Bairi Naresh: ఆధారాలు కావాల్సిందే.. దేవుళ్లపై వివాదాస్పద కామెంట్లపై వెనక్కి తగ్గని బైరి నరేష్
దేవుళ్లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బైరి నరేష్ మరోసారి స్పష్టం చేశాడు. తాను సంధించిన ప్రశ్నలకు సమాధానం కావాలని నినదించాడు.
దేవుళ్లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బైరి నరేష్ మరోసారి స్పష్టం చేశాడు. తాను సంధించిన ప్రశ్నలకు సమాధానం కావాలని నినదించాడు. టీవీ9తో మాట్లాడిన బైరి నరేష్.. సంఘం నాయకుల వైఫల్యాలను ఎత్తిచూపాడు. బెదిరింపులతో మతవాదులు ఏం సాధించేది ఉండబోదని.. సమస్యకు పరిష్కారం కావాలని డిమాండ్ చేశాడు. టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడిన బైరి నరేష్.. సంఘం నాయకులకు ప్రశ్నాస్త్రాలు సంధించాడు. అయ్యప్ప జననానికి సంబంధించి నిజమైన ఆధారం కావాలన్నారు నరేష్. ఏది నిజమో చెబితే తన అభిప్రాయం మార్చుకుంటానన్నారు.
అయ్యప్ప మాలలో ఉండి కొంతమంది చేస్తున్న నిర్వాకాల కారణంగానే తాను అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తుందని వివరణ ఇచ్చాడు బైరి నరేష్. అయ్యప్పపై వ్యాఖ్యలకు హాస్యాన్ని జోడించి చెప్పానే తప్ప.. అందులో ఎలాంటి దురుద్దేశం లేదన్నారు నరేష్.
ఎవర్నీ ఇబ్బంది పెట్టడం తన అభిమతం కాదన్నాడు నరేష్. ఒక అమ్మాయిని రేప్ చేసి గుడిలో చంపేస్తున్న ఘటనలపై ఎందుకు ఎవరూ మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సమాజంలో సమస్యలపై వాళ్లకు ఎందుకు బాధ్యత ఉండదన్నారు.దాడులు చేసినా భయపడబోనన్నారు నరేష్. సత్యం కోసం దేనికైనా సిద్దమంటూ తెలిపాడు.
బైరి నరేష్ ఇంకా ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..