బ్రేకింగ్.. మహేష్‌ బాబు ఇంటి ముందు స్టూడెంట్స్‌ ధర్నా..

ఏపీ రాజధాని అంశం.. రాజకీయ క్షేత్రం నుంచి సినిమా రంగానికి తాకింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. ఏపీ విద్యార్ధి యువజన పోరాట సమితి.. హీరో మహేష్ బాబు ఇంటి ముందు నిరసనలకు దిగారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై ఏపీకి చెందిన సినిమా హీరోలు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 19వ తేదీ వరకు ఏపీకి చెందిన హీరోల ఇంటి ఎదుట ఆందోళనలు చేస్తామంటూ హెచ్చరించారు. ఇవాళ మహేష్ బాబు ఇంటి ముందు […]

బ్రేకింగ్.. మహేష్‌ బాబు ఇంటి ముందు స్టూడెంట్స్‌ ధర్నా..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 10, 2020 | 1:58 PM

ఏపీ రాజధాని అంశం.. రాజకీయ క్షేత్రం నుంచి సినిమా రంగానికి తాకింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. ఏపీ విద్యార్ధి యువజన పోరాట సమితి.. హీరో మహేష్ బాబు ఇంటి ముందు నిరసనలకు దిగారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై ఏపీకి చెందిన సినిమా హీరోలు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 19వ తేదీ వరకు ఏపీకి చెందిన హీరోల ఇంటి ఎదుట ఆందోళనలు చేస్తామంటూ హెచ్చరించారు. ఇవాళ మహేష్ బాబు ఇంటి ముందు చేస్తున్నామని.. శనివారం అల్లు అర్జున్ ఇంటిముందు, జనవరి 12వ తేదీన మెగాస్టార్ చిరంజీవి, 13న బాలకృష్ణ, 14న జూనియర్ ఎన్టీఆర్, 15వ తేదీన మోహన్ బాబు, 16న మా అధ్యక్షుడు నరేష్ ,17న ప్రభాస్, 18న నాగార్జున, 19న వెంకటేష్ ఇళ్ల ముందు నిరాహార దీక్షలు చేస్తామని ప్రకటించారు.

డిమాండ్లు..

* వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్రాభివృద్ధి మండలం ఏర్పాటు చేయాలి

* కర్నూలులో హైకోర్టు.. అమరావతి, వైజాగ్‌లో హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేయాలి.

* ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలి. (కేంద్ర ప్రభుత్వం)

* ఏపీ పునర్విభజన చట్టంలోని విభజన హామీలను అమలు చేయాలి

ఈ పై డిమాండ్లతో జై ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన పోరాట సమితి నిరసనల కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమైంది.