Telangana TMC: అసంతృప్తులకు తృణమూల్ గాలం.. తెలంగాణలో మరో రాజకీయ పార్టీకి ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయా..?
తెలంగాణలో మరో రాజకీయ పార్టీకి ఏర్పాట్లు జరుగుతున్నాయా.. ? తెలంగాణంలో పొలిటికల్ గ్యాప్ పుల్ ఫిల్ చేసేందుకు కొత్త వేదికలు సిద్ధమవుతున్నాయా..?
Telangana TMC: తెలంగాణలో మరో రాజకీయ పార్టీకి ఏర్పాట్లు జరుగుతున్నాయా.. ? తెలంగాణంలో పొలిటికల్ గ్యాప్ పుల్ ఫిల్ చేసేందుకు కొత్త వేదికలు సిద్ధమవుతున్నాయా..? అందులో భాగంగానే కాంగ్రెస్ అసంతృప్త నేతలకు గాలాలు వేస్తున్నారా.? కొత్త వేదికపైకి ఆసక్తి చూపుతున్న నేతలెవరన్న లోతుల్లోకి వెళ్తే.. పశ్చిమబెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌ను తెలంగాణలో విస్తరింప చేయడానికి దీదీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. 2021 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో గెలిచిన తర్వాత సీఎం బాధ్యతలు చేపట్టిన మమత స్పీడ్ పెంచారు. మణిపూర్, గోవా, మేఘాలయ, అస్సాం రాష్ట్రాల్లో ఇప్పటికే తృణమూల్ శాఖలను ప్రారంభించారు ముఖ్యమంత్రి మమత. కాంగ్రెస్ పార్టీలో అలకబూనిన నేతలే టార్గెట్‌గా దీదీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టినట్లు ప్రచారం సాగుతోంది.
తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ప్రతినిధుల బృందం హైదరాబాద్‌లో ఇటీవల పర్యటించింది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు కొందరు నేతలతో టీఎంసీ నేతలు చర్చించినట్లు సమాచారం. మాస్ ఫాలోయింగ్‌తో పాటు ఆర్థిక వనరులు బలంగా ఉన్న నేతలను తమ పార్టీలోకి తీసుకువచ్చి.. బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని టీఎంసీ నేతల ఆలోచనగా చెబుతున్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లోకి వెళ్లలేక ఇబ్బంది పడుతున్న నేతలే టార్గెట్‌గా టీఎంసీ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. కొండా వంటి నేతలతో పాటు తెలంగాణలో ఉద్యమకారులు, ప్రజాసంఘాల నేతల టార్గెట్ గా తృణమూల్ కాంగ్రెస్ బృందం పనిచేస్తోంది. తృణమూల్ ఎంపీలు ఫ్రెండ్‌షిప్‌లో భాగంగా పలువురు మాజీ, తాజా ఎంపీలను కలవడం తెలంగాణ రాజకీయాల్లో కలవరం రేపుతోంది.
కాంగ్రెస్ కొత్త కార్యవర్గం వచ్చాక చాలా మంది సీనియర్ నాయకులు పార్టీ కార్యకలాపాలకు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వాళ్ళని మెయిన్ టార్గెట్ పెట్టుకొని TMC తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది హుజురాబాద్ ఎన్నిక తరువాత ఇంకా ముమ్మరంగా పని చేయాలని భావిస్తోందట. అటు, ఆమ్ ఆద్మీలాంటి పార్టీలు తెలంగాణలో విస్తరించేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. మరీ బెంగాల్ సీఎం దీదీ.. కొండా వంటి నేతల ద్వారా చేస్తున్న ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.
Read also: Ex CM Nallari Kiran Kumar Reddy: నల్లారి సెకండ్ ఇన్నింగ్స్‌కి రంగం సిద్ధం.. పూర్తి వివరాలు