Telangana Politics: సీఎం నియోజకవర్గంలో కాంగ్రెస్ మూడు ముక్కలాట.. రాష్ట్ర నేతల ముందే డిష్యుం డిష్యుం..
Gajwel Congress: ఒకప్పుడు ఆ నియోజకవర్గం కాంగ్రెస్స్ పార్టీకి కంచుకోట.. ఇప్పటికి ఇంకా ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది..కానీ నాయకులే సరిగ్గా లేరట.. ఆ పార్టీ అధిష్టానం నుండి సీనియర్ లీడర్లు ఎవరైనా నియోజకవర్గానికి వస్తే వారి ముందే బాహాబాహికి దిగుతున్నారట ఈ నేతల అనుచరులు..దీనితో ఈ నియోజకవర్గం వైపు రావాలంటేనే, ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారట రాష్ట్ర నాయకులు..ఇంతకీ అది ఏ నియోజకవర్గం..రాష్ట్ర నాయకులకు తలనొప్పిగా మారుతున్న ఆ లీడర్లు ఎవరు.?

గజ్వెల్ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్స్ పార్టీకి కంచుకోట.. సీఎం కేసీఆర్ ఎంట్రీతో ఇక్కడ కాంగ్రెస్స్ పార్టీ ఓటమి పాలైంది.. అంతకముందు వరకు ఇక్కడ కాంగ్రెస్స్ పార్టీ హవానే ఉండేది..ఇప్పుడు కూడా ఇక్కడ ఇంకా కాంగ్రెస్స్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది..కానీ లీడర్లు సరిగ్గా లేరట.. గజ్వేల్ కాంగ్రెస్స్ లో మూడు ముక్కలాట సాగుతుందట.. ఉన్న ముగ్గురు నేతలకు అసలు పొసగడం లేదట..మరో వైపు వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారట ముగ్గురు నేతలు.
గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత జిల్లా కాంగ్రెస్స్ అధ్యక్షుడు నర్సారెడ్డికి,ఇదే నియోజకవర్గ నికి చెందిన జశ్వంత్ రెడ్డి (పీసీసీ డెలిగేట్), శ్రీకాంత్ రావు(పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి) మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందట.. జశ్వంత్ రెడ్డి,శ్రీకాంత్ రావు ఇద్దరు ఒక్కటై నర్సారెడ్డి పై గత కొద్దిరోజులుగా కోపంగా ఉన్నారట.. నర్సారెడ్డికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం సరికాదని.. అతను బీఆర్ఎస్ పార్టీ కోవర్ట్ అని, వీరి ఇద్దరు పలుమార్లు కాంగ్రెస్స్ అధిష్టానంకి పిర్యాదు చేశారట. నర్సారెడ్డి కూడా నియోజకవర్గ పరిధిలో ఏ కార్యక్రమం చేసిన కూడా వీరికి సమాచారం ఇవ్వడం లేదట.. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్స్ పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చిన కూడా ఇక్కడ మాత్రం కలిసి మెలిసి కాకుండా ఎవరికి వారు ప్రోగ్రాంలు చేస్తున్నారట..
గజ్వెల్ నియోజకవర్గంలో ఉన్న ఈ ముగ్గురు నేతల పరిస్థితి ఇలా ఉంటే.. వీరి అనుచరులది వేరే లెవల్ అంట.. ఇటీవలి కాలంలో నియోజకవర్గ పరిధిలో ఏ కార్యక్రమం జరిగిన అక్కడ వీరు చేస్తున్న హంగామా అంత ఇంత కాదట.. నియోజకవర్గనికి వచ్చిన రాష్ట్ర నేతల ముందే వీరి అనుచరులు గొడవలకు దిగుతు కొట్లాడుకుంటున్నారట వీరి గొడవలు చూసి రాష్ట్ర నాయకులు ముక్కున వేలు వేసుకొని అక్కడి నుండి జారుకుంటున్నారట..
