AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

43 ఏళ్ల వయసులోనూ డబుల్ ఎనర్జీ.. చెన్నై చిన్నది త్రిష ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే

ఒకప్పుడు కేవలం ఉదయం పూట నడక సరిపోతుందని భావించిన ఆ అందాల తార.. ఇప్పుడు జిమ్‌లో బరువులు ఎత్తుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 43 ఏళ్ల వయసులోనూ తన ఫిట్‌నెస్‌ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తూ, తన గ్లామర్ వెనుక ఉన్న అసలు రహస్యం కేవలం నడక మాత్రమే కాదని నిరూపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ హీరోయిన్ వర్కవుట్ విశేషాలు చూద్దాం.

43 ఏళ్ల వయసులోనూ డబుల్ ఎనర్జీ.. చెన్నై చిన్నది త్రిష ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే
Trisha Krishnann
Nikhil
|

Updated on: May 12, 2026 | 6:00 AM

Share

సౌత్ ఇండియన్ క్వీన్ త్రిష కృష్ణన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ వీడియోలో ఆమె చేస్తున్న కఠినమైన వ్యాయామాలు చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. కేవలం అందం కోసమే కాకుండా, శరీర దృఢత్వం సమతుల్యత కోసం ఆమె చేస్తున్న పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

త్రిష వర్కవుట్ రొటీన్

త్రిష తన ఫిట్‌నెస్ కోసం ఎంచుకున్న వ్యాయామాలు శరీరంలోని ప్రతి కండరాన్ని ప్రభావితం చేస్తాయి. ఆమె ప్లానింగ్‌లో ఉన్న ప్రధాన అంశాలు ఇవే..

  • కెటిల్‌బెల్ స్క్వాట్ టు ఓవర్ హెడ్ ప్రెస్: లోతైన స్క్వాట్ నుండి మొదలుపెట్టి బరువును పైకి ఎత్తడం ద్వారా ఆమె తన కాళ్లు మరియు భుజాలను దృఢంగా మార్చుకుంటోంది.
  • బల్గేరియన్ స్ప్లిట్ స్క్వాట్స్: జుట్టు పక్కన పెట్టి ఏకాగ్రతతో చేసే ఈ వ్యాయామం ద్వారా శరీర సమతుల్యతను, కాళ్ల కండరాలను ఆమె మెరుగుపరుచుకుంటోంది.
  • బోసు బాల్ పై శిక్షణ: గాలి నింపిన బంతిపై నిలబడి బరువులు ఎత్తడం సామాన్యమైన విషయం కాదు. దీనివల్ల ఆమెలో ఏకాగ్రత మరియు శరీర స్థిరత్వం అద్భుతంగా పెరుగుతున్నాయి.

హెవీ లిఫ్టింగ్, బాక్సింగ్

త్రిషకు బరువులు ఎత్తడం అంటే భయం లేదు. లోయర్ బ్యాక్ దెబ్బతినకుండా ఉండేలా ఆమె హెక్స్ బార్ డెడ్ లిఫ్ట్స్ చేస్తోంది. వర్కవుట్ చివరలో మరింత ఎనర్జీ కోసం బాక్సింగ్ సెషన్ నిర్వహిస్తోంది. ఇది గుండె ఆరోగ్యానికి రిఫ్లెక్స్‌లను చురుగ్గా ఉంచడానికి ఎంతో తోడ్పడుతుంది. “ఒకప్పుడు నడక ఒక్కటే సరిపోతుందని అనుకున్నాను.. కానీ ఇప్పుడు వారాంతం కోసం ఇలా పవర్ అప్ అవుతున్నాను” అంటూ త్రిష తన వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. సౌకర్యవంతమైన జోన్ నుండి బయటకు వచ్చి కష్టపడితేనే ఫలితం ఉంటుందని ఆమె నిరూపించింది. సినిమా తెరపై చీరకట్టులో మెరిసినా, జిమ్‌లో చెమట చిందిస్తున్నా.. త్రిషకు 43 ఏళ్లు అంటే అది కేవలం ఒక సంఖ్య మాత్రమే!

Follow Us
పెదవులు కదిలిస్తే చాలు.. టెక్స్ట్ టైప్ అయిపోతుంది! AI గ్లాసెస్
పెదవులు కదిలిస్తే చాలు.. టెక్స్ట్ టైప్ అయిపోతుంది! AI గ్లాసెస్
పండ్లు, లీటర్ పాలు తాగినా రాని శక్తి వీటితో ఐదు రెట్లు ఎక్కువ..
పండ్లు, లీటర్ పాలు తాగినా రాని శక్తి వీటితో ఐదు రెట్లు ఎక్కువ..
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
EMIలో కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే
EMIలో కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే
ఈ నటుడు ఒకప్పుడు అద్దంకి సెంటర్‌లో సిగరెట్స్, కిల్లీలు అమ్మాడు..
ఈ నటుడు ఒకప్పుడు అద్దంకి సెంటర్‌లో సిగరెట్స్, కిల్లీలు అమ్మాడు..
ఇషాన్, శ్రేయాస్‌ల హాఫ్ సెంచరీలు.. కివీస్ టార్గెట్ 192
ఇషాన్, శ్రేయాస్‌ల హాఫ్ సెంచరీలు.. కివీస్ టార్గెట్ 192
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న భావోద్వేగాల ఫ్యామిలీ డ్రామా!
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న భావోద్వేగాల ఫ్యామిలీ డ్రామా!
ఫైనాన్స్ ట్రాక్టర్లే వారి టార్గెట్‌గా.. లీజు పేరుతో రైతులకు టోకరా
ఫైనాన్స్ ట్రాక్టర్లే వారి టార్గెట్‌గా.. లీజు పేరుతో రైతులకు టోకరా
రాత్రికిరాత్రే పొలంలోని 10 క్వింటాళ్ళ పత్తిని తెంపుకెళ్లిన దొంగలు
రాత్రికిరాత్రే పొలంలోని 10 క్వింటాళ్ళ పత్తిని తెంపుకెళ్లిన దొంగలు
అతడొక టెర్రిఫిక్ యాక్టర్.. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ ..
అతడొక టెర్రిఫిక్ యాక్టర్.. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ ..