Hyderabad Outer Ring Road: ORRపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నారా.. ఈ విషయాలు మస్ట్‌గా తెలుసుకోండి..

హైదరాబాద్‌ కు ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) ఓ మణిహారం. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా...సాఫీగా జర్నీ సాగిపోయేందుకు ఇదోక మార్గం. శివారు ప్రాంతాల్లోకి వెళ్లేందుకు ఓఆర్ఆర్ నే ఎక్కువగా ఎంచుకుంటారు. దీనికి ఇప్పటికే చాలా ఇంటర్‌చేంజ్‌లు ఉన్నాయి. అంతేకాదు స్పీడ్ లిమిట్ ఒకేలా కాకుండా వివిధ రకాలుగా ఉంది. అంతేకాదు, అత్యవసర సేవలను, ప్రకృతి పచ్చదనం, దూసుకుపోయేవారికి మాత్రమే కాదు.. ఇక్కడ సైక్లింగ్ కూడా చేయవచ్చు..

Hyderabad Outer Ring Road: ORRపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నారా.. ఈ విషయాలు మస్ట్‌గా తెలుసుకోండి..
Hyderabad Outer Ring Road
Follow us

|

Updated on: Aug 14, 2023 | 6:17 PM

హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై స్పీడ్ లిమిట్ పెంచారు కదా.. ఇంకెంటీ ఇక మరింత వేగంతో రయ్ రయ్ మంటూ దూసుకుపోదామని అనుకుంటే ట్రాఫిక్ నిబంధనలను క్రాస్ చేసినట్లే.. ఇదేంటి రెండు వారాల క్రితం అంతా ఖుషీ ఖుషీగా చెప్పిందేగా.. అనుకుంటున్నారా.. ఇక్కడ మరో విషయం ఉంది. అదేంటో సరిగ్గా చదవండి.. మీకే అర్థమవుతుంది.

హైదరాబాద్‌కు మణిహారంగా నిలిచిన 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)లో వాహనదారులకు కొత్త వేగ పరిమితులను సైబరాబాద్ పోలీసులు నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓఆర్‌ఆర్‌పై వాహనాలు వెళ్లే గరిష్ట వేగాన్ని పెంచిన సంగతి తెలిసిందే.. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. అదేంటేంటే..

వారికి మాత్రమే 120కిలోమీటర్ల వేగం.. 

ఔటర్‌ రింగ్ రోడ్డు అనగానే వందల కిలోమీటర్లను అతి స్వల్ప వ్యవధిలో చేరుకోవచ్చని ఆలోచించే వారు కోకోల్లలు. అందుకే నగరంలోని ట్రాఫిక్‌తో విసిగిపోయిన దూరప్రాంతాలకు వెళ్లే వారు ఈ ఔటర్ రింగ్ రోడ్దు మీదకు ఎక్కి హద్దు మీరిన వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదాల పాలవుతుంటారు.

దీంతో ఓఆర్ఆర్ పై వాహనాల వేగాన్ని ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఓఆర్‌ఆర్‌పై ప్రమాదాలు పెరుగుతున్న దృష్ట్యా సైబరాబాద్ పోలీసులు గతంలో ఓఆర్‌ఆర్‌పై వేగ పరిమితిని గంటకు 120 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లకు తగ్గిస్తూ గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసింది. అదే వేగాన్ని ఇప్పుడు మార్చేసింది. మార్చడంతోపాటు లైన్లవారిగా స్పీడ్ లిమిట్ చేసింది. అన్ని లైన్లలో 12 కిలోమీటర్లు అనేది చెల్లదు. మొదటి లైన్‌లో ఒక వేగం. ఆ తర్వాత మరో వేగం ఉంటుంది.

ఏ లైన్‌లో ఎంత వేగంతో అంటే..

ఓఆర్ఆర్ పై మొత్తం ఎనిమిది లైన్లు ఉన్నాయి. ఇందులో కంట్రోల్ ఫ్రీవే ఉంటుంది. ప్రతి వైపు నాలుగు లైన్లు ఇలా ఉంటాయి. రెండు లేన్లలో కనీస వేగం గంటకు 80 కి.మీ. 3 , 4లో గరిష్ట వేగం గంటకు 80 కిమీ, కనిష్ట వేగం గంటకు 40 కిలోమీటర్లుగా నిర్ణయించారు. కనీస వేగ పరిమితి కంటే తక్కువ ORRలో ప్రయాణించడానికి ఏ వాహనం అనుమతించబడదని కూడా పేర్కొన్నారు.

జిగ్-జాగ్ డ్రైవింగ్‌కు నో ఛాన్స్..

నిబంధనల ప్రకారం వేగంగా వెళ్లే వాహనాలు కుడి లేన్లలో (1,2), నెమ్మదిగా వెళ్లే వాహనాలు ఎడమ లేన్లలో (3,4) వెళ్లాలనే నిర్దేశించిన వేగ పరిమి ఉంది. భారీ వాహనాలు 3 లేదా 4 లేన్‌లో మాత్రమే వెళ్లాలి. వేగాన్ని మార్చే అన్ని వాహనాలు.. వెంటనే సంబంధిత లేన్‌కి మారాలి. ఇది వేగ పరిధిని అనుమతిస్తుంది. అలా కాకుండా లేన్ల మధ్య జిగ్-జాగ్ డ్రైవింగ్‌కు అనుమతించబడదని పోలీసులు అంటున్నారు.

