AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

King Cobra Video: కోపంతో బుసలు కొడుతున్న కింగ్ కోబ్రా.. తలపై ముద్దుపెట్టి కూల్‌ చేసిన ఘనుడు..! ఆ తర్వాత ఏమైందంటే..

ఈ వీడియోను ఇప్పటివరకు నాలుగు లక్షలకు పైగా వీక్షించారు. అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వినియోగదారులు భిన్నమైన స్పందనలు ఇచ్చారు. కొందరు క్లిప్‌పై ప్రశంసలు కురిస్తుంటే..మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఆ వ్యక్తి ధైర్యాన్ని ప్రశంసించారు. ఒక వినియోగదారు "కిస్ ఆఫ్ డెత్" అని రాశారు. కానీ, పాముల పేరు వింటే దాదాపు అందరూ ప్రాణ భయంతో పరుగులు పెడతారు. ఇక కింగ్‌ కోబ్రా లాంటి పామును చూస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తాల్సిందే.

King Cobra Video: కోపంతో బుసలు కొడుతున్న కింగ్ కోబ్రా.. తలపై ముద్దుపెట్టి కూల్‌ చేసిన ఘనుడు..! ఆ తర్వాత ఏమైందంటే..
Man Kiss Snake
Jyothi Gadda
|

Updated on: Aug 14, 2023 | 3:00 PM

Share

ఇంటర్‌నెట్‌ సదుపాయం.. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎక్కడ ఎలాంటి వింత జరిగినా, ఏదైనా విచిత్ర సంఘటన జరిగినా అది క్షణాల్లో నెటిజన్లకు తెలిసిపోతుంది. కానీ కొందరు సోషల్ మీడియాలో ఫేమస్‌ అవ్వాలనే పిచ్చి కోరికతో.. చిన్న తప్పిదాలు చేస్తుంటారు. మరికొందరు పిచ్చి చేష్టలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ముఖ్యంగా సెల్ఫీలు, రీల్స్‌ పేరుతో చాలా మంది యువత ప్రాణాలను రిస్క్‌లో పెడుతుంటారు. అలాగే కొందరు పాములతో కూడా ఆటలాడుతుంటారు.. నిజానికి పాము పేరు వింటేనే చాలా మందికి గూస్‌బంప్స్‌ వస్తాయి. పాము చుట్టుపక్కల ఉందని తెలిస్తే చాలు.. క్షణాల్లో అక్కడ్నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటారు. పాముల పేరు వింటే దాదాపు అందరూ ప్రాణ భయంతో పరుగులు పెడతారు. ఇక కింగ్‌ కోబ్రా లాంటి పామును చూస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తాల్సిందే. ఈ వీడియో చూసే ముందు మీరు భయపడతారో లేదో ఆలోచించండి? మీరు ఊహించలేని విధంగా ఒక వ్యక్తి చేసిన ఘనత చూస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. వైరల్‌ వీడియోలో ఓ వ్యక్తి ఊహించలేని ఘనకార్యం చేశాడు. ఆ వ్యక్తి కింగ్ కోబ్రా లాంటి ప్రాణాంతక పాము తలపై ముద్దుపెట్టే ధైర్యం ప్రదర్శించాడు. ఈ వీడియో చాలా ప్రమాదకరమైనది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే..

ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లో చాలా మంది దృష్టిని ఆకర్షించిన కింగ్ కోబ్రా వైరల్ వీడియో ఇది. ఈ ఫుటేజ్ చూసిన ప్రతి ఒక్కరికి గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. అక్కడ ఒక వ్యక్తి కింగ్ కోబ్రా దగ్గరకు వెళ్లడానికి ధైర్యం చేయడమే కాకుండా అతడు దాన్ని ముద్దు పెట్టుకోవడానికి కూడా ప్రయత్నించాడు. కింగ్ కోబ్రా అత్యంత విషపూరితం, ప్రమాదకరమైన పాము జాతికి చెందినది. ఈ వీడియో @therealtarzonn అనే ఖాతా ద్వారా Instagramలో అప్‌లోడ్ చేశారు. వీడియోలో కనిపించిన ప్రమాదకరమైన స్టంట్ చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. వీడియోలో ఓ వ్యక్తి పాము తలపై ముద్దు పెట్టుకోవడం చూసి ప్రతి ఒక్కరూ ఒళ్లు జలదరింపుకు గురవుతున్నారు. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వీడియో వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ఇప్పటివరకు నాలుగు లక్షలకు పైగా వీక్షించారు. అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వినియోగదారులు భిన్నమైన స్పందనలు ఇచ్చారు. కొందరు క్లిప్‌పై ప్రశంసలు కురిస్తుంటే..మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఆ వ్యక్తి ధైర్యాన్ని ప్రశంసించారు. ఒక వినియోగదారు “కిస్ ఆఫ్ డెత్” అని రాశారు. మరొక వినియోగదారు ఇలా వ్రాశాడు, డ్యూడ్ నాకు మీరు వ్యక్తిగతంగా తెలియదు, కానీ నేను మీ గురించి ఆందోళన చెందుతున్నాను. మీరు చేసే పనిని నేను అభినందిస్తున్నాను. కానీ, మీరు సురక్షితంగా ఉండండి.” అంటూ సూచించారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించారు. తమ భిన్నమైన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..