- Telugu News Photo Gallery Cinema photos Mamitha Baiju Shares stunning saree photos goes viral telugu movie news
Mamitha Baiju: ప్రేమలు హీరోయిన్ అందమైన మాయ.. మమితా లుక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
ప్రేమలు సినిమాతో సౌత్ ఇండియాలో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది కేరళ బ్యూటీ మమితా బైజు. ఈ క్యూట్ లవ్ స్టోరీలో రీనూ రాయ్ పాత్రలో అందం, సహజ నటనతో అదరగొట్టింది. ఈ మూవీతో యువతరం కలల రాణిగా మారిపోయింది మమితా. ఈ సినిమా తర్వాత దక్షిణాదిలో మరో సాయిపల్లవి అవుతుందంటూ ఇప్పటికే ఆమెపై ప్రశంసలు కురిపించారు మేకర్స్. అలాగే యూత్‌లో ఈ బ్యూటీకి ఫుల్ క్రేజ్ వచ్చింది.
Updated on: Apr 07, 2024 | 1:30 PM

ప్రేమలు సినిమాతో సౌత్ ఇండియాలో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది కేరళ బ్యూటీ మమితా బైజు. ఈ క్యూట్ లవ్ స్టోరీలో రీనూ రాయ్ పాత్రలో అందం, సహజ నటనతో అదరగొట్టింది. ఈ మూవీతో యువతరం కలల రాణిగా మారిపోయింది మమితా.

ఇప్పటికే రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త ప్రాజెక్టులో ఈ బ్యూటీని ఎంపిక చేశారని టాక్ వినిపిస్తుంది. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.

ప్రేమలు తర్వాత మమితా బైజు తమిలంలో రెబల్ అనే సినిమాలో నటించింది. మార్చి 22న రిలీజ్ అయిన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఈ మూవీతోనే కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ ఈ సినిమా ఆశించిన స్తాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మమితా.. తాజాగా తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. పట్టుచీరలో ముద్ద మందారంలా కనిపిస్తుంది ఈ మలయాళీ కుట్టి. సింపుల్ గా కనిపిస్తూనే చిరునవ్వుతో మాయ చేస్తుంది మమితా.

తాజాగా మమితా లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.. త్వరలోనే మమితా మరో తెలుగు ప్రాజెక్టులో కనిపించనుందని టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ యంగ్ హీరో సినిమాలో ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందని సమాచారం.

ఇంత క్యూట్‌గా ఉంటే ఎలా.. ప్రేమలు బ్యూటీ అందమైన మాయ..




