- Telugu News Photo Gallery White hair to black hair naturally at home by bottle gourd oil Telugu Lifestyle News
సోరకాయతో కేశ సౌందర్యం..! తెల్లజుట్టు సమస్యకు శాశ్వత పరిష్కారం..!! ఎలాగంటే..
నేటి ఆధునిక జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందిలో చర్మం, జుట్టు సమ్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. చిన్న వయసులోనే జుటట్టు రాలిపోవటం, బట్టతల, తెల్లజుట్టు వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. తెల్ల జుట్టు సమస్య పరిష్కారం కోసం మార్కెట్‌లో లభించే రకరకాల కెమికల్ హెయిర్ డై,షాంపులు వాడుతున్నారు. దాంతో మరింత లోతు కష్టల్లోకి కూరుకుపోతున్నారు. జుట్టు సమ్యలకు మార్కెట్లో లభించే కెమికల్ ఆధారిత ఉత్పత్తులను ఉపయోగించి పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతున్నారు.
Updated on: Apr 07, 2024 | 1:45 PM

జుట్టు సమస్యతో బాధపడేవారు సోరకాయతో తయారు చేసిన నూనెను వాడితే ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సొరకాయలోని గుణాలు అనేక రకాల జుట్టు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. సొరకాయను నూనెను ఉపయోగించి తెల్లజుట్టు, జుట్టు రాలిపోయే సమస్యలకు చెక్ పెట్టవచ్చునని చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

తెల్ల జుట్టు సమస్యను పరిష్కరించే సొరకాయ ఆయిల్ తయారీ కోసం...ముందుగా సోరకాయను పొట్టుతో పాటు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలను బాగా ఎండబెట్టుకోవాలి. బాగా ఎండిపోయిన సొరకాయ ముక్కలను పొడిలా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బాణలిలో 250 గ్రాముల కొబ్బరి నూనెను వేసుకుని వేడి చేయాలి. ఇలా వేడిచేసిన కొబ్బరి నూనెలో ముందుగా సిద్ధం చేసుకున్న సోరకాయ పొడిని వేసుకోవాలి.

ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ నూనెను జుట్టుకు బాగా పట్టించి 30 నిమిషాల తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా జుట్టుకు పట్టిస్తూ ఉంటే క్రమంగా తెల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి.

అంతేకాదు..ప్రతి రోజు సోరకాయ జ్యూస్ తాగటం వల్ల కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సొరకాయలో ఉండే నీటి శాతం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

సొరకాయలో మాంగనీస్, సెలీనియం, విటమిన్ సి, రిబోఫ్లావిన్, థియామిన్, పాంతోతేనిక్ యాసిడ్ , విటమిన్ బి6 , నియాసిన్ , ఫోలేట్ , శక్తి ఉంటాయి. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో సొరకాయ జ్యూస్ తాగడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. ఇది మాత్రమే కాదు, శరీరంలో అదనపు కొవ్వు ఈజీగా కరిగిపోతుంది.




