ప్రతిరోజూ ఉదయాన్నే ఈ నీటిని తాగడం అలవాటు చేసుకోండి.. ఎక్కువ కాలం యవ్వనంగా ఉంటారు..!

ఈ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎల్‌డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది హార్ట్‌ ఎటాక్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే మెంతి గింజల నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ప్రతిరోజూ ఉదయాన్నే ఈ నీటిని తాగడం అలవాటు చేసుకోండి.. ఎక్కువ కాలం యవ్వనంగా ఉంటారు..!
Methi Water
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 08, 2024 | 8:38 AM

ఉదయాన్నే ఖాళీ కడుపుతో చాలా మంది కాఫీ, టీలు తాగుతుంటారు. కానీ, ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదు.. దీంతో అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇలాంటి నీటిని తాగటం వల్ల మీరు మేలు కలుగుతుంది. ప్రతిరోజూ ఉదయాన్నే ఈ నీటిని తాగటం అలవాటు చేసుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు వృద్ధాప్యాన్ని కూడా దూరంగా ఉంచుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

వంటింట్లో ఉండే మసాల దినుల్లో మెంతులు ఒకటి. ఇవి ఆరోగ్యానికి ఔషధంగా ఉపయోగించే ఒక ములిక. మెంతులు కొంచెం చేదు రుచిని కలిగి ఉంటాయి. వీటిని తరచుగా భారతీయ వంటకాల్లో, ఆయుర్వేద ఔషధాల్లో విరివిగి ఉపయోగిస్తుంటారు. మెంతి గింజలను నీటిలో నానబెట్టి తయారు చేసిన మెంతి నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యం డయాబెటిస్‌ ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే ఇతర అనారోగ్య సమస్యలకు కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. మెంతులలో ఐరన్‌, మెగ్నీషియం, మాంగనీస్‌తో సహా ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. జీర్ణక్రియకు సహాయపడటం, రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరచడం, కడుపులో మంటను తగ్గించడం మొదలైనవి ప్రయోజనాలు ఉంటాయి. రోజూ ఉదయాన్నే మెంతిగింజల నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

మెంతి గింజలలో కరిగే ఫైబర్, గెలాక్టోమన్నన్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి. ఇది కార్బోహైడ్రేట్లు, చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది. మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఈ నీటిని తాగితే మంచి ఫలితాలను పొందుతారు. ఉబ్బరం, మలబద్ధకం, జీర్ణ సమస్యలను పరిష్కరించడానికి మెంతి గింజలను సాంప్రదాయకంగా ఉపయోగిస్తారు. మెంతి నీటిలో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అధిక ఫైబర్ ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడంలో మెంతి నీరు కూడా చాలా ఉపయోగకరంగా ఉండటానికి ఇదే కారణం.

ఇవి కూడా చదవండి

మెంతి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎల్‌డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది హార్ట్‌ ఎటాక్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే మెంతి గింజల నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మెంతి నీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని వివిధ ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

రోజూ ఉదయాన్నే మెంతి నీళ్ళు తాగడం వల్ల అనేక రకాల వ్యాధులు దూరమవుతాయి. మెంతి గింజలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. ఇది వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది. మెంతి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలను తగ్గించడం వల్ల స్పష్టమైన ఛాయను ప్రోత్సహిస్తుంది. సహజమైన కాంతిని అందిస్తుంది. మెంతులలో ప్రొటీన్, నికోటినిక్ యాసిడ్ ఉంటాయి. క్రమం తప్పకుండా మెంతి నీరు తాగడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే చుండ్రు లేదా దురద వంటి స్కాల్ప్ సమస్యలను నివారిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..