AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బ్యాంక్ లాకర్ ఓపెన్ చేస్తే కళ్లు జిగేల్.. అధికారులే బిత్తరపోయారు.. !

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ మాజీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హేరూర్ నికేశ్ కుమార్‌ ఏసీబీ విచారణ కొనసాగుతోంది. తాజాగా అతని ఫ్రెండ్ బ్యాంక్ లాకర్‌లో భారీగా బంగారాన్ని గుర్తించారు అధికారులు.

Telangana: బ్యాంక్ లాకర్ ఓపెన్ చేస్తే కళ్లు జిగేల్.. అధికారులే బిత్తరపోయారు.. !
Bank Locker
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Dec 06, 2024 | 1:40 PM

Share

తెలంగాణలో ఏసీబీ అధికారులు స్పీడ్ పెంచారు. నెల రోజుల వ్యవధిలోనే ఎంతోమంది ప్రభుత్వ అవినీతి అధికారులను కటకటాలకు నెట్టారు. తాజాగా హైదరాబాద్ రేంజ్ అధికారులు మాజీ ఏఈఈ నికేష్ కుమార్‌ను కొద్ది రోజుల క్రితం అరెస్టు చేశారు. ఆదాయనికి మించిన ఆస్తులు కూడ పెట్టుకున్నారని ఆరోపణలతో నికేష్ కుమార్ ఇంటిపై ఏసీబీ అధికారులు గత నెల 30న దాడి నిర్వహించారు. ఏసీబీ దాడుల్లో దాదాపు 17.5 కోట్లకు పైగా అక్రమస్తులను గుర్తించారు.

అయితే అతనిపై గతంలోనే అవినీతి ఆరోపణలు రావటంతో ఏసీబీ అధికారులు ఒకసారి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి జైలుకు కూడా వెళ్లొచ్చాడు నికేష్ కుమార్. అయితే ఎలాగైనా సరే ఏసీబీ అధికారులు తన మీద దృష్టి సారిస్తారని ముందే గ్రహించిన నికేష్ కుమార్ తనకు చెందిన బంగారం మొత్తాన్ని తన స్నేహితుడు ఇంట్లో దాచాడు. ఏసీబీ అధికారులు సోదాలకు వెళ్లిన సమయంలోనూ ఇంట్లో ఎలాంటి నగదు కానీ బంగారం కానీ లభించలేదు. దీంతో అవాక్కైన ఏసీబీ అధికారులు నికేష్ కుమార్ సెల్‌ఫోన్ కాంటాక్ట్స్ పరిశీలించారు. అందులో పదేపదే ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు గుర్తించారు. ఆ స్నేహితుడు బ్యాంకు లాకర్‌ను కనుగొన్న ఏసీబీ అధికారులు ఓపెన్ చేశారు.

నికేష్ కుమార్ లాకర్ తెరిచిన ఏసీబీ అధికారులకు కళ్ళు చెదిరే వాస్తవాలను బయటపడ్డాయి. దాదాపు రెండు కేజీలకు పైగా బంగారు ఆభరణాలు అందులో లభ్యమయ్యాయి. నికేష్ కుమార్ స్నేహితుడిని ఈ బంగారం గురించి ప్రశ్నించగా తనకు ఏమీ తెలియదు అనే సమాధానం ఇచ్చాడు. దీంతో మరోసారి నికేష్ కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. ఏసీబీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు జరిపిన తరుణంలో 8 బ్యాంకు లాకర్లను గుర్తించారు. వీటిలో రెండు మాత్రం నికేష్‌కు చెందిన లాకర్లుగా గుర్తించారు. మిగిలిన ఆరు లాకర్లలో తన స్నేహితులు బంధువుల పేర్ల మీద ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ కోర్టు కష్టడికి అనుమతించిన తర్వాత నికేష్ లాకర్లను సైతం అధికారులు తెరవమన్నారు.

Nikesh Kumar

Nikesh Kumar

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు..
వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు..
పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా
పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా
తెలంగాణలో మరో ఎన్నికలు.. త్వరలోనే షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికలు.. త్వరలోనే షెడ్యూల్..!
శ్రీలంక అమ్మాయిలకు వైజాగ్‎లో చుక్కలు చూపించడం పక్కా భయ్యా
శ్రీలంక అమ్మాయిలకు వైజాగ్‎లో చుక్కలు చూపించడం పక్కా భయ్యా
సిబిల్ స్కోర్ తక్కువుందా.. 500 నుంచి 750కి పెరగాలంటే ఇలా చేస్తే.
సిబిల్ స్కోర్ తక్కువుందా.. 500 నుంచి 750కి పెరగాలంటే ఇలా చేస్తే.