Egg Masala: కండరాల పుష్టికి సూపర్ ఫుడ్.. హెల్తీ అండ్ టేస్టీ గ్రీన్ ఎగ్ మసాలా.. ఇలా చేసి తింటే
ప్రతిరోజూ తినే రెగ్యులర్ ఎగ్ కర్రీలు తిని బోర్ కొట్టిందా.. ఎగ్ కర్రీని కొత్తగా ట్రై చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే.. ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఈ సారి గ్రీన్ ఎగ్ మసాలా వండుకునేందుకు ట్రై చేయండి. ఇది కేవలం రుచి మాత్రమే కాదు కంప్లీట్ ప్రోటీన్'కు కూడా ఉత్తమ మూలం. ఇవి కండరాల నిర్మాణానికి, కణాల మరమ్మత్తుకు సహాయపడతాయి. కాబట్టి ఇంట్లోనే ఈజీగా గ్రీన్ ఎగ్ మసాలా ఎలా తాయరు చేసుకోవాలో చూద్దాం.

మారుతున్న లైఫ్‌స్టైల్ ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇందుకు ప్రధాన కరాణం పోషకమైన ఆహారం తీసుకోకపోవడం. అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తినడం. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, శరీరానికి శక్తి కావాలన్నా, పోషకమైన మంచి ప్రోటిన్ కలిగిన ఆహారం తీసుకోవండం చాలా ముఖ్యం. అలాంటి వాటిలో ఎగ్ కర్రీ కూడా ఒకటి. కోడిగుడ్లు కంప్లీట్ ప్రోటీన్ కు ఉత్తమ మూలం. ఇవి కండరాల నిర్మాణానికి, కణాల మరమ్మత్తుకు కూడా ఎంతగానో సహాయపడతాయి. అయితే ఎగ్ కర్రీని చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటారు. మీకు రెగ్యులర్ ఎగ్ కర్రీ బోర్ కొడితే ఈ సారి గ్రీన్ ఎగ్ మసాలా రెసీని ట్రై చేయండి. ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి గ్రీన్ ఎగ్ మసాలా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం.
గ్రీన్ ఎగ్ మసాలా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు
- ఉడికించిన కోడిగుడ్లు – 4
- అల్లం – చిన్న ముక్క
- వెల్లుల్లి రెబ్బలు – 6 నుండి 8
- జీడిపప్పు (గోడంబి) – 10
- పచ్చిమిర్చి – 4
- పెరుగు – 5 చెంచాలు
- పుదీనా – కొద్దిగా
- కొత్తిమీర – కొద్దిగా
- నూనె – తగినంత
- జీలకర్ర – అర చెంచా
- కరివేపాకు – కొద్దిగా
- ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
- ధనియాల పొడి – 1 చెంచా
- పసుపు – చిటికెడు
- గరం మసాలా – అర టీస్పూన్
- మిరియాల పొడి – అర టీస్పూన్
- ఉప్పు – రుచికి తగినంత
గ్రీన్ ఎగ్ మసాలా ఎలా తయారు చేయాలి
ముందుగా మిక్సీ జార్‌లో అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, పచ్చిమిర్చి, పెరుగు, పుదీనా, కొత్తిమీర వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చటి మసాలా పేస్ట్‌ను ఉల్లిపాయ మిశ్రమంలో కలపాలి. పది నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించి, ఆపై అందులో ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి.
మసాలా దగ్గర పడ్డాక, ఉడికించిన కోడిగుడ్లను అందులో వేసి మసాలా అంతా గుడ్లకు పట్టేలా కలపాలి. మంట తగ్గించి మరో 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించాలి. మసాలాలోని నీరు పోయి నూనె పైకి తేలుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆపేయాలి.అంతే ఎంతో రుచికరమైన, స్పైసీ గ్రీన్ ఎగ్ మసాలా రెడీ అయినట్టే. దీనిని వేడివేడిగా సర్వ్ చేసుకుని చపాతీ లేదా రైస్‌లోకి తింటే టేస్ట్ అదిరిపోతుంది అంతే.
గ్రీన్ ఎగ్ మసాలా ప్రయోజనాలు
ఈ కర్రి టేస్ట్‌కు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇందులో వాడే కోడిగుడ్లు ‘కంప్లీట్ ప్రోటీన్’కు ఉత్తమ మూలం. ఇవి కండరాల నిర్మాణం, కణాల మరమ్మత్తుకు సహాయపడతాయి. అలాగే ఇందులో ఉండే కోలిన్ అనే పోషకం మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే కర్రీలో పుదీనా, కొత్తిమీర వాడడం వల్ల ర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొత్తిమీరలో విటమిన్-C, విటమిన్-K పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఎముకల బలానికి తోడ్పడతాయి. ఈ ఆకులు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి సహాయపడతాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
