బ్రేకింగ్: అసదుద్దీన్‌కు హైకోర్టు షాక్
సీఏఏకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించాలని తలపెట్టిన ఎంఐఎం పార్టీకి హైదరాబాద్ హైకోర్టు షాకిచ్చింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీలో సంఘ విద్రోహ శక్తులు చొరబడి అల్లర్లకు పాల్పడే ప్రమాదం వుందంటూ.. మొత్తం ర్యాలీని వీడియో తీయాలని హైకోర్టు సిటీ పోలీసులను ఆదేశించింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కేసులు పెట్టమని హైకోర్టు నిర్దేశించింది. సిఏఏని వ్యతిరేకిస్తూ ఎంఐఎం తలపెట్టిన ర్యాలీని అనుమతిచ వద్దంటూ హైదరాబాద్ బహదూర్‌పురాకు చెందిన నందరాజ్ […]
సీఏఏకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించాలని తలపెట్టిన ఎంఐఎం పార్టీకి హైదరాబాద్ హైకోర్టు షాకిచ్చింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీలో సంఘ విద్రోహ శక్తులు చొరబడి అల్లర్లకు పాల్పడే ప్రమాదం వుందంటూ.. మొత్తం ర్యాలీని వీడియో తీయాలని హైకోర్టు సిటీ పోలీసులను ఆదేశించింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కేసులు పెట్టమని హైకోర్టు నిర్దేశించింది.
సిఏఏని వ్యతిరేకిస్తూ ఎంఐఎం తలపెట్టిన ర్యాలీని అనుమతిచ వద్దంటూ హైదరాబాద్ బహదూర్‌పురాకు చెందిన నందరాజ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నందరాజ్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు సిటీ పోలీసుల అఫిడవిట్ కోరింది. ఎంఐఎం తలపెట్టిన ర్యాలీకి మిరాలం నుంచి శాంతిపురం వరకు మాత్రమే అనుమతి ఇచ్చామని పోలీసులు కోర్టుకు తెలిపారు. దాంతో పోలీసులు అనుమతి ఇచ్చిన పరిధి వరకే ర్యాలీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.
నగరంలో ఎక్కడ కూడా వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని తెలంగాణ డీజీపీని నిర్దేశించింది హైకోర్టు. ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే వారిపై తక్షణం కేసు నమోదు చేయాలని డీజీపీకి హైకోర్టు అదేశాలిచ్చింది. మొత్తం ర్యాలీని వీడియో తీయాలని డైరెక్ట్ చేసింది కోర్టు.