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కావున, రోజూ తగిన మోతాదులో నీరు తాగడం చాలా ముఖ్యం. నీరు తాగడానికి ఉత్తమ మార్గం రోజంతా కొంచెం కొంచెం నీరు త్రాగటం..

కాల్షియం తక్కువగా తీసుకోవడం..

కాల్షియం లోపం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. శరీరంలో కాల్షియం లేకపోవడం వల్ల, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్ల, నిపుణుల నుంచి డైటీషియన్ల వరకు ప్రతి ఒక్కరూ సమతుల్య ఆహారం తీసుకోవాలని సలహా ఇస్తారు. దీని కారణంగా శరీరానికి అన్ని పోషకాలు సులభంగా అందుతాయి.

సోడియం ఎక్కువగా తీసుకోవడం..

అధిక మొత్తంలో సోడియం తీసుకోవడం వల్ల మూత్రపిండాలు మూత్రం ద్వారా అదనపు కాల్షియంను బయటకు పంపేలా చేస్తాయి. ఈ అదనపు కాల్షియం రాళ్ల రూపంగా మారుతుంది. అందువల్ల, మీ ఆహారంలో ఉప్పు మొత్తాన్ని సమతుల్యంగా ఉంచండి.

మాంసం ఎక్కువగా తినడం..

మాంసం, గుడ్లు, చేపలు మొదలైనవి ప్రోటీన్ మంచి వనరులు.. కానీ వాటిని అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. వాస్తవానికి, అదనపు ప్రోటీన్ శరీరంలో యూరిక్ యాసిడ్ మొత్తాన్ని పెంచుతుంది. ఇది కిడ్నీల్లో రాళ్లకు ప్రధాన కారణం.

అధిక మొత్తంలో ఆక్సలేట్ కలిగిన ఆహార ఉత్పత్తులను తినడం..

ఆక్సలేట్ అనే మూలకం బచ్చలికూర, బీట్‌రూట్, చాక్లెట్, జీడిపప్పు మొదలైన వాటిలో కనిపిస్తుంది. అధిక మొత్తంలో ఆక్సలేట్ తీసుకోవడం వల్ల మూత్రంలో కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలు ఏర్పడతాయి. ఇవి తరువాత రాళ్లను ఏర్పరుస్తాయి. అందువల్ల ఈ కూరగాయలను పరిమిత పరిమాణంలో తినాలి.

ఊబకాయం..

అధిక బరువు లేదా ఊబకాయం కూడా మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఊబకాయం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయి కూడా పెరుగుతుంది. ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి మంచిది కాదు.

విత్తనాలు కలిగిన ఆహార ఉత్పత్తులు

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. విత్తనాలు ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. వంకాయ, టొమాటో వంటి గింజలు కలిగిన కూరగాయలలో అధిక మొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఎటువంటి సమస్య లేనప్పటికీ ఈ కూరగాయలను పరిమిత పరిమాణంలో తినాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..
మీ గోళ్లలోనే మీ ఊపిరితిత్తుల ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలు..