AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెక్ట్స్ ప్రాజెక్ట్‌ ఎవరితోనో చెప్పేసిన మహేష్..!

ప్రేక్షకులను అలరించేందుకు సూపర్‌స్టార్ మహేష్ బాబు సిద్ధమయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన సరిలేరు నీకెవ్వరు ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవాళ రాత్రికే ఈ మూవీ ప్రీమియర్ షోలు పడనున్నాయి. దీంతో ఫ్యాన్స్ అంతా సిద్ధమైపోయారు. ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్న వారు.. ఎప్పుడెప్పుడు చూద్దామా..! అంటూ గంటలను లెక్కపెడుతున్నారు. ఇదిలా ఉంటే సినిమా ప్రమోషన్లలో భాగంగా తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించారు మహేష్ బాబు. సరిలేరు నీకెవ్వరు తరువాత రెండు […]

నెక్ట్స్ ప్రాజెక్ట్‌ ఎవరితోనో చెప్పేసిన మహేష్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 10, 2020 | 2:39 PM

Share

ప్రేక్షకులను అలరించేందుకు సూపర్‌స్టార్ మహేష్ బాబు సిద్ధమయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన సరిలేరు నీకెవ్వరు ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవాళ రాత్రికే ఈ మూవీ ప్రీమియర్ షోలు పడనున్నాయి. దీంతో ఫ్యాన్స్ అంతా సిద్ధమైపోయారు. ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్న వారు.. ఎప్పుడెప్పుడు చూద్దామా..! అంటూ గంటలను లెక్కపెడుతున్నారు. ఇదిలా ఉంటే సినిమా ప్రమోషన్లలో భాగంగా తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించారు మహేష్ బాబు.

సరిలేరు నీకెవ్వరు తరువాత రెండు నెలలు గ్యాప్ తీసుకోబోతున్నానని ఆయన అన్నారు. ఇక ఆ తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించబోతున్నట్లు వెల్లడించారు. ఈ సమ్మర్‌లో ఆ ప్రాజెక్ట్ ప్రారంభం కానుందని మహేష్ తెలిపారు. అంతేకాదు ఇది పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్నట్లు పేర్కొన్నారు. కాగా వీరిద్దరి కాంబినేషన్‌లో గతేడాది వచ్చిన మహర్షి మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇక కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కూడా కొన్ని కథలను వినిపించారని మహేష్ చెప్పుకొచ్చారు. అయితే ఆయనతో ఇంకా ప్రాజెక్ట్ ఫైనల్ అవ్వలేదని అన్నారు. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమాలో నటించేందుకు కూడా తాను ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. అయితే సరిలేరు నీకెవ్వరు మహేష్ బాబు 26వ చిత్రంగా తెరకెక్కింది. ఈ మూవీతో హిట్ కొట్టి రెండో హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారు మహేష్. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతోందో కొన్ని గంటల్లో తేలనుంది.

మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస
మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస
'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?