దీపికా పదుకునేకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్..!

యాసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఛపాక్‌. ఈ సినిమా దేశవ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. అయితే ఈ చిత్రం రిలీజ్‌ కంటే ముందే వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. అందుకు కారణం.. జేఎన్‌యూ ఘటన అని చెప్పుకోవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్ధులపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడిలో గాయపడ్డ విద్యార్థులను దీపికా పరామర్శించడం ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. […]

దీపికా పదుకునేకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 10, 2020 | 1:56 PM

యాసిడ్ బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఛపాక్‌. ఈ సినిమా దేశవ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. అయితే ఈ చిత్రం రిలీజ్‌ కంటే ముందే వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. అందుకు కారణం.. జేఎన్‌యూ ఘటన అని చెప్పుకోవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్ధులపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడిలో గాయపడ్డ విద్యార్థులను దీపికా పరామర్శించడం ఈ వివాదానికి ప్రధాన కారణమైంది.

దీపికా జేఎన్‌యూ ఎంటర్‌ అయిన క్షణం నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ స్టార్ట్ అయ్యింది. ఛపాక్‌ను బాయ్‌కాట్‌ చేయాలంటూ పోస్ట్‌లు దర్శనమిచ్చాయి. అయితే సినిమా ప్రచారం కోసమే దీపికా ఇలా చేసిందంటూ సోషల్ మీడియా దుమ్మెత్తిపోసింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం దేశ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే ఈ ఛపాక్ చిత్రానికి కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు అండగా నిలిచాయి. ఈ సినిమాకు రాష్ట్రంలో టాక్స్ ఫ్రీ చేశాయి. మొదట మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం.. పన్ను మినహాయింపు ప్రకటించగా.. వెంటనే ఛత్తీస్‌గఢ్‌ కూడా అదేబాటలో నడిచింది. దీంతో దీపికా అభిమానులు రెండు రాష్ట్రాల సీఎంలకు అభినందనలు తెలుపుతున్నారు.