Rajanna Sircilla: బతుకమ్మ చీరలు రెడీ.. 10 రంగులు, 25 డిజైన్లు.. 240 వెరైటీల్లో ముందస్తు పంపిణీకి సిద్ధం..!

ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా చీరలు అందించడంతోపాటు నేతన్నకు ఉపాధి చూపించి ఆదుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర సర్కారు బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టింది. 2017 నుంచి ఏటా 18 ఏళ్లు నిండిన బిపిఎల్ మహిళలందరికీ ఉచితంగా చీరలు అందిస్తున్నది. ఈ ఏడాది 350 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి కోటి చీరలు ఉత్పత్తికి ఆర్డర్ ఇచ్చింది. అక్టోబర్ లో బతుకమ్మ ఉత్సవాలు మొదలుకానుండగా బతుకమ్మ పండగ వరకు లబ్ధిదారులకు అందించాలని లక్ష్యం విధించుకుంది. ఇప్పటికే

Rajanna Sircilla: బతుకమ్మ చీరలు రెడీ.. 10 రంగులు, 25 డిజైన్లు.. 240 వెరైటీల్లో ముందస్తు పంపిణీకి సిద్ధం..!
Bathukamma Sarees
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Aug 14, 2023 | 5:05 PM

సిరిసిల్ల కార్మిక క్షేత్రంలోబతుకమ్మ చీరాల తయారీ ఊపందుకుంది. 10 రకాల రంగులు, 25 డిజైన్లు, 240 వెరైటీల్లో చీరలు తయారవుతున్నాయి.. ప్రభుత్వం 350 కోట్ల రూపాయల విలువైన కోటి చీరలు ఆర్డర్ సిరిసిల్లకు దక్కగా ఉత్పత్తి వడివడిగా, పండుగలా సాగుతున్నది. ఇప్పటికే దాదాపు 30 లక్షల పైగా చీరలు ఉత్పత్తి పూర్తయి ప్రాసెసింగ్ కాగా, ఆ వెంటనే చేనేత జౌళి శాఖ యంత్రాంగం జిల్లాలకు తరలిస్తున్నది. వచ్చే బతుకమ్మ వేడుకలు మొదలు కానుండగా ఆలోపే బతుకమ్మ చీరల పంపిణీ చేసేందుకు జౌలిశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది.

ప్రాసెసింగ్ యూనిట్ల నుంచే ఇతర జిల్లాలకు..

ఉత్పత్తి అయిన వస్త్రాన్ని ఎప్పటికప్పుడు ప్రాసెసింగ్ యూనిట్లకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు5 కోట్ల 50 లక్షల మీటర్ల వస్త్రం అవసరం కాగా 30 లక్షల పైగానే చీరలు తయారు కాగా సిరిసిల్లలోని రెండు, హైదరాబాదులోని కాటేదాన్ లో ఉన్న 9యూనిట్లకు పంపించారు. ప్రాసెసింగ్ అయినా చీరలు వెనువెంటనే ప్యాకింగ్ చేసి జిల్లాలకు తరలించేలా టెస్కో సంస్థ అధికారులు ఏర్పాటు చేశారు. గత వారం నుంచే తరలిస్తుండగా అక్టోబర్ నాటికి మొత్తం ఈ ప్రక్రియను ముగించనున్నారు.

Bathukamma Sarees Ready

తయారీలో దాదాపు 15,000 మంది నేత కార్మికులు..

బతుకమ్మ చీరల తయారీలో వేలాది మందికి చేతినిండా పని దొరుకుతుంది. దాదాపుగా 15000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. నేత కార్మికులతో పాటు వైపని వార్పిన్ కార్మికులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఆటో కార్మికులు, గుమస్తాలు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు భాగస్వాములు అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

రోజుకు మూడు లక్షల మీటర్ల పైగా వస్త్రం తయారీ..

