బ్రేకింగ్: కశ్మీర్‌లో ఆంక్షలు ఎత్తివేయాలన్న సుప్రీం

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆగస్టు 5వ తేదీన ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పట్నించి కశ్మీర్‌లో కొనసాగుతున్న ఆంక్షలను ఎత్తివేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. జస్టిస్ ఎన్వీ రమణ, సుభాష్ రెడ్డి, గవాయ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కశ్మీర్‌లో ఇంటర్‌నెట్‌పై ఆంక్షలు విధించడం రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. జమ్మూకాశ్మీర్లో ఇంటర్‌నెట్‌ ఆంక్షలపై శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఇంటర్‌నెట్‌ సేవలపై జమ్మూకాశ్మీర్లో ఆంక్షలు ఎలా విధిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వెంటనే కాశ్మీర్లో ఇంటర్‌నెట్‌ వినియోగంపై కొనసాగుతున్న ఆంక్షలు […]

బ్రేకింగ్:  కశ్మీర్‌లో ఆంక్షలు ఎత్తివేయాలన్న సుప్రీం
Follow us
Rajesh Sharma

|

Updated on: Jan 10, 2020 | 2:38 PM

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆగస్టు 5వ తేదీన ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పట్నించి కశ్మీర్‌లో కొనసాగుతున్న ఆంక్షలను ఎత్తివేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. జస్టిస్ ఎన్వీ రమణ, సుభాష్ రెడ్డి, గవాయ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కశ్మీర్‌లో ఇంటర్‌నెట్‌పై ఆంక్షలు విధించడం రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది.

జమ్మూకాశ్మీర్లో ఇంటర్‌నెట్‌ ఆంక్షలపై శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఇంటర్‌నెట్‌ సేవలపై జమ్మూకాశ్మీర్లో ఆంక్షలు ఎలా విధిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వెంటనే కాశ్మీర్లో ఇంటర్‌నెట్‌ వినియోగంపై కొనసాగుతున్న ఆంక్షలు ఎత్తివేయాలని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది.

ఎమర్జెన్సీ ఉందంటూ ప్రజల హక్కులకు భంగం కలిగిస్తే ఎలా అని కేంద్ర ప్రభుత్వాన్ని న్యాయమూర్తుల బృందం నిలదీసింది. జమ్మూకాశ్మీర్‌లో నిరవధికంగా ఇంటర్‌నెట్ నిలిపి వేయడం సరి కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆర్టికల్ 19లో ఇంటర్‌నెట్ ఒక భాగం అని సుప్రీంకోర్టు బెంచ్ తేల్చి చెప్పింది. వారం రోజులలో ఆంక్షలపై సమీక్ష నిర్వహించాలని కేంద్ర హోంశాఖను జడ్జీల బృందం ఆదేశించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పుతో 158 రోజుల తర్వాత కశ్మీర్ వ్యాప్తంగా ఇంటర్‌నెట్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.