Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: స్వాతంత్ర్య దినోత్సవం రోజున బుర్జ్ ఖలీఫాపై కనిపించని పాకిస్థాన్ జెండా.. ఏం జరిగిందంటే..

సంబరాలకు సిద్ధమయ్యారు. అంతా అక్కడికి చేరుకున్నారు. కౌంట్ డౌన్ మొదలు పెట్టారు.. 3..2..1.. నెంబర్లు ముగిసాయి.. కానీ అక్కడ ఎలాంటి లైటింగ్ రాలేదు. దీంతో షాకయ్యారు. ఇదేంటి మా జెండా ఎగురుతుందని అనుకున్నాం.. కానీ, అలా జరగలేదే.. తమ దేశ స్వాతంత్ర్య వేడుకలను జరుపుకోలేక పోయామని ఆందోళనకు గురయ్యారు. నిరసనతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదంతా జరిగింది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై పాకిస్తాన్ జెండా ప్రదర్శించకపోవడంతో..

Watch Video: స్వాతంత్ర్య దినోత్సవం రోజున బుర్జ్ ఖలీఫాపై కనిపించని పాకిస్థాన్ జెండా.. ఏం జరిగిందంటే..
Burj Khalifa
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 14, 2023 | 3:36 PM

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై పాకిస్తాన్ జెండా ప్రదర్శించలేదు. దీంతో పాకిస్తానీ జనం అవమానంగా ఫీలయ్యారు. ప్రత్యేక సందర్భాల్లో ఈ భవనంపై అందుకు సంబంధించిన చిత్రాన్ని ప్రదర్శిస్తుంటారు. అయితే, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది 2716.5 అడుగుల ఎత్తైన ఈ భవనంపై పాకిస్తాన్ జెండాను ప్రదర్శిస్తారని పాకిస్తానీయులు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దీంతో అక్కడికి వచ్చిన పాకిస్తానీయులు నిరశాకకు గురయ్యారు. ఆగస్టు 14న పాకిస్థాన్ స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటుంది. ఈ వేడుకల సందర్భంగా, భవనంపై పాకిస్తాన్ జెండాను ప్రదర్శించడానికి బుర్జ్ ఖలీఫా కమిటీ పూర్తిస్థాయిలో నో చెప్పింది. ఈ ఏడాది అస్సలు ప్రదర్శించేది లేదని తేల్చి చెప్పింది. అయినా, అక్కడికి పెద్ద ఎత్తున పాకిస్తానీ జనం చేరుకున్నారు.

ఈ మొత్తం ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పాకిస్తాన్ పేరుతో నెటిజనం రకరకాల జోకులు పేల్చుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇది వందలాది పాకిస్తానీయులు అక్కడి చేరుకుని ఆ నిమిషం కోసం వేచియున్నారు. కౌంట్ డౌన్ మొదలు పెట్టారు.. కౌంట్ డౌన్ ముగిసినా ఆ భవనంపై ఎలాంటి లైట్లు రాకవడంతో పాకిస్తానీయులు షాక్ అయ్యారు. వారు దీనిపై చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

దుబాయ్ నుంచి ట్విట్టర్‌లో వచ్చిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో.. వందలాది మంది పాకిస్తానీయులు భవనం వద్దకు చేరుకోవడం మనం స్పష్టంగా ఈ వీడియోలో చూడవచ్చు. దేశ స్వాతంత్ర్య వేడుకలను జరుపుకోవడానికి అర్ధరాత్రి బుర్జ్ ఖలీఫాకు చేరుకున్నారు. పాకిస్తాన్ జెండాను ఎగురవేయనందుకు వారంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు. అర్ధరాత్రి కూడా బుర్జ్ ఖలీఫా దగ్గర తమ దేశ జెండా ఎగురవేసేందుకు వందలాది మంది పాకిస్థానీయులు ఎదురు చూస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఈ భవనం తమ జాతీయ జెండా రంగులతో మెరిసిపోతుందనే ఆశతో వారు కనిపిస్తారు. కానీ అలా జరగలేదు.

‘యే హై ఔకత్ హమారీ’ (ఇది మా పరిస్థితి)

ఈ ఘటన మొత్తాన్ని ఓ మహిళ తన మొబైల్‌లో రికార్డ్ చేసింది. 12 గంటలు దాటిన ఒక్క నిమిషం, కానీ బుర్జ్ ఖలీఫాపై పాకిస్థాన్ జెండా చిత్రం పెట్టబోమని దుబాయ్ వాసులు చెప్పినట్లు ఈ మహిళ కామెంట్ చేయడం మనం ఇక్కడ చూడవచ్చు. ఇది మన స్థితి… పాకిస్తాన్ ప్రజలు నినాదాలు చేస్తున్నారు.. కానీ బుర్జ్ ఖలీఫాపై పాకిస్తాన్ జెండా ఎగరలేదు. పాకిస్తానీయులతో ఆడుకున్నారని ఆ మహిళ చివరిగా చెప్పడం కొసమెరుపు. తమ దేశ ప్రభుత్వానికి తగిన శాస్తి జరిగిందని ఆమె అనడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం.

నిరసన నినాదాలు..

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంపై 12 గంటల తర్వాత ఒక్క నిమిషం కూడా తాము అనుకున్నది చూడకపోవడంతో పాకిస్తానీయులు ఆశ్చర్యపోయారు. దీని తరువాత, నిరాశ చెందిన ప్రజలు పాకిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు చేయడం ప్రారంభించారు. ఈ ఘటనతో పాకిస్థానీలు తీవ్ర నిరాశకు లోనైనట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఆ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం