Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: బైక్‌ను తాకి చూడండి ఏమవుతుందో..! అంటూ ట్రాఫిక్‌ పోలీసులకే సవాల్‌ విసిరిన యువతి.. ! పాత వీడియో కొత్తగా వైరల్‌..

వైరల్‌ వీడియోలో నిబంధనలు ఉల్లంఘించినందుకు బైక్‌పై వెళ్తున్న మహిళని అడ్డుకోవడం పోలీసులకు తలనొప్పిగా మారింది. హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడుపుతున్న సదరు మహిళను పోలీసులు అడ్డుకోవడంతో నడిరోడ్డుపై ఆమె హంగామా సృష్టించింది. బైక్‌ను అడ్డుకున్న పోలీసులు వాహనం పక్కకు పెట్టాలని కోరటంతో.. ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఇప్పుడు

Watch Video: బైక్‌ను తాకి చూడండి ఏమవుతుందో..! అంటూ ట్రాఫిక్‌ పోలీసులకే సవాల్‌ విసిరిన యువతి.. ! పాత వీడియో కొత్తగా వైరల్‌..
Woman Biker
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 08, 2024 | 2:50 PM

సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వీడియోలు వైరల్‌ అవుతుంటాయో చెప్పలేం. చాలా సందర్భాల్లో పాత వీడియోలు కూడా మళ్లీ మళ్లీ ట్రెండింగ్‌లోకి వస్తుంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా..నిబంధనలను ఉల్లంఘించినందుకు ఓ మహిళను అడ్డుకోవడం పోలీసులకు తలనొప్పిగా మారింది. తననే అడ్డుకుంటారా.? అంటూ సదరు యువతి నడిరోడ్డుపైనే వీరంగం సృష్టించింది. పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగింది. ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీ చెబితేనే తాను బైక్ ఆపుతానంటూ రోడ్డుపై బీభత్సం సృష్టించింది సదరు మహిళ. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులతో ముంబై మహిళ దురుసుగా ప్రవర్తించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, మహిళ హెల్మెట్ లేకుండానే బైక్‌ నడుపుతోంది. ఈ ఘటన ముంబైలోని బాంద్రా-వర్లీ సీ లింక్‌పై బైక్ నడుపుతుండగా, పోలీసులు ఆమెను ఆపడంతో సదరు యువతి వారితో రెచ్చిపోయి ప్రవర్తించింది.

వైరల్‌ వీడియోలో నిబంధనలు ఉల్లంఘించినందుకు బైక్‌పై వెళ్తున్న మహిళని అడ్డుకోవడం పోలీసులకు తలనొప్పిగా మారింది. హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడుపుతున్న సదరు మహిళను పోలీసులు అడ్డుకోవడంతో నడిరోడ్డుపై ఆమె హంగామా సృష్టించింది. బైక్‌ను అడ్డుకున్న పోలీసులు వాహనం పక్కకు పెట్టాలని కోరటంతో.. ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఇప్పుడు నరేంద్రమోదీ చెబితేనే బైక్ ఆగుతుందని ఆ మహిళ పోలీసుకే వార్నింగ్‌ ఇచ్చింది. ఇంకా మాట్లాడుతూ, వెళ్లి మోదీని పిలవండి, అతను నాకు చెబితే నేను బైక్ ఆపుతాను అంటూ హల్‌చల్‌ చేసింది. అంతటితో ఆగలేదు. పోలీసులతో ఆ మహిళ వాగ్వాదాన్ని కొనసాగించింది. అర్ధంలేని మాటలు మాట్లాడటం మొదలు పెట్టింది..ఈ బైక్‌ ఇప్పుడు నేరుగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఆగుతుందని, మీకు కావలసినది చేయండి అంటూ తెగేసి చెప్పింది సదరు మహిళ.

ఇవి కూడా చదవండి

ట్రాఫిక్ పోలీసు బైక్‌ను పట్టుకోవడంతో, నా వాహనాన్ని తాకడానికి ధైర్యం చేస్తే, చేయి నరికేస్తానంటూ ఆ మహిళ బెదిరించడం ప్రారంభించింది. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ వీడియో చాలా పాతదని తెలిసింది. కానీ, సోషల్ మీడియాలో మరోమారు వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..