గత జనవరిలో బతుకమ్మ చీరల ఆర్డర్ను రాష్ట్ర సర్కారీ ఇచ్చింది. కోటి చీరలు సంబంధించి 6.3 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేయాల్సి ఉండగా ఆర్డర్ వచ్చిన తర్వాత ఉత్పత్తి ప్రారంభమైంది. సెప్టెంబర్ 15 వరకు మొత్తం తయారు పూర్తి కావాల్సి ఉండగా దాదాపుగా పదివేల సంచాల పై ఉత్పత్తిని ప్రారంభించారు. ఇప్పటివరకు 4.7 కోట్ల మీటర్ల వస్త్రం 30 లక్షల పైగా చీరలు తయారు చేశామని పండుగ సమీపిస్తున్నందున చీరల ప్రొడక్షన్లో మరింత వేగం పెంచారు. ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 15 వేల మంది కార్మికులు రాత్రి పగలనకుండా పనిచేస్తున్నారు. రోజుకు సుమారుగా మూడున్నర లక్షల పైగా మీటర్ల వస్త్రం (60 వేల పైగా చీరలు) ఉత్పత్తి చేస్తున్నారు. అవసరమైతే మరిన్ని సాంచలపై తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

బతుకమ్మ చీరల తయారీలో సిరిసిల్లలో రోజు పండుగ వాతావరణంలా కనిపిస్తుంది. రాత్ పైలి, దిన్ పైలి నడుపుతున్నారు. ఎక్కడ చూసినా సాంచల సప్పుడే వినిపిస్తుంది. వాడవాడలా చీరలు తీసుకెల్లే ఆటోలు, బీములు నింపటోళ్ళతో ఎప్పుడు సందడిగా ఉంటుంది.

ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా చీరలు అందించడంతోపాటు నేతన్నకు ఉపాధి చూపించి ఆదుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర సర్కారు బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టింది. 2017 నుంచి ఏటా 18 ఏళ్లు నిండిన బిపిఎల్ మహిళలందరికీ ఉచితంగా చీరలు అందిస్తున్నది. ఈ ఏడాది 350 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి కోటి చీరలు ఉత్పత్తికి ఆర్డర్ ఇచ్చింది. అక్టోబర్ లో బతుకమ్మ ఉత్సవాలు మొదలుకానుండగా బతుకమ్మ పండగ వరకు లబ్ధిదారులకు అందించాలని లక్ష్యం విధించుకుంది. ఇప్పటికే సుమారుగా కోటి పైగా చీరలు ఉత్పత్తి పూర్తి చేసి జిల్లాకు తరలిస్తున్నది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద దారుణంగా.
రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద దారుణంగా.
ఇజ్రాయెల్‌పై దాడి చేయండి.! హత్య జరిగిన వెంటనే ఇరాన్ సమావేశం
ఇజ్రాయెల్‌పై దాడి చేయండి.! హత్య జరిగిన వెంటనే ఇరాన్ సమావేశం
ప్రభాస్.. సల్మాన్ ఖాన్ కు నచ్చిన పులస పులుసు ఇదే.!
ప్రభాస్.. సల్మాన్ ఖాన్ కు నచ్చిన పులస పులుసు ఇదే.!
కమలా హ్యారీస్ భారతీయురాలా లేక నల్లజాతీయురాలా.? ట్రంప్ కామెంట్స్..
కమలా హ్యారీస్ భారతీయురాలా లేక నల్లజాతీయురాలా.? ట్రంప్ కామెంట్స్..
తోటి ప్రయాణికుడిని చెప్పుతో కొట్టిన వ్యక్తి.. మెట్రోలో వాగ్వాదం.!
తోటి ప్రయాణికుడిని చెప్పుతో కొట్టిన వ్యక్తి.. మెట్రోలో వాగ్వాదం.!
ముంగీసలను పెంచుకుంటున్న విచిత్ర జంతు ప్రేమికుడు.!
ముంగీసలను పెంచుకుంటున్న విచిత్ర జంతు ప్రేమికుడు.!
కేరళ సీఎం సహాయ నిధికి.. అదానీ, విక్రమ్‌ భారీ విరాళాలు.!
కేరళ సీఎం సహాయ నిధికి.. అదానీ, విక్రమ్‌ భారీ విరాళాలు.!
కొండచరియలు విరిగిపడడం ముందే పసిగట్టలేమా.? అసలు కథ ఇదేనా..
కొండచరియలు విరిగిపడడం ముందే పసిగట్టలేమా.? అసలు కథ ఇదేనా..
హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా హత్య..
హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా హత్య..
శ్రీశైలం మల్లన్న గుల్లో తాగువోతోని వీరంగం.! | దళితబందు కోసం..
శ్రీశైలం మల్లన్న గుల్లో తాగువోతోని వీరంగం.! | దళితబందు కోసం..