AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : ఐపీఎల్ 2026లో హాఫ్ సెంచరీల వీరులు వీరే.. క్లాసెన్ రికార్డును సమం చేసిన శ్రేయస్ అయ్యర్

IPL 2026 : ఐపీఎల్ 2026లో అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో శ్రేయస్ అయ్యర్ రెండో స్థానానికి దూసుకెళ్లాడు. క్లాసెన్, అయ్యర్, గిల్ మధ్య ఆరెంజ్ క్యాప్ రేసు రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ లిస్టులో హెన్రిక్ క్లాసెన్ ఐదు హాఫ్ సెంచరీలతో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.

IPL 2026 : ఐపీఎల్ 2026లో హాఫ్ సెంచరీల వీరులు వీరే.. క్లాసెన్ రికార్డును సమం చేసిన శ్రేయస్ అయ్యర్
Shreyas Iyer
Rakesh
|

Updated on: May 12, 2026 | 7:50 AM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. మైదానంలో బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపిస్తుంటే, రికార్డులు తిరగరాయబడుతున్నాయి. తాజాగా ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన 55వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మెరుపు హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో ఈ సీజన్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో అయ్యర్ అగ్రస్థానానికి చేరువయ్యాడు. ప్రస్తుతం ఈ లిస్టులో హెన్రిక్ క్లాసెన్ ఐదు హాఫ్ సెంచరీలతో నంబర్ వన్ స్థానంలో ఉండగా, అయ్యర్ కూడా అదే సంఖ్యలో హాఫ్ సెంచరీలు బాది క్లాసెన్‌తో సమానంగా నిలిచాడు.

అగ్రస్థానంలో క్లాసెన్

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్ ఈ సీజన్‌లో భీభత్సం సృష్టిస్తున్నాడు. ఇప్పటివరకు 11 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన క్లాసెన్, ఏకంగా 5 అర్ధసెంచరీలు బాదాడు. మొత్తం 494 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను కూడా తన వద్దే ఉంచుకున్నాడు. క్లాసెన్ కేవలం పరుగులు చేయడమే కాకుండా, తన దూకుడైన ఆటతీరుతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.

క్లాసెన్ సరసన శ్రేయస్ అయ్యర్

ఢిల్లీపై చేసిన 56 పరుగుల ఇన్నింగ్స్‌తో శ్రేయస్ అయ్యర్ కూడా 5వ హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ అయిన అయ్యర్ 10 ఇన్నింగ్స్‌ల్లో 392 పరుగులు సాధించాడు. క్లాసెన్ కంటే తక్కువ పరుగులు ఉన్నందున ప్రస్తుతానికి జాబితాలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ, క్లాసెన్ రికార్డును సమం చేయడం విశేషం. మిడిల్ ఓవర్లలో జట్టును ఆదుకోవడంలో అయ్యర్ తనదైన ముద్ర వేస్తున్నాడు.

టాప్-5లో శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. గిల్ 10 మ్యాచ్‌ల్లో 462 పరుగులు చేసి 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. గిల్ తర్వాత అదే జట్టుకు చెందిన యువ బ్యాటర్ సాయి సుదర్శన్ 11 ఇన్నింగ్స్‌ల్లో 440 పరుగులతో 4 హాఫ్ సెంచరీలు బాది నాలుగో స్థానంలో నిలిచాడు. స్థిరమైన ప్రదర్శనతో సుదర్శన్ టీమ్ ఇండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

ఐదో స్థానంలో ఇషాన్ కిషన్

సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న ఇషాన్ కిషన్ ఈ లిస్టులో ఐదో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు 11 ఇన్నింగ్స్‌ల్లో 409 పరుగులు చేసిన ఇషాన్, 4 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. క్లాసెన్‌తో కలిసి ఇషాన్ అందిస్తున్న మెరుపు ఆరంభాలు హైదరాబాద్ జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారాయి. ఐపీఎల్ 2026 సీజన్ ప్లేఆఫ్ దశకు చేరుకుంటున్న తరుణంలో ఈ బ్యాటర్ల మధ్య పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us