Beauty Tips: ఆరెంజ్‌ తొక్కలతో స్పాట్‌ లెస్‌ బూటీ మీ సొంతం..! ఇవి కలిపి రాస్తే ముఖం మెరుస్తుంది..

చర్మాన్ని బిగుతుగా మార్చడంలో సహాయపడతాయి. మచ్చలను కూడా తొలగిస్తాయి. మీరు మొటిమలతో ఇబ్బంది పడుతుంటే నారింజ తొక్కలు మీకు చాలా మేలు చేస్తాయి. ఇది ముఖ చర్మం పొడిబారకుండా కాపాడడంలో సహాయపడుతుంది. ఇది కొందరి చర్మానికి సరిపోతుంది, మరికొందరికి అలెర్జీ కలిగించవచ్చు. మీకు ఏదైనా సమస్య ఉంటే, ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.

Beauty Tips: ఆరెంజ్‌ తొక్కలతో స్పాట్‌ లెస్‌ బూటీ మీ సొంతం..! ఇవి కలిపి రాస్తే ముఖం మెరుస్తుంది..
Orange Peel
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 08, 2024 | 10:20 AM

ప్రతి ఒక్కరూ తమ చర్మాన్ని మృదువుగా, మెరిసేలా ఉంచుకోవాలని, ఎప్పుడూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. అందుకోసం మంచి ఆహారంతో పాటు చర్మ సంరక్షణ చిట్కాలను కూడా ట్రై చేస్తుంటారు. అయితే, ఆరోగ్యానికి, చర్మానికి పండ్లు ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తాయి. కానీ, వాటి వినియోగంపై సరైన అవగాహన లేకపోవడంతో ప్రజలు వాటిని సరిగా వినియోగించుకోలేకపోతున్నారు. అలాంటి ఒక పండు, దాని ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..అది పండు మాత్రమే కాదు.. దాని పై తొక్క కూడా మీకు ఉపయోగపడుతుంది. అది మీ ముఖానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది.

ఆరెంజ్..ఇది రుచికరమైన, ఆరోగ్యకరమైన పండు. ఇది ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఆరెంజ్ పండుతో పాటు తొక్కలో విటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ సంరక్షణ కోసం నారింజ తొక్కను బాగా ఆరబెట్టి, కడిగి మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. మీరు ఈ పొడిని ఫేస్ మాస్క్‌గా, స్క్రబ్‌గా లేదా టోనర్‌గా ఉపయోగించవచ్చు.

మరో పద్ధతిలో.. నారింజ తొక్కలను పొడిగా చేసి, ఆపై వాటిని ఒక జాడీలో నింపి, పైన ఆలివ్ ఆయిల్‌ పోయాలి. ఈ కూజాను రెండు మూడు వారాల పాటు ఎండలో ఉంచి, ఆపై నూనెను ఫిల్టర్ చేయండి. తర్వాత ఈ నూనెను నిల్వచేసుకుని ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు మీ ముఖానికి రాసుకుని, ఉదయాన్నే కడిగేయండి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే మార్పు మీరే గమనిస్తారు.

ఇవి కూడా చదవండి

దాని ప్రయోజనాలు తెలుసుకోండి..

ఆరెంజ్ తొక్కలు చర్మాన్ని బిగుతుగా మార్చడంలో సహాయపడతాయి. మచ్చలను కూడా తొలగిస్తాయి. మీరు మొటిమలతో ఇబ్బంది పడుతుంటే నారింజ తొక్కలు మీకు చాలా మేలు చేస్తాయి. ఇది ముఖ చర్మం పొడిబారకుండా కాపాడడంలో సహాయపడుతుంది. ఇది కొందరి చర్మానికి సరిపోతుంది, మరికొందరికి అలెర్జీ కలిగించవచ్చు. మీకు ఏదైనా సమస్య ఉంటే, ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా