Pista Pappu Benefits: ఈ పప్పు రోజుకు 10గింజలు తిన్నా చాలు..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
పిస్తా అత్యంత పోషకమైన డ్రై ఫ్రూట్. వీటిల్లో మన శరీరానికి అవసరమయ్యే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇందులో శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇందులో బీటా కెరోటిన్, డైటరీ ఫైబర్, ఫాస్పరస్, ప్రొటీన్, ఫోలేట్, థయామిన్, కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం, కాపర్, పొటాషియం, విటమిన్ ఎ, బి6 మరియు విటమిన్ కె కూడా ఉన్నాయి. అధిక బరువును తగ్గించేందుకు, గుండెను, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే పోషకాలు ఈ పప్పుల్లో అధికంగా ఉంటాయి.
Updated on: Apr 08, 2024 | 11:15 AM

పిస్తాపప్పు తినడం వల్ల అనేక హృదయనాళ ప్రయోజనాలు లభిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పిస్తాలు రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి.

రోజూ పిస్తాపప్పు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. కంటి ఆరోగ్యానికి అవసరమైన లుటిన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు పిస్తాపప్పులో పుష్కలంగా ఉన్నాయి. ఒక నివేదిక ప్రకారం.. లుటీన్, జియాక్సంతిన్ కంటిశుక్లం వంటి దీర్ఘకాలిక కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వయస్సు-సంబంధిత సమస్యల నుండి రక్షించడంలో కూడా ఇవి సహాయపడతాయి.

పిస్తా మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ బి6 రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణాన్ని పెంచడానికి సహాయపడుతుంది. పిస్తాలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. తద్వారా ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది. ప్రీబయోటిక్స్ అని పిలువబడే ఒక రకమైన ఫైబర్ గట్‌లోని మంచి బ్యాక్టీరియాను ఫీడ్ చేస్తుంది. గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు కూడా దూరం చేస్తుంది.

పిస్తాలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఫెనోలిక్ కాంపౌండ్, కెరోటినాయిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. డయాబెటిక్ రోగులకు బెస్ట్ డైట్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

పిస్తాపప్పులో ఉండే విటమిన్ ఇ చర్మం వయసు పెరిగే కొద్దీ యవ్వనంగా ఉండేలా చేస్తుంది. పురుషులలో అంగస్తంభన సమస్యలను పరిష్కరించడంలో పిస్తాపప్పులు బాగా ఉపయోగపడతాయి. అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా, పిస్తాలు పెద్దప్రేగు క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.





























