నాన్ వెజ్ ప్రియులు జాగ్రత్త..! మాంసం ఎక్కువగా తినేవారిలో ఈ క్యాన్సర్ ముప్పు అధికం..?
మలబద్ధకం, విరేచనాలు, మలంలో రక్తం, మలవిసర్జన సమయంలో కడుపు నొప్పి, రక్తహీనత, అలసట, ఉన్నట్టుండి బరువు తగ్గడం వంటి లక్షణాల కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెద్దప్రేగు క్యాన్సర్ లక్షణాలను అర్థం చేసుకోవడం ద్వారా వ్యాధిని ముందస్తుగా గుర్తించి చికిత్స చేయడం ద్వారా ప్రమాద తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది.
మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, వ్యాధుల నుండి మనల్ని రక్షించడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మాంసం చాలా మందికి రోజువారీ ఇష్టమైన ఆహారం.. శాఖాహారం అంటే పెద్దగా ఇష్టపడని వారు.. రోజూ మాంసాహారం తినడానికి ఇష్టపడతారు. ప్రస్తుతం ఏ పార్టీ అయినా, ఫంక్షన్ అయినా, ఈవెంట్ ఏదైనా సరే..వెజ్, నాన్ వెజ్ రెండింటికీ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తుంటారు.. ఆ మేరకు ప్రజలకు ఇష్టమైన ఆహారం మాంసం. కానీ మాంసాహారం ఎక్కువగా తినే వారికి కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన సవాలుగా మారిందంటూ వైద్య పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.
పెద్దప్రేగు క్యాన్సర్ జీర్ణవ్యవస్థలోని ముఖ్యమైన అవయవాలను ప్రభావితం చేస్తుంది. పోషకాల శోషణ, కడుపులోంచి వ్యర్థాలను తొలగించడం వంటి విధులకు అంతరాయం కలిగిస్తుంది. కొన్ని ప్రమాద కారకాలు ఈ క్యాన్సర్‌తో సంబంధం కలిగి ఉంటాయి. మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కోలన్ క్యాన్సర్ వస్తుంది. తగినంత వ్యాయామం చేయకపోవడం, ఊబకాయం, ఆల్కహాల్ లేదా పొగాకు తాగడం, పండ్లు, కూరగాయలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, పీచుపదార్థాలు, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
ముఖ్యంగా రెడ్ మీట్ లేదా ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువ కాలం తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. మాంసాన్ని అధిక ఉష్ణోగ్రతల వద్ద వండినప్పుడు, అవి క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించటం కోసం సమతుల్య ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడం, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్‌ను నివారించవచ్చు.
పెద్దప్రేగు క్యాన్సర్ లక్షణాలు: మలబద్ధకం, విరేచనాలు, మలంలో రక్తం, మలవిసర్జన సమయంలో కడుపు నొప్పి, రక్తహీనత, అలసట, ఉన్నట్టుండి బరువు తగ్గడం వంటి లక్షణాల కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెద్దప్రేగు క్యాన్సర్ లక్షణాలను అర్థం చేసుకోవడం ద్వారా వ్యాధిని ముందస్తుగా గుర్తించి చికిత్స చేయడం ద్వారా ప్రమాద తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…