AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Life Lessons: మానసికంగా స్ట్రాంగ్ గా ఉండాలనుకుంటున్నారా.. ఈ డైలీ హ్యాబిట్స్ మీలో ఉన్నాయా? లేదా? చెక్ చేసుకోండి

మనలో చాలామంది మానసికంగా దృఢంగా ఉండలేరు. కొంతమంది చిన్న విషయాలకే త్వరగా భావోద్వేగానికి గురవుతారు. దీంతో చాలామంది సొసైటీలో చులనగా మారుతారు. అయితే అతి కొద్ది మంది మాత్రమే మెంటల్ లా స్ట్రాంగ్ ఉంటూ ఇతరులకు భిన్నంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు.

Life Lessons: మానసికంగా స్ట్రాంగ్ గా ఉండాలనుకుంటున్నారా.. ఈ డైలీ హ్యాబిట్స్ మీలో ఉన్నాయా? లేదా? చెక్ చేసుకోండి
Life Style 1
Balu Jajala
|

Updated on: Apr 08, 2024 | 8:35 AM

Share

మనలో చాలామంది మానసికంగా దృఢంగా ఉండలేరు. కొంతమంది చిన్న విషయాలకే త్వరగా భావోద్వేగానికి గురవుతారు. దీంతో చాలామంది సొసైటీలో చులనగా మారుతారు. అయితే అతి కొద్ది మంది మాత్రమే మెంటల్ లా స్ట్రాంగ్ ఉంటూ ఇతరులకు భిన్నంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అయితే కొంతమంది మానసికంగా ఎప్పటికీ దృఢంగా ఉండలేమని భావిస్తుంటారు. అయితే ఇది అస్సలు మంచిది కాదు. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు మానసికంగా దృఢంగా మార్చుకోవచ్చు. మీకోసం కొన్ని టిప్స్ ఇస్తున్నాం.. అవేంటో తెలుసుకొని ఫాలో అయ్యిపోండి.

ఒడిదుడుకులకు ధైర్యంగా : ప్రతి ఒక్కరి జీవితంలో కష్టసుఖాలుంటాయి. జీవితంలో సంతోషంగా ఉండే వ్యక్తి ఎవరూ ఉండరు. ఈ సందర్భంలో మీరు ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇలా చేయడం వల్ల మిమ్మల్ని మీరు మానసికంగా దృఢంగా, రోజంతా యాక్టివ్ గా ఉంటారు

ఒత్తిడికి చెక్ పెట్టండి: కొంతమంది చిన్నపాటి సమస్య వచ్చినా వెంటనే ఒత్తిడికి గురవుతూ మెంటల్ గా వీక్ అవుతుంటారు. దీంతో ప్రతి సమస్యను పెద్దగా భావించి అనేక తప్పులు చేస్తుంటారు. అలాంటివారు ఎప్పుడూ జీవితంలో ముందుకు సాగలేరు. మానసికంగా దృఢంగా ఉండాలంటే ముందుగా ఒత్తిడిని తగ్గించుకోవాలి.

తప్పులను ఒప్పుకోండి: జీవితంలో మనకు తెలియకుండా తప్పులు జరుగుతుంటాయి. అయితే ఆ తప్పులను గుర్తించి సరి చేసుకున్నవాళ్లే ముందుకు సాగుతారు. అందుకే తప్పులు చేస్తే వెంటనే అంగీకరించండి. అదే మీ గొప్ప బలం. మానసికంగా బలమైన వ్యక్తులు తమ తప్పులను అంగీకరించడానికి భయపడరు

రిస్క్ తీసుకోండి : రిస్క్ తీసుకోవడానికి భయపడే వ్యక్తి మానసికంగా ఎప్పటికీ దృఢంగా మారడు. మీరు మానసికంగా దృఢంగా ఉండాలనుకుంటే, ముందుగా మీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వెళ్లి రిస్క్ తీసుకోండి. ఇది కాకుండా, మీ జీవితంలో ఒక లక్ష్యాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం.

డైలీ దినచర్యను ప్లాన్ చేసుకోండి : మానసికంగా దృఢంగా ఉన్న వ్యక్తులు తమ రోజును వారి టైమ్‌టేబుల్ ప్రకారం విభజించుకుంటారు. అన్నింటిలో మొదటిది ఉదయం నిద్రలేచిన వెంటనే వారి రోజువారీ ప్రణాళికను తయారు చేస్తారు.  పనిని పూర్తి చేయడానికి రోజంతా కష్టపడతారు. స్మార్ట్ గా నూ వ్యవహరిస్తుంటారు.