అమరావతి ఏరియా ప్రజలకు న్యాయం చేస్తాం..
మూడు రాజధానుల ప్రతిపాదనపై సమాలోచనలు జరుపుతున్న ఏపీ హై పవర్ కమిటీ అమరావతి ఏరియా రైతులకు తగిన న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. శుక్రవారం రెండో దఫా జరిగిన హైపవర్ కమిటీ సమావేశంలో పలు కీలకాంశాలపై చర్చ జరిగినట్లు కమిటీ సభ్యుడు, ఏపీ రవాణా శాఖా మంత్రి పేర్ని నాని చెప్పారు. కమిటీ జనవరి 13న మరోసారి సమావేశం అవుతుందని ఆయన వెల్లడించారు. […]
మూడు రాజధానుల ప్రతిపాదనపై సమాలోచనలు జరుపుతున్న ఏపీ హై పవర్ కమిటీ అమరావతి ఏరియా రైతులకు తగిన న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. శుక్రవారం రెండో దఫా జరిగిన హైపవర్ కమిటీ సమావేశంలో పలు కీలకాంశాలపై చర్చ జరిగినట్లు కమిటీ సభ్యుడు, ఏపీ రవాణా శాఖా మంత్రి పేర్ని నాని చెప్పారు. కమిటీ జనవరి 13న మరోసారి సమావేశం అవుతుందని ఆయన వెల్లడించారు.
శుక్రవారం జరిగిన హైపవర్ కమిటీ సమావేశంలో బీసీజీ, జీఎన్ రావు కమిటీల నివేదికతోపాటు గతంలో శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా పరిశీలించారు. పాలన వికేంద్రీకరణ, రాజధాని రైతుల ప్రయోజనాలపైనే తాజా సమావేశంలో ఎక్కువగా ఫోకస్ చేశామని భేటీ వివరాలను వెల్లడించిన మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు. రాజధానిని తరలింపుతో ఎక్కువ ప్రభావం పడే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధిపై పలు ప్రతిపాదనలు వచ్చాయని, వాటిపై సమావేశంలో లోతుగా చర్చించామని నాని అన్నారు.
13 జిల్లాలు సమాంతరంగా, సమానంగా అభివృద్ధి జరగాలన్నదే తమ ఉద్దేశమని, ఆ దిశగా వచ్చే అన్ని ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని మంత్రి చెప్పారు. జనవరి 13న మరోసారి జరగనున్న సమావేశంలో రైతులు, ఉద్యోగులతోపాటు భాగస్వామ్య పక్షాల అభిప్రాయం తీసుకుంటామని ఆయన చెప్పారు.