అమరావతి : టీడీపీ నేతల హౌజ్ అరెస్ట్..పరిస్థితి ఉద్రిక్తం..
రాజధాని రైతుల ఉద్యమం ఉద్ధృతం అవుతోంది. నేడు మహిళలు భారీ పాదయాత్రను తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని టీడీపీ నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. విజయవాడలో యువ నాయకుడు దేవినేని చంద్రశేఖర్, దేవినేని ఉమా, ఎంపీ కేశినేని నాని, యలమంచిలి రాజేంద్రప్రసాద్‌ను హౌజ్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఎంపీ కేశినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామో లేక పాకిస్థాన్‌లో ఉన్నామో తెలియడం లేదని, […]
రాజధాని రైతుల ఉద్యమం ఉద్ధృతం అవుతోంది. నేడు మహిళలు భారీ పాదయాత్రను తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని టీడీపీ నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. విజయవాడలో యువ నాయకుడు దేవినేని చంద్రశేఖర్, దేవినేని ఉమా, ఎంపీ కేశినేని నాని, యలమంచిలి రాజేంద్రప్రసాద్‌ను హౌజ్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఎంపీ కేశినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామో లేక పాకిస్థాన్‌లో ఉన్నామో తెలియడం లేదని, రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఆరోపించారు. నిరసన తెలపడం ప్రజల హక్కు అని, ఉద్యమాన్ని ఎంత అణచివేస్తే, అంత ఎగసిపడుతుందని హెచ్చరించారు.
మరోవైపు తణుకులోనూ టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు వస్తోన్న టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుని కలిసేందుకు.. బయల్దేరిన రామానాయుడిని మధ్యలోనే అడ్డుకున్నారు పోలీసులు. ఆయన్ని కారులో నుంచి బలవంతంగా కిందకి దించేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరోవైపు మాజీ విప్ చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.