- Telugu News Photo Gallery If you are vomiting during your journey, Follow this Tips, check here is details in Telugu
Motion Sickness: జర్నీలో వాంతులు అవుతున్నాయా.. కాకూడదంటే ఇలా చేయండి!
చాలా మందికి ప్రయాణం అనేది పడదు. జర్నీ చేస్తున్నప్పుడు వికారంగా ఉండటం, తలనొప్పి రావడం, వాంతులు అవ్వడం వంటివి జరుగుతూ ఉంటాయి. దీన్నే మోషన్ సిక్నెస్ అని కూడా అంటారు. దీంతో చాలా మంది జర్నీ చేయడానికి భయ పడి పోతూ ఉంటారు. అయితే ఈసారి జర్నీ చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే.. ఖచ్చితంగా రిలీఫ్‌నెస్ పొందుతారు. పుదీనాలో చాలా ఔషధ గుణాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. మీరు ప్రయాణం చేసేటప్పుడు పుదీనా నీళ్లు తాగితే.. మీకు వికారం, తలనొప్పి, వాంతులు రాకుండా చేస్తుంది. నీళ్లు తాగలేని వాళ్లు నోట్లో పుదీనా..
Updated on: Apr 07, 2024 | 1:56 PM

చాలా మందికి ప్రయాణం అనేది పడదు. జర్నీ చేస్తున్నప్పుడు వికారంగా ఉండటం, తలనొప్పి రావడం, వాంతులు అవ్వడం వంటివి జరుగుతూ ఉంటాయి. దీన్నే మోషన్ సిక్నెస్ అని కూడా అంటారు. దీంతో చాలా మంది జర్నీ చేయడానికి భయ పడి పోతూ ఉంటారు. అయితే ఈసారి జర్నీ చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే.. ఖచ్చితంగా రిలీఫ్‌నెస్ పొందుతారు.

పుదీనాలో చాలా ఔషధ గుణాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. మీరు ప్రయాణం చేసేటప్పుడు పుదీనా నీళ్లు తాగితే.. మీకు వికారం, తలనొప్పి, వాంతులు రాకుండా చేస్తుంది. నీళ్లు తాగలేని వాళ్లు నోట్లో పుదీనా పెట్టుకున్నా పర్వాలేదు.

జర్నీ సిక్నెస్‌ని తగ్గించడానికి అల్లం కూడా బాగానే సహాయ పడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. మీరు ప్రయాణం చేసేటప్పుడు అల్లాన్ని వాసన పీల్చుతూ ఉంటే.. ఈ సమస్య నుంచి బయట పడొచ్చు.

అదే విధంగా మీరు ప్రయాణం చేసేటప్పుడు ఆరెంజ్ మిఠాయి తిన్నా వాంతులు, వికారం నుంచి బయట పడొచ్చు. ఆరెంజ్ మిఠాయి మైకము, వికారాన్ని తగ్గిస్తుంది.

మోషన్ సిక్నెస్‌ని తగ్గించడంలో లవంగాలు కూడా ఎఫెక్టీవ్‌గా పని చేస్తాయి. లవంగాల్లో యాంటీ సెప్టిక్ లక్షణాలు అనేవి అధికంగా ఉంటాయి. ఇవి ప్రయాణ సమయంలో వికారాన్ని, తలనొప్పిని తగ్గిస్తుంది. మీరు ప్రయాణం చేసేటప్పుడు లవంగాన్ని నోట్లో వేసుకుంటే బెటర్.