లేన్‌లను మార్చాలనుకునే అన్ని వాహనాలు ఇండికేటర్ లైట్లను ఉపయోగించిన తర్వాత మాత్రమే ఇలా చేయాలి. లేన్‌లను మార్చేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ రోడ్డులో నడిచేందుకు..

ఓఆర్‌ఆర్‌లోని నాలుగు లేన్‌లలో ఏ వాహనమూ ఆగకూడదు. ఓఆర్‌ఆర్‌పై ఎలాంటి ప్రయాణీకుల వాహనాలు ఆపి ప్రయాణికులను ఎక్కించకూడదు. ఓఆర్‌ఆర్‌లో పాదచారులు నడవడానికి అనుమతి లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రయాణించే వాహనాలు అత్యంత వేగంగా కదులుతుంటాయి. ఇక్కడ నడవడం ప్రాణాలతో చలగాటమే.

వీరికి అస్సలు అనుమతి లేదు..

ఓఆర్‌ఆర్‌లో టూ, త్రీ వీలర్‌లు, ఏడు సీట్ల ఆటో రిక్షాలకు కూడా నిషేధం ఉంది. అలాగే, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఎగ్జిట్ రోడ్ల నుంచి ప్రవేశం, ఎంట్రీ రోడ్ల నుంచి నిష్క్రమించడం నిషేధించబడింది.

రోడ్డులో ఏదైనా సమస్య వస్తే..

ఔటర్ రింగ్ రోడ్ (ORR) 158 కి.మీ విస్తీర్ణంలో కారు టైరు ఫ్లాట్ లేదా వాహనంలో ఇంధనం అయిపోతుంది. వాహనం చెడిపోతుంది. తరలించడానికి కుదరదు, సమీపంలోని గ్యారేజీకి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈ యాక్సెస్ నియంత్రిత ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రమాదం జరిగింది.. తక్షణ దృష్టి కోసం అప్రమత్తం చేయాలనుకుంటారు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ORRలో ఏవైనా అత్యవసర పరిస్థితుల కోసం, టోల్-ఫ్రీ నంబర్, 14449కి డయల్ చేయడం ద్వారా త్వరిత సహాయం కోసం సంప్రదించవచ్చు.

ఈ సేవలు అన్నీ ఫ్రీ..

అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ (ALS) అంబులెన్స్‌ల సముదాయం పూర్తిగా ప్రథమ చికిత్స, ప్రాథమిక సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఆపదలో ఉన్న వ్యక్తిని అక్కడికక్కడే చూసుకుంటుంది. వారిని ట్రామా కేర్‌కు మారుస్తుంది. ట్రామా కేర్ సెంటర్‌లు, అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ (ALS) అంబులెన్స్‌లు అందించే ఈ సేవలు ఉచితం.

ఎమర్జెన్సీ సేవలను పొడిగించడంతో పాటు..

ప్రస్తుతం హెచ్‌జీసీఎల్, హెచ్‌టీఎంఎస్ ద్వారా సీసీటీవీ కెమెరాలు, ఎస్‌ఓఎస్‌ బాక్స్‌లు, వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డ్‌ల ద్వారా ఎమర్జెన్సీ సేవలను పొడిగించడంతో పాటు ట్రాఫిక్ సురక్షితమైన.. సమర్థవంతమైన నిర్వహణను అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

జియో-ట్యాగ్ SOS బాక్స్ ..

ORR వినియోగదారులు అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం చేరుకోవడానికి మరొక సదుపాయం ఉంది. అదే జియో-ట్యాగ్ చేయబడిన SOS బాక్స్ స్ట్రెచ్‌. ఇలాంటివి రోడ్డుకు ఇరువైపులా ప్రతి కి.మీ ఒకటి ఏర్పాటు చేయబడి ఉంది. ఇవి ఏర్పాటు చేసిన చోటి నుంచి ఒక బటన్ నొక్కితే మీకు వెంటనే మీరు ఉన్న చోటికి ఎలాంటి సాహాయం అయినా అందుతుంది.

14449 లేదా SOS బాక్స్‌ల ద్వారా HMDA సిబ్బందిని సంప్రదించవచ్చు. అత్యవసర సేవల కోసం ఇంతకుముందు టోల్ ఫ్రీ నంబర్లు అంటే 1066 (కోకాపేట్ నుంచి ఘట్‌కేసర్) స్ట్రెచ్, 105910 (తారామతిపేట నుండి నానక్రమ్‌గూడ) స్ట్రెచ్‌లు నిలిపివేయబడ్డాయి.

సైక్లిస్టుల కోసం స్పెషల్ ట్రాక్‌..

వేగంగా వెళ్లే వాహనాల కోసం విశాలమైన మార్గాలతో పాటు, ఔటర్ రింగ్ రోడ్ (ORR) సైక్లిస్టుల కోసం ప్రత్యేక ట్రాక్‌లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) చుట్టూ సస్టెయినబుల్ సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మాణం పూర్తవుతోంది. సెప్టెంబరు మొదటి వారంలో దీనిని ప్రారంభించే అవకాశం ఉంది. ఈ 23-కిలోమీటర్ల ట్రాక్ మొట్టమొదటిది. పర్యావరణ అనుకూలమైనదిగా రూపొందించబడింది. పార్కింగ్ స్థలాలు, నిఘా కెమెరాలు, సైకిల్ డాకింగ్, అద్దె స్టేషన్, ఫుడ్ కోర్టులు, తాగునీరు, విశ్రాంతి గదులు, ప్రాథమిక సైకిల్ రిపేర్ షాపులతో సహా సైక్లిస్టుల కోసం అనేక సౌకర్యాలతో ట్రాక్ వస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం