ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో.! భార్య కావాలంటూ నెట్టింట పోస్ట్.. కండిషన్లు తెలిస్తే..
క్రియేటివిటీ ఒకరి సొత్తు కాదు.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోవడంతో.. ఎవరి క్రియేటివిటీ వారు.. కొట్టేచ్చేతట్టు వీడియోలు, డ్యాన్సులు, డ్రామాల రూపంలో చూపిస్తూ ఓవర్‌నైట్ స్టార్‌లు అయిపోతున్నారు. ఇదిలా ఉంటే.. ఇక్కడొక వ్యక్తి తన హ్యుమర్‌ను నెటిజన్లతో పంచుకున్నాడు.
క్రియేటివిటీ ఒకరి సొత్తు కాదు.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోవడంతో.. ఎవరి క్రియేటివిటీ వారు.. కొట్టేచ్చేతట్టు వీడియోలు, డ్యాన్సులు, డ్రామాల రూపంలో చూపిస్తూ ఓవర్‌నైట్ స్టార్‌లు అయిపోతున్నారు. ఇదిలా ఉంటే.. ఇక్కడొక వ్యక్తి తన హ్యుమర్‌ను నెటిజన్లతో పంచుకున్నాడు. ఇక ఆ పోస్టు కాస్తా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇంతకీ అదేంటని అనుకుంటున్నారా.? ఏం లేదండీ.. తనకు భార్య కావాలంటూ.. క్వాలిటీలు ఇలా ఉండాలంటూ.. నా లైఫ్‌లో ‘జూనియర్ వైఫ్’ పోస్ట్ ఖాళీ ఉందంటూ.. లింక్దిన్‌లో పోస్ట్ చేశాడు. అది కాస్తా క్షణాల్లో వైరల్ అయింది. జితేంద్ర సింగ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఒకడు ‘జూనియర్ వైఫ్’ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందన్నాడు.
జాబ్ టైప్.. రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంటూ ఎన్ని రౌండ్లు ఇంటర్వ్యూ ఉంటాయో పేర్కొన్నాడు. జీతం ఎంత అనేది కాన్ఫిడెన్షియల్.? అనుభవం ఏంటి.? కెరీర్ లెవెల్ ఏంటి.? రిక్వైర్‌మెంట్స్ ఎలా ఉంటాయి.? అనే అంశాలను పేర్కొన్నాడు. ఆసక్తి ఉన్న కాండిడేట్స్ సీవీలను ఇన్‌బాక్స్ చేయండి అన్నారు. ఇక కట్ చేస్తే.. చివర్లో ఇది జస్ట్ ఫన్నీ పోస్ట్.. జనాలను నవ్వించడం కోసమే పెట్టానని చెప్పుకొచ్చాడు. ఇక టాప్ సెర్చెడ్ జాబ్ వెబ్‌సైట్‌లో ఆ వ్యక్తి ఈ పోస్ట్ పెట్టడంతో కామెంట్స్ హోరెత్తాయి. నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరి అదేంటో ఇప్పుడు చూసేద్దామా..