Pressure Cooker: కుక్కర్‌లో వంట చేసినప్పుడు వాటర్‌ లీక్‌ అవుతోందా..? అయితే ఈ టిప్స్‌ పాటించండి!

దీని వల్ల కుక్కర్ నుండి నీరు బయటకు కారదు.కుక్కర్‌లో చేసిన ఆహారం కూడా అంటుకోదు. ఇలా చేస్తే కుక్కర్‌లో చేసిన వంట విడివిడిగా మరింత మృదువుగా ఉంటుంది. కుక్కర్ నుండి నీరు బయటకు రాకుండా ఉండటానికి కుక్కర్‌లో ఉడికించేటప్పుడు

Pressure Cooker: కుక్కర్‌లో వంట చేసినప్పుడు వాటర్‌ లీక్‌ అవుతోందా..? అయితే ఈ టిప్స్‌ పాటించండి!
Pressure Cooker
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 07, 2024 | 2:01 PM

ప్రస్తుతం చాలా మంది ఇళ్లలో ప్రెజర్‌ కుక్కర్లనే వినియోగిస్తున్నారు. బిజీ లైఫ్‌లో టైమ్‌ సేఫ్‌ చేయటం కోసం, తక్కువ నూనె వాడకం కోసం కూడా ప్రెజర్‌ కుక్కర్లలో వంట చేస్తున్నారు. అయితే, ఇక్కడే ఒక పెద్ద చిక్కు కూడా ఉంది.. ప్రెజర్ కుక్కర్‌లో వంట చేస్తున్నప్పుడు మాటి మాటికి లీకేజీ సమస్యలు ఎదురవుతుంటాయి. కుక్కర్‌ విజీల్‌ వచ్చేప్పుడు కుక్కర్ నుండి తరచుగా నీరు బయటకు చిమ్ముతుంది. దాంతో పొయ్యి చుట్టు పరిసరాలు మొత్తం పాడైపోతుంటాయి.కుక్కర్‌లో వండుతున్న అన్నం, పప్పు ఆ ప్రాంతమంతా చిమ్ముతుంది.. అయితే, మీ ఇంట్లోని కుక్కర్‌ కూడా ఇలాగే ఇబ్బంది పెడుతుందా..? అయితే, ఈ చిట్కాలు మీ కోసమే. ఇలా చేస్తే..కుక్కర్‌లో వంట సాఫీగా సాగిపోతుంది.

కుక్కర్‌లో వంట చేసేటప్పుడు, కుక్కర్‌ విజీల్‌ వచ్చేటప్పుడు కుక్కర్ నుండి నీరు బయటకు వస్తుంది. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితేవంట చేయడానికి ముందు ప్రెషర్ కుక్కర్ విజిల్‌ని చెక్ చేయండి. చాలా సార్లు కుక్కర్ విజిల్‌లో ఆహారం ఇరుక్కుపోతుంది. విజిల్ మురికిగా ఉంటే ఆవిరి బయటకు రాదు. అలాగే, వంట సమయంలో కుక్కర్‌లో నీళ్లు సరిపడా పోయాలి. కుక్కర్‌లో నీళ్లు ఎక్కువైతే కూడా విజీల్‌ వచ్చే సమయంలో ఈల శబ్దంతో పాటు నీరు బయటకు వస్తుంది. అందుకే ఆహారంలో సరైన మోతాదులో నీటిని పోసుకోవాలి.

కుక్కర్‌లో ఆహారాన్ని వండే ముందు రబ్బరును కూడా చెక్‌ చేసుకోవాలి.వంట తరువాత, రబ్బరు చల్లటి నీటిలో లేదా పై ఫ్రీజర్లో పెట్టుకోవటం మంచిది. ఇది వాటిని ఎక్కువ కాలం మన్నికగా ఉండేలా చేస్తుంది. కుక్కర్ నుండి నీరు రాకుండా నిరోధించడానికి ఒక చుక్క నూనె వేయండి. దీని వల్ల కుక్కర్ నుండి నీరు బయటకు కారదు.కుక్కర్‌లో చేసిన ఆహారం కూడా అంటుకోదు. ఇలా చేస్తే కుక్కర్‌లో చేసిన వంట విడివిడిగా మరింత మృదువుగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..