గత నెల క్రితం కాంగ్రెస్ పార్టీ యువజన పోరాట యాత్ర గజ్వేల్ నుండి ప్రారంభించేందుకు, రాష్ట్ర ఎన్ఎస్ యూఐ అధ్యక్షులు ఆధ్వర్యంలో గజ్వేల్ కి వస్తున్న క్రమంలో ఒంటిమామిడి వద్ద నర్సారెడ్డి- జస్వంత్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది తాజాగా మూడు రోజుల క్రితం నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి హాజర య్యేందుకు ఏఐసీసీ ఇన్చార్జ్ విష్ణు నాథ్ వచ్చే క్రమంలో, ఆయనకు ప్రజ్ఞాపూర్ లో స్వాగతం పలికేందుకు వచ్చిన శ్రీకాంత్-జశ్వంత్ రెడ్డి వర్గీయుల పై నర్సారెడ్డి వర్గీయులు దాడి చేశారట.. వీరిని చూసిన కాంగ్రెస్స్ సీనియర్ లు నియోజకవర్గనికి రావాలంటేనే ఒకటికి మూడు సార్లు ఆలోచిస్తున్నారట.
నర్సారెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికేట్ ఇవ్వొద్దు అని,మండల పార్టీ అధ్యక్ష పదవుల ఎంపిక విషయంలో కూడా తమకు సమాచారం ఇవ్వాలని,తన అనుచరులు ప్రతిసారి,మా అనుచరుల పై దాడులకు పాల్పడుతున్నారని, ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి పై కాంగ్రెస్స్ పార్టీ రాష్ట్ర అధినాయకత్వంకు పిర్యాదు చేశారట జశ్వంత్ రెడ్డి,శ్రీకాంత్ రావులు..నర్సారెడ్డి 2014లో కాంగ్రెస్స్ పార్టీని వీడి,టిఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కాంగ్రెస్స్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాం అని,నియోజకవర్గ పరిధిలో ఉన్న కార్యకర్తలను కాపాడుకున్నాం అని,మేము పడ్డ కష్టం మొత్తం వృధా అయ్యిందని అని, మళ్ళీ తిరిగి నర్సారెడ్డి కాంగ్రెస్స్ లో పార్టీలోకి వచ్చి బీఆర్ఎస్ కి కోవర్ట్ గా మారాడు అని, అందుకే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆయనకు ఇవ్వదు అని పలుమార్లు ఫిర్యాదులు చేస్తున్నారట జశ్వంత్ రెడ్డి, శ్రీకాంత్ రావు..
మరో వైపు నర్సారెడ్డి కూడా ఎం తగ్గడం లేదట..మొదటి నుండి నియోజకవర్గ పరిధిలో పార్టీని,కార్యకర్తలను కాపాడింది తానే అని,ఎవరు ఎన్ని పిర్యాదులు చేసిన తనకు ఒరిగేది ఏమి లేదు అని అంటున్నారట..జశ్వంత్ రెడ్డి, శ్రీకాంత్ రావులు నియోజకవర్గ నికి చుట్టపుచూపుగా వచ్చి వెళ్తారు అని,నేను ఎల్లప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంట అని, అందరూ తనకు మద్దతు ఇవ్వాలని కార్యకర్తలను కోరుతున్నారట నర్సారెడ్డి..
ఏది ఏమైనా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్… ఇలాంటి చోట ప్రతిపక్షాలు ఎంత గట్టిగా ఉండాలి అని,కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలు మాత్రం ఇలా గ్రూప్ రాజకీ యాలు చేస్తూ ఉండడం చూస్తూ ఉంటే ఆ పార్టీకి నష్టం తప్పదు అని..వీరి గొడవలు గాంధీభవన్ దాకా వెళ్లాయి కాబట్టి ఇప్పటికైనా పార్టీ అధిష్టానం పట్టించుకోని ఈ గోడవలను సద్దుమణిగించక పోతే,ఇబ్బందులు తప్పవు అని అంటున్నారు గజ్వెల్ కాంగ్రెస్ ను అబ్జర్వ్ చేస్తున్న రాజకీయ విశ్లేషకులు